మంచి రచన మొదటి లక్షణం చదివించడం. అది ఆషామాషీగా పట్టుబడే లక్షణం కాదు. బాగా రచనలు చెయ్యగల మహానుభావులు కూడా కథని చెప్పడంలో నత్తనడక నడవడం నాకు తెలుసు. అయితే మరెవరో కారణాలకి వారి రచనలకి ఫోకస్ వస్తుంది. ఆ మొదటి, గొప్ప లక్షణాన్ని తన డెబ్బయవ ఏట మొదటి నవల రాసిన రామారాగారు సాధించారు. అంటే ఆయన మనస్సులో ఏదో అరలో తను భావించిన విషయాన్ని కళ్ళకు కట్టినట్టు చెప్పగల శిల్పం నిక్షిప్తంగా ఉన్నది. అది ఈ నవల మొదటి విజయం. రామారావు గారు అదృష్టవంతులు. ఈ వయస్సులో తన మనస్సులోని ఆలోచనలకు ఓ ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన ప్రక్రియకి రూపకల్పన చేశారు. సాహితీవ్యాసంగం జీవితాన్ని మరింత జీవనయోగ్యం చేసి - అక్షరంతో ఆయుష్షును ప్రకాశవంతం చేస్తుంది. ఈ వ్యాసంగాన్ని కొనసాగించమని నా సలహా.
- గొల్లపూడి మారుతీరావు
మంచి రచన మొదటి లక్షణం చదివించడం. అది ఆషామాషీగా పట్టుబడే లక్షణం కాదు. బాగా రచనలు చెయ్యగల మహానుభావులు కూడా కథని చెప్పడంలో నత్తనడక నడవడం నాకు తెలుసు. అయితే మరెవరో కారణాలకి వారి రచనలకి ఫోకస్ వస్తుంది. ఆ మొదటి, గొప్ప లక్షణాన్ని తన డెబ్బయవ ఏట మొదటి నవల రాసిన రామారాగారు సాధించారు. అంటే ఆయన మనస్సులో ఏదో అరలో తను భావించిన విషయాన్ని కళ్ళకు కట్టినట్టు చెప్పగల శిల్పం నిక్షిప్తంగా ఉన్నది. అది ఈ నవల మొదటి విజయం. రామారావు గారు అదృష్టవంతులు. ఈ వయస్సులో తన మనస్సులోని ఆలోచనలకు ఓ ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన ప్రక్రియకి రూపకల్పన చేశారు. సాహితీవ్యాసంగం జీవితాన్ని మరింత జీవనయోగ్యం చేసి - అక్షరంతో ఆయుష్షును ప్రకాశవంతం చేస్తుంది. ఈ వ్యాసంగాన్ని కొనసాగించమని నా సలహా. - గొల్లపూడి మారుతీరావు© 2017,www.logili.com All Rights Reserved.