సిటీకి దూరంగా! నిర్జన ప్రాంతం! ఎగుడు దిగుడుగా, గుట్టలు మెట్టలుగా ఉన్న మధ్య ప్రాంతంలో నుంచి ఒక కచ్చారోడ్డు సమతలంగా ఉన్న ప్రదేశం వైపు జారివచ్చినట్లుగా ఉంది. ఊరిచివర కావటంవల్ల, అక్కడ నుంచి 'నేషనల్ హైవే' దూరంగా ఉండటంతో, ఎలాంటి జనసమర్థం కన్పించటంలేదు. ఆ ఆరుబయలులో, పరుగులు తీస్తున్న గాలి ఈలవేస్తూ వచ్చి, కచ్చా రోడ్డుమీద ఉన్న మట్టిని ఒక్కసారి తనతో లేపి, కిలకిలా నవ్వుతూ దూసుకు వెళ్లిపోయింది.
హుషారుగా ఉన్న ఆ గాలి పిలుపుకి వేయి కోర్కెలతో, కోటి ఆశలతో ఆనందంగా లేచిన మట్టి, ఆ వేగం అందుకోలేక తనలో ఆశలురేపి నిర్దయగా వెళ్ళిపోయినా గాలిని చూసి విస్తుపోయినట్లుగా, ఒంటరిగా, ఏం చెయ్యాలో తెలియనట్లుగా, ఆశాభంగంతో చెల్లాచెదురయి, మెల్లగా నేలమీదకి సోలిపోతున్నట్టుగా వాలిపోయింది. అక్కడున్న చెట్లు, పుట్టలు, రాళ్ళు రప్పలు నిశ్శబ్దంగా ఈ దృశ్యాన్ని చూస్తున్నట్టు ఉండిపొయినాయి. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.
సిటీకి దూరంగా! నిర్జన ప్రాంతం! ఎగుడు దిగుడుగా, గుట్టలు మెట్టలుగా ఉన్న మధ్య ప్రాంతంలో నుంచి ఒక కచ్చారోడ్డు సమతలంగా ఉన్న ప్రదేశం వైపు జారివచ్చినట్లుగా ఉంది. ఊరిచివర కావటంవల్ల, అక్కడ నుంచి 'నేషనల్ హైవే' దూరంగా ఉండటంతో, ఎలాంటి జనసమర్థం కన్పించటంలేదు. ఆ ఆరుబయలులో, పరుగులు తీస్తున్న గాలి ఈలవేస్తూ వచ్చి, కచ్చా రోడ్డుమీద ఉన్న మట్టిని ఒక్కసారి తనతో లేపి, కిలకిలా నవ్వుతూ దూసుకు వెళ్లిపోయింది. హుషారుగా ఉన్న ఆ గాలి పిలుపుకి వేయి కోర్కెలతో, కోటి ఆశలతో ఆనందంగా లేచిన మట్టి, ఆ వేగం అందుకోలేక తనలో ఆశలురేపి నిర్దయగా వెళ్ళిపోయినా గాలిని చూసి విస్తుపోయినట్లుగా, ఒంటరిగా, ఏం చెయ్యాలో తెలియనట్లుగా, ఆశాభంగంతో చెల్లాచెదురయి, మెల్లగా నేలమీదకి సోలిపోతున్నట్టుగా వాలిపోయింది. అక్కడున్న చెట్లు, పుట్టలు, రాళ్ళు రప్పలు నిశ్శబ్దంగా ఈ దృశ్యాన్ని చూస్తున్నట్టు ఉండిపొయినాయి. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.© 2017,www.logili.com All Rights Reserved.