చేపలూ - తిమింగలాలూ
"రాజమణిగారూ, మీరు యీ దశలో నా కంపెనీలో ఎందుకు పెట్టుబడి పెడతా వంటున్నారో నాకు తెలియడం లేదు" అన్నాడు ఈశ్వర్ తెల్లబోతూ.
"మీలాగే కుండబద్దలు కొట్టి చెప్పమంటారా!? మీరు తయారుచేసే బయో- జనరేటర్కి భవిష్యత్తు వుందని నాకు నమ్మకం కుదిరింది కనక! రెండేళ్ల క్రితం మీరు మొదలు పెట్టినపుడు ఆత్మవిశ్వాసం, సాహసం మీకు పెట్టుబడి. ఈరోజు ఆశ, మీపై నమ్మకం నా యిన్వెస్ట్మెంట్." అన్నాడు రాజమణి చిరునవ్వుతో. "మరి ఈ నమ్మకం నేను కంపెనీ మొదలు పెట్టినపుడు లేదా? మన ల్యాబ్లో నుండి నేను రిజైన్ చేసి వచ్చినపుడు మీరంతా వారించినవారే కదా..”
అంత సూటిగా అడిగితే ఎలా? అయినా అబద్ధమాడితే మీకు నచ్చదని నాకు తెలుసు... అవును, అప్పుడు లేదు. ఇప్పుడు మీకు సక్సెస్ వస్తోందని తెలిసి నమ్మకం పుట్టింది... అలా ఎర్రగా చూడకండి.. ల్యాబ్లో వుండగా మీరు ఐదారుగురితో కలిసి రిసెర్చి చేసేవారు.
మీరు పరిశోధించిన విషయాలన్నీ మీ సీనియర్ తనపేర పబ్లిష్ చేసుకుంటున్నాడన్న అలకతో ఉద్యోగం వదిలేసి బయటకు వచ్చి కంపెనీ పెట్టుకుని ఓ ల్యాబ్ పెట్టుకుని రిసెర్చి కొనసాగించారు.
ఇది సక్సెసవుతుందని అప్పుడు మేం కలగన్నామా? పైగా అప్పుడు మీలో ఆవేశం, ఆక్రోశం కనబడింది కానీ వ్యాపారదక్షత కనబడలేదు...” రాజమణి ముక్కుసూటితనానికి ఈశ్వర్ ఫక్కున నవ్వేశాడు.
"ఆ మాటకొస్తే నాకు యిప్పటికీ వ్యాపారదక్షత అబ్బలేదు. మీరు గుర్తించవలసిన యింకో విషయం వుంది - నేను బయటకు వచ్చేసినది 'ఇంటలెక్చువల్ పైరసీ' మేధోచార్యం జరు గుతోందని కాదు, నాకు రావలసిన పేరు మా సీనియర్ కొట్టేస్తున్నాడన్న కడుపు మంటా కాదు. ప్రజలకు ఉపయోగపడే యీ ప్రాజెక్టుకి ప్రభుత్వం నిధులు యివ్వడం లేదన్నదే నా బాధ!
మీరు ఎక్కవుంట్స్ డిపార్టుమెంటులో వుండేవారు కాబట్టి మీకు తెలియదు కానీ మా సైంటిస్టుల నెవరి నడిగినా యీ విషయం చెప్తారు. నేను మినిస్ట్రీకి ఎన్నో ఉత్తరాలు రాశాను. వాళ్లు ఉలక్కపోయినా, పలక్కపోయినా మా సీనియర్కి ఏమీ............
చేపలూ - తిమింగలాలూ "రాజమణిగారూ, మీరు యీ దశలో నా కంపెనీలో ఎందుకు పెట్టుబడి పెడతా వంటున్నారో నాకు తెలియడం లేదు" అన్నాడు ఈశ్వర్ తెల్లబోతూ. "మీలాగే కుండబద్దలు కొట్టి చెప్పమంటారా!? మీరు తయారుచేసే బయో- జనరేటర్కి భవిష్యత్తు వుందని నాకు నమ్మకం కుదిరింది కనక! రెండేళ్ల క్రితం మీరు మొదలు పెట్టినపుడు ఆత్మవిశ్వాసం, సాహసం మీకు పెట్టుబడి. ఈరోజు ఆశ, మీపై నమ్మకం నా యిన్వెస్ట్మెంట్." అన్నాడు రాజమణి చిరునవ్వుతో. "మరి ఈ నమ్మకం నేను కంపెనీ మొదలు పెట్టినపుడు లేదా? మన ల్యాబ్లో నుండి నేను రిజైన్ చేసి వచ్చినపుడు మీరంతా వారించినవారే కదా..” అంత సూటిగా అడిగితే ఎలా? అయినా అబద్ధమాడితే మీకు నచ్చదని నాకు తెలుసు... అవును, అప్పుడు లేదు. ఇప్పుడు మీకు సక్సెస్ వస్తోందని తెలిసి నమ్మకం పుట్టింది... అలా ఎర్రగా చూడకండి.. ల్యాబ్లో వుండగా మీరు ఐదారుగురితో కలిసి రిసెర్చి చేసేవారు. మీరు పరిశోధించిన విషయాలన్నీ మీ సీనియర్ తనపేర పబ్లిష్ చేసుకుంటున్నాడన్న అలకతో ఉద్యోగం వదిలేసి బయటకు వచ్చి కంపెనీ పెట్టుకుని ఓ ల్యాబ్ పెట్టుకుని రిసెర్చి కొనసాగించారు. ఇది సక్సెసవుతుందని అప్పుడు మేం కలగన్నామా? పైగా అప్పుడు మీలో ఆవేశం, ఆక్రోశం కనబడింది కానీ వ్యాపారదక్షత కనబడలేదు...” రాజమణి ముక్కుసూటితనానికి ఈశ్వర్ ఫక్కున నవ్వేశాడు. "ఆ మాటకొస్తే నాకు యిప్పటికీ వ్యాపారదక్షత అబ్బలేదు. మీరు గుర్తించవలసిన యింకో విషయం వుంది - నేను బయటకు వచ్చేసినది 'ఇంటలెక్చువల్ పైరసీ' మేధోచార్యం జరు గుతోందని కాదు, నాకు రావలసిన పేరు మా సీనియర్ కొట్టేస్తున్నాడన్న కడుపు మంటా కాదు. ప్రజలకు ఉపయోగపడే యీ ప్రాజెక్టుకి ప్రభుత్వం నిధులు యివ్వడం లేదన్నదే నా బాధ! మీరు ఎక్కవుంట్స్ డిపార్టుమెంటులో వుండేవారు కాబట్టి మీకు తెలియదు కానీ మా సైంటిస్టుల నెవరి నడిగినా యీ విషయం చెప్తారు. నేను మినిస్ట్రీకి ఎన్నో ఉత్తరాలు రాశాను. వాళ్లు ఉలక్కపోయినా, పలక్కపోయినా మా సీనియర్కి ఏమీ............© 2017,www.logili.com All Rights Reserved.