పాలంకి సత్యగారు రాసిన "యుగాది" అనే 11 వ శతాబ్దం నాటి చారిత్రక నవలను పరిచయం చేస్తున్నాను. ఆవిడ విద్యాధికురాలైన రచయిత్రి. ఇది ఆంధ్రప్రభ వీక్లీలో 1996 ప్రాంతాల్లో సీరియల్గా వచ్చింది. ఆంధ్రమహాభారతం పుట్టుక గురించిన నవల. మనందరికీ తెలుసు దాన్ని రాసినది నన్నయ్య అనీ, రాజమహేంద్రవరాన్ని పాలించిన రాజరాజ నరేంద్రుడి కోరికపై ఆయన సంస్కృతభారతాన్ని తెలుగులో రాశాడనీ! అన్ని పురాణాలుండగా భారతాన్నే ఎందుకు అనువాదం చేయమన్నాడు? అంటే రాజరాజ నరేంద్రుడు కూడా పాండవులలాగానే చంద్రవంశీకుడు కాబట్టి అంటారు. అంతకుమించి పెద్దగా ఏమీ తెలియదు, మనలో చాలామందికి! అతని గురించి, అతని పూర్వీకుల గురించి ఈ నవల మనకు వివరంగా చెపుతుంది.
అసలీ రాజరాజు పేరు ఎక్కణ్నుంచి వచ్చింది? రాజరాజ చోళుడినుండి వచ్చింది. 1973లో 'రాజరాజచోళన్' అనే శివాజీ గణేశన్ సినిమా వచ్చింది. తెలుగులోకి కూడా డబ్ అయింది. రాజరాజ చోళుడు గొప్ప చక్రవర్తి, కావేరీ నదిపై ఆనకట్ట కట్టించి, దేశంలో చెరువులు తవ్వించి, తంజావూరు ప్రాంతాన్ని సుభిక్షంగా, కళలకు కాణాచిగా తీర్చిదిద్దిన ప్రభువు. తంజావూరు లో బృహదీ శ్వరాలయం అనే గొప్ప శివాలయాన్ని కట్టించాడు. ఇప్పటికి కూడా భరత నాట్యానికి, కర్ణాటక సంగీతానికి, తమిళ సాహిత్యానికి తంజావూరు పుట్టినిల్లు అనవచ్చు. రాజరాజు పాండ్యులను ఓడించి వాళ్ల రాజధాని అయిన మధురను కొట్టి, మధురాంతకుడన్న బిరుదు పొందాడు. మహా వీరుడు, రాజనీతి దురంధరుడు, కళాభిమాని. అంతా బాగానే వుంది కానీ అతని పేరు ఈ రాజరాజుకు ఎందుకు పెట్టారు? అంటారేమో, ఇతను అతని మనుమడు కనుక!......................
యుగాది పాలంకి సత్యగారు రాసిన "యుగాది" అనే 11 వ శతాబ్దం నాటి చారిత్రక నవలను పరిచయం చేస్తున్నాను. ఆవిడ విద్యాధికురాలైన రచయిత్రి. ఇది ఆంధ్రప్రభ వీక్లీలో 1996 ప్రాంతాల్లో సీరియల్గా వచ్చింది. ఆంధ్రమహాభారతం పుట్టుక గురించిన నవల. మనందరికీ తెలుసు దాన్ని రాసినది నన్నయ్య అనీ, రాజమహేంద్రవరాన్ని పాలించిన రాజరాజ నరేంద్రుడి కోరికపై ఆయన సంస్కృతభారతాన్ని తెలుగులో రాశాడనీ! అన్ని పురాణాలుండగా భారతాన్నే ఎందుకు అనువాదం చేయమన్నాడు? అంటే రాజరాజ నరేంద్రుడు కూడా పాండవులలాగానే చంద్రవంశీకుడు కాబట్టి అంటారు. అంతకుమించి పెద్దగా ఏమీ తెలియదు, మనలో చాలామందికి! అతని గురించి, అతని పూర్వీకుల గురించి ఈ నవల మనకు వివరంగా చెపుతుంది. అసలీ రాజరాజు పేరు ఎక్కణ్నుంచి వచ్చింది? రాజరాజ చోళుడినుండి వచ్చింది. 1973లో 'రాజరాజచోళన్' అనే శివాజీ గణేశన్ సినిమా వచ్చింది. తెలుగులోకి కూడా డబ్ అయింది. రాజరాజ చోళుడు గొప్ప చక్రవర్తి, కావేరీ నదిపై ఆనకట్ట కట్టించి, దేశంలో చెరువులు తవ్వించి, తంజావూరు ప్రాంతాన్ని సుభిక్షంగా, కళలకు కాణాచిగా తీర్చిదిద్దిన ప్రభువు. తంజావూరు లో బృహదీ శ్వరాలయం అనే గొప్ప శివాలయాన్ని కట్టించాడు. ఇప్పటికి కూడా భరత నాట్యానికి, కర్ణాటక సంగీతానికి, తమిళ సాహిత్యానికి తంజావూరు పుట్టినిల్లు అనవచ్చు. రాజరాజు పాండ్యులను ఓడించి వాళ్ల రాజధాని అయిన మధురను కొట్టి, మధురాంతకుడన్న బిరుదు పొందాడు. మహా వీరుడు, రాజనీతి దురంధరుడు, కళాభిమాని. అంతా బాగానే వుంది కానీ అతని పేరు ఈ రాజరాజుకు ఎందుకు పెట్టారు? అంటారేమో, ఇతను అతని మనుమడు కనుక!......................© 2017,www.logili.com All Rights Reserved.