సమాజ పరిశోధనలో ఊపిరి పోసుకున్న జీవన శకలాలు ఈ కథలు
శ్రీపాణ్యం దత్తశర్మగారు జ్ఞాన సంపన్నులు. ఆంగ్ల సంస్కృత పండితులు. స్వయం కృషితో ఎం.ఫిల్ వరకు ఎదిగి, ఉన్నతోన్నత స్థానాల్లో గురుతర బాధ్యతలు నిర్వహించిన ప్రతిభామూర్తి. ప్రసిద్ధ ఆంగ్ల మరియు తెలుగు కవివర్యులు.
'పండిన ఆయన జీవితానుభవాల్లోంచి వర్తమాన సమాజ అధ్యయనంలోంచి, మనోల్లాసం కలిగిస్తూ, సామాజిక ప్రయోజనాత్మక రచనలు చేయాలన్న తపనలోంచి పుట్టుకొచ్చిన కథల సంపుటి ఇది.
ఈ కథలన్నీ వాస్తవిక ఘటనల చుట్టూ అల్లుకున్నవే. ఎలాంటి సంక్లిష్టతా | లేకుండా, సాగిపోతూ చకచకా చదివించగల ద్రాక్షాపాక శైలి వీరిది.
ఎక్కడా కూడా నేల విడిచి సాము చెయ్యలేదు. ప్రయోజనం, సందేశం లేని కథ రాయలేదు. సరసమైన కథల్లో కూడా చక్కని సందేశం అందించారు.
ఈ సంపుటిలోని కథల్లోకెల్ల “ఆత్మసఖుడు” కథకు అగ్రతాంబూలం ఇస్తాను. భార్యాభర్తల అనుబంధం అర్థకామాలకే పరిమితం కాదనీ, వారు ఆజన్మ స్నేహితులనీ చాటిన కథ. కష్టనషాల్లో సైతం ఎలా వుండాలో ఎలా మసలాలో ఎలా వుంటే తమ 'ధర్మం' నిర్వర్తించినట్లు అవుతుందో స్పష్టంగా విడమరచి చెప్పారు...............
సమాజ పరిశోధనలో ఊపిరి పోసుకున్న జీవన శకలాలు ఈ కథలు శ్రీపాణ్యం దత్తశర్మగారు జ్ఞాన సంపన్నులు. ఆంగ్ల సంస్కృత పండితులు. స్వయం కృషితో ఎం.ఫిల్ వరకు ఎదిగి, ఉన్నతోన్నత స్థానాల్లో గురుతర బాధ్యతలు నిర్వహించిన ప్రతిభామూర్తి. ప్రసిద్ధ ఆంగ్ల మరియు తెలుగు కవివర్యులు. 'పండిన ఆయన జీవితానుభవాల్లోంచి వర్తమాన సమాజ అధ్యయనంలోంచి, మనోల్లాసం కలిగిస్తూ, సామాజిక ప్రయోజనాత్మక రచనలు చేయాలన్న తపనలోంచి పుట్టుకొచ్చిన కథల సంపుటి ఇది. ఈ కథలన్నీ వాస్తవిక ఘటనల చుట్టూ అల్లుకున్నవే. ఎలాంటి సంక్లిష్టతా | లేకుండా, సాగిపోతూ చకచకా చదివించగల ద్రాక్షాపాక శైలి వీరిది. ఎక్కడా కూడా నేల విడిచి సాము చెయ్యలేదు. ప్రయోజనం, సందేశం లేని కథ రాయలేదు. సరసమైన కథల్లో కూడా చక్కని సందేశం అందించారు. ఈ సంపుటిలోని కథల్లోకెల్ల “ఆత్మసఖుడు” కథకు అగ్రతాంబూలం ఇస్తాను. భార్యాభర్తల అనుబంధం అర్థకామాలకే పరిమితం కాదనీ, వారు ఆజన్మ స్నేహితులనీ చాటిన కథ. కష్టనషాల్లో సైతం ఎలా వుండాలో ఎలా మసలాలో ఎలా వుంటే తమ 'ధర్మం' నిర్వర్తించినట్లు అవుతుందో స్పష్టంగా విడమరచి చెప్పారు...............© 2017,www.logili.com All Rights Reserved.