బడదీది
ఈ పృధివిలో ఒక రకం మనుష్యులున్నారు. వాళ్ళు రెల్లుగడ్డిలాంటివాళ్ళు. గప్మని మండనూ వచ్చు, చప్పగా చల్లారిపోనూవచ్చు. వాళ్ళ వెనకాల సర్వదా ఓ మనిషి మాత్రం ఉంటూ ఉండాలి - అవసరాన్ని బట్టి గడ్డి వేస్తూ ఉండటానికి.
ఆడవాళ్ళు దీపారాధన చేసేటప్పుడు ప్రమిదలో నూనె, వత్తితోపాటు ఒక పూచికపుల్ల కూడా వేస్తారు. ఆ దీప శిఖ తగ్గిపోతున్నప్పుడు ఈ పనికిమాలిన పుల్ల ఎంతైనా అవసరం - ఎగతోయడానికి. అలా చేయకపోతే నూనే, వత్తీ ఉన్నప్పటికీ దీపం వెలగదు.
సురేంద్రనాథుడి స్వభావం కూడా చాలావరకు ఇలాంటిదే. అతడికి బలమూ, బుద్ధీ, విశ్వాసమూ అన్నీ ఉన్నాయి. అయినా అత డేపనినీ సంపూర్ణంగా నిర్వహించలేడు. కొంత పనిని అతడెంత ఉత్సాహంతో చేస్తాడో, మిగిలినదానిని అంత అశ్రద్ధగా వదిలేసి మెదల- కుండా కూర్చుంటాడు. అప్పుడే ఒక మనిషి అవసరం - అతణ్ని పురికొల్పటానికి.
సురేంద్రుడి తండ్రి పడమట దేశంలో ఒక వకీలు. వంగదేశంతో అతడికంతగా సంబంధమేమీలేదు. ఇక్కడే సురేంద్రుడు తన ఇరవయ్యోయేట ఎం.ఏ. ప్యాసయినాడు - కొంత తన శక్తివల్లా, కొంత సవతితల్లి ప్రోత్సాహంవల్లా. ఇలా సవతితల్లి ఎంత ప్రోద్బలం కలిగిస్తూ అతడివెంట అంటిపెట్టుకుని ఉన్నప్పటికీ, తనకేదైనా స్వాధీనతా బలం ఉన్నదా లేదా అన్న సంగతి అతడు చాలాసార్లు తెలుసుకోలేకపోయేవాడు. సురేంద్రుడంటూ ఓ స్వతంత్ర జీవి జగత్తులో ఉన్నాడా అంటే లేడు. ఈ సవతి తల్లి వాంఛలే ఒక మనుష్య రూపాన్ని ధరించి పని పాటలు, చదువు సంధ్యలూ, తిండి తిప్పలూ, పరీక్షలు పాసవడమూ మొదలైనవన్నీ నిర్వర్తిస్తున్నాయి. ఈ సవతి తల్లి తన సంతాన విషయంలో కొంత ఉదాసీనంగా ఉన్నప్పటికీ, సురేంద్రుణ్ణి అంతులేనంత అదుపులో పెట్టుతూ వుండేది. అతడు ఉమ్మివేయటం కూడా ఆమె దృష్టిని అతిక్రమించి జరిగేదికాదు. ఈ కర్తవ్య పరాయణి ఐన స్త్రీ ఆజ్ఞలో వుండి సురేంద్రుడు చదువు సంధ్యలు నేర్చుకున్నాడు. కాని తన మీద తాను ఆధారపడి ఉండటాన్ని మాత్రం నేర్చుకోలేదు. తనమీద తనకు విశ్వాసం లేదు. ఏ పనీ సర్వాంగ సుందరంగా తన వల్ల నెరువేరుతుందనే విశ్వాసం కూడా లేదతడికి. ఎప్పుడు తనకేది అవసరమో, తనెప్పుడు ఏం చెయ్యాలో సంపూర్ణంగా మరొకరిమీద ఆధారపడి ఉండేవాడు. నిద్రవస్తున్నదో, ఆకలి వేస్తున్నదో - చాలా సమయాల్లో ఇది కూడా నిర్ణయించుకోలేకపోయేవాడు. జ్ఞానం వచ్చి- నప్పటినుంచి, సవతితల్లి మీద ఆధారపడి, ఈ పదిహేనేళ్ళూ గడిపేశాడు. కేవలం సవతితల్లి.................
బడదీది ఈ పృధివిలో ఒక రకం మనుష్యులున్నారు. వాళ్ళు రెల్లుగడ్డిలాంటివాళ్ళు. గప్మని మండనూ వచ్చు, చప్పగా చల్లారిపోనూవచ్చు. వాళ్ళ వెనకాల సర్వదా ఓ మనిషి మాత్రం ఉంటూ ఉండాలి - అవసరాన్ని బట్టి గడ్డి వేస్తూ ఉండటానికి. ఆడవాళ్ళు దీపారాధన చేసేటప్పుడు ప్రమిదలో నూనె, వత్తితోపాటు ఒక పూచికపుల్ల కూడా వేస్తారు. ఆ దీప శిఖ తగ్గిపోతున్నప్పుడు ఈ పనికిమాలిన పుల్ల ఎంతైనా అవసరం - ఎగతోయడానికి. అలా చేయకపోతే నూనే, వత్తీ ఉన్నప్పటికీ దీపం వెలగదు. సురేంద్రనాథుడి స్వభావం కూడా చాలావరకు ఇలాంటిదే. అతడికి బలమూ, బుద్ధీ, విశ్వాసమూ అన్నీ ఉన్నాయి. అయినా అత డేపనినీ సంపూర్ణంగా నిర్వహించలేడు. కొంత పనిని అతడెంత ఉత్సాహంతో చేస్తాడో, మిగిలినదానిని అంత అశ్రద్ధగా వదిలేసి మెదల- కుండా కూర్చుంటాడు. అప్పుడే ఒక మనిషి అవసరం - అతణ్ని పురికొల్పటానికి. సురేంద్రుడి తండ్రి పడమట దేశంలో ఒక వకీలు. వంగదేశంతో అతడికంతగా సంబంధమేమీలేదు. ఇక్కడే సురేంద్రుడు తన ఇరవయ్యోయేట ఎం.ఏ. ప్యాసయినాడు - కొంత తన శక్తివల్లా, కొంత సవతితల్లి ప్రోత్సాహంవల్లా. ఇలా సవతితల్లి ఎంత ప్రోద్బలం కలిగిస్తూ అతడివెంట అంటిపెట్టుకుని ఉన్నప్పటికీ, తనకేదైనా స్వాధీనతా బలం ఉన్నదా లేదా అన్న సంగతి అతడు చాలాసార్లు తెలుసుకోలేకపోయేవాడు. సురేంద్రుడంటూ ఓ స్వతంత్ర జీవి జగత్తులో ఉన్నాడా అంటే లేడు. ఈ సవతి తల్లి వాంఛలే ఒక మనుష్య రూపాన్ని ధరించి పని పాటలు, చదువు సంధ్యలూ, తిండి తిప్పలూ, పరీక్షలు పాసవడమూ మొదలైనవన్నీ నిర్వర్తిస్తున్నాయి. ఈ సవతి తల్లి తన సంతాన విషయంలో కొంత ఉదాసీనంగా ఉన్నప్పటికీ, సురేంద్రుణ్ణి అంతులేనంత అదుపులో పెట్టుతూ వుండేది. అతడు ఉమ్మివేయటం కూడా ఆమె దృష్టిని అతిక్రమించి జరిగేదికాదు. ఈ కర్తవ్య పరాయణి ఐన స్త్రీ ఆజ్ఞలో వుండి సురేంద్రుడు చదువు సంధ్యలు నేర్చుకున్నాడు. కాని తన మీద తాను ఆధారపడి ఉండటాన్ని మాత్రం నేర్చుకోలేదు. తనమీద తనకు విశ్వాసం లేదు. ఏ పనీ సర్వాంగ సుందరంగా తన వల్ల నెరువేరుతుందనే విశ్వాసం కూడా లేదతడికి. ఎప్పుడు తనకేది అవసరమో, తనెప్పుడు ఏం చెయ్యాలో సంపూర్ణంగా మరొకరిమీద ఆధారపడి ఉండేవాడు. నిద్రవస్తున్నదో, ఆకలి వేస్తున్నదో - చాలా సమయాల్లో ఇది కూడా నిర్ణయించుకోలేకపోయేవాడు. జ్ఞానం వచ్చి- నప్పటినుంచి, సవతితల్లి మీద ఆధారపడి, ఈ పదిహేనేళ్ళూ గడిపేశాడు. కేవలం సవతితల్లి.................© 2017,www.logili.com All Rights Reserved.