పదండి ముందుకు పదండి పోదాం.......
లీడర్ అంటే తాను ముందు నడుస్తూ ఇతరులకు మార్గం చూపేవాడేకానీ, అందరి కంటే వెనుక సురక్షితంగా కూర్చొని జనాన్ని ముందుకు తోసేవాడు కాదు. అందుకే అంటారు నాయకుడు పుట్టుకతోనే నాయకుడుగా పుడతాడని. అలాంటి లీడర్ కి నిలువెత్తు ఉదాహరణ శ్రీ లావు(విజ్ఞాన్)రత్తయ్యగారు.
ప్రతి మనిషికి మెదడు మేధస్సు రెండు ఉంటాయి. ఎటొచ్చి వాటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలిసినది ఎంతమందికి? అన్నదే అసలైన ప్రశ్న.
. మోసం చెయ్యకుండా...... మోసం చెయ్యడానికి తావు ఇవ్వకుండా........
. కుయుక్తులు పన్నకుండా....ఎదుటివారి ఎత్తులకు చిత్తూవ్వకుండా.
. చేసే పనిని ఏ పరిస్థితుల్లోను ఆపకుండా విజయం సాధించే వరకు విశ్రమించకుండా మన కలను సాకారం చేసుకోవడం ఎలా?
. ఎన్ని సమస్యలు ఎదురైనా వాటిని సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలో
. ఒకవేళ సర్వం పోగొట్టుకున్న ఆ పోయినదాన్ని పోయినచోటు నుండే పదింతలుగా ఎలా తిరిగి పొందాలో
. ఇతరులు మనపై విసిరే రాళ్ళని మనం సోపానముగా ఎలా మార్చుకోవాలో
. ఒక పద్ధతి ప్రకారం దేనికి ముందు అటెన్షన్ ఇవ్వాలో దేన్నీ వోదిలేయ్యాలో మనుషుల్ని ఎలా అంచనా వేయాలో, ఆ అంచనాలకు తగిన ఫలితాన్ని ఎలా రాబట్టుకోవాలో
. ఒక విజ్ఞాన్ తో నేటి మొక్కల్ని రేపటి మహా వృక్షాలుగా ఎలా మలచాలో..... చాలా చక్కగా వివరిస్తుంది ఈ పుస్తకం.
నిజానికి ఇది పుస్తకం కాదు.
ఒక చిన్న పల్లెటూరులో పుట్టి స్వయంకృషిలో హిమాలయాలంత ఎత్తుకి ఎదిగిన ఒక నాయకుడి జీవితమిది.
వ్యక్తే వ్యవస్థగా మారిన అద్భుతమిది.
చాలామంది ఇతరుల్ని ఇతరుల జీవితాల్ని ఉదాహరణగా తీసుకుంటారు. కాని, అతి తక్కువ మంది మాత్రమే ఇతరులకు ఉదాహరణ స్పూర్తిగా తమని తాము మలుచుకుంటారు.
ఆ అతి తక్కువ మందిలో స్పూర్తికి మారుపేరే శ్రీ లావు (విజ్ఞాన్) రత్తయ్య. అయన తన జీవితాన్ని నిర్మించుకోవడమేగాక ఎందరో తమ జీవితాల్ని నిర్మించుకోవడానికి స్పూర్తిని ఈ పుస్తకం ద్వారా ఇచ్చారు. ఇస్తున్నారు.
ఈ పదండి ముందుకు పుస్తకం చదివే వారికి కరదీపిక కావాలని కోరుకుంటూ ఈ పుస్తకాన్ని అక్షరబద్ధం చేసిన అరుణ పప్పు గారిని అభినందిస్తూ................
భువనచంద్ర.
పదండి ముందుకు పదండి పోదాం....... లీడర్ అంటే తాను ముందు నడుస్తూ ఇతరులకు మార్గం చూపేవాడేకానీ, అందరి కంటే వెనుక సురక్షితంగా కూర్చొని జనాన్ని ముందుకు తోసేవాడు కాదు. అందుకే అంటారు నాయకుడు పుట్టుకతోనే నాయకుడుగా పుడతాడని. అలాంటి లీడర్ కి నిలువెత్తు ఉదాహరణ శ్రీ లావు(విజ్ఞాన్)రత్తయ్యగారు. ప్రతి మనిషికి మెదడు మేధస్సు రెండు ఉంటాయి. ఎటొచ్చి వాటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలిసినది ఎంతమందికి? అన్నదే అసలైన ప్రశ్న. . మోసం చెయ్యకుండా...... మోసం చెయ్యడానికి తావు ఇవ్వకుండా........ . కుయుక్తులు పన్నకుండా....ఎదుటివారి ఎత్తులకు చిత్తూవ్వకుండా. . చేసే పనిని ఏ పరిస్థితుల్లోను ఆపకుండా విజయం సాధించే వరకు విశ్రమించకుండా మన కలను సాకారం చేసుకోవడం ఎలా? . ఎన్ని సమస్యలు ఎదురైనా వాటిని సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలో . ఒకవేళ సర్వం పోగొట్టుకున్న ఆ పోయినదాన్ని పోయినచోటు నుండే పదింతలుగా ఎలా తిరిగి పొందాలో . ఇతరులు మనపై విసిరే రాళ్ళని మనం సోపానముగా ఎలా మార్చుకోవాలో . ఒక పద్ధతి ప్రకారం దేనికి ముందు అటెన్షన్ ఇవ్వాలో దేన్నీ వోదిలేయ్యాలో మనుషుల్ని ఎలా అంచనా వేయాలో, ఆ అంచనాలకు తగిన ఫలితాన్ని ఎలా రాబట్టుకోవాలో . ఒక విజ్ఞాన్ తో నేటి మొక్కల్ని రేపటి మహా వృక్షాలుగా ఎలా మలచాలో..... చాలా చక్కగా వివరిస్తుంది ఈ పుస్తకం. నిజానికి ఇది పుస్తకం కాదు. ఒక చిన్న పల్లెటూరులో పుట్టి స్వయంకృషిలో హిమాలయాలంత ఎత్తుకి ఎదిగిన ఒక నాయకుడి జీవితమిది. వ్యక్తే వ్యవస్థగా మారిన అద్భుతమిది. చాలామంది ఇతరుల్ని ఇతరుల జీవితాల్ని ఉదాహరణగా తీసుకుంటారు. కాని, అతి తక్కువ మంది మాత్రమే ఇతరులకు ఉదాహరణ స్పూర్తిగా తమని తాము మలుచుకుంటారు. ఆ అతి తక్కువ మందిలో స్పూర్తికి మారుపేరే శ్రీ లావు (విజ్ఞాన్) రత్తయ్య. అయన తన జీవితాన్ని నిర్మించుకోవడమేగాక ఎందరో తమ జీవితాల్ని నిర్మించుకోవడానికి స్పూర్తిని ఈ పుస్తకం ద్వారా ఇచ్చారు. ఇస్తున్నారు. ఈ పదండి ముందుకు పుస్తకం చదివే వారికి కరదీపిక కావాలని కోరుకుంటూ ఈ పుస్తకాన్ని అక్షరబద్ధం చేసిన అరుణ పప్పు గారిని అభినందిస్తూ................ భువనచంద్ర.© 2017,www.logili.com All Rights Reserved.