పెళ్ళి తులాభారమయ్యాక పెళ్ళి కూతుళ్ళందరూ సత్యభామలు కావాల్సిందే నంటున్నారు. తులసి పత్రంతో మొగ్గు చూపుతుందనుకోవడం వధువు అమాయకత్వమే అంటాడు. ఇప్పుడొస్తున్న చేటంత కార్డులు ఈ కవి దృష్టిలో "వెండి కవచాలు". వధువు ఎబ్బెట్టు అలంకరణను చూచి కవి ఏమంటున్నాడో తెలుసా-
"అమ్మాయి ఆభరణాలు మొయ్యలేక
చేపను పట్టిన గాలంలా వొంగి పోయింది...
అతని ఆస్తేoతో అతనికి తెలియదు
ప్రభుత్వానికి తెలుసు
డోలూ సన్నాయీ అతనే
ప్రభుత్వం పెళ్ళి చేసుకున్నా
అంత్యక్రియలు జరుపుకున్నా"
బాగా పేలింది కదూ బాణాసంచాని ఒక్క గంటకు మించి కాల్చవద్దన్న రోజుల్లో కూడ!
"అదుపు చేయవలసింది శబ్దాన్ని" అని గుర్తు చేస్తుందీయన కవిత్వం.
- అడిగోపుల వెంకటరత్నమ్