ఈ నాటకం మీముందు తెరాతీయబోతున్న ప్రపంచంలోకి మీరు ప్రవేశించే ముందు రెండు మాటలు. సుప్రసిద్ధ నాటక రచయిత, కవి, కేంద్ర సంగీత, నాటక అకాడెమీ పురస్కార స్వీకర్త డా దీర్ఘాసి విజయభాస్కర్ తెలుగు సాహిత్యానికి సమర్పిస్తున్న మరొక విలువైన కానుక ఈ నాటకం 'రాజిగాడు రాజయ్యాడు.' ఇందులో మూడు విశిష్టతలున్నాయి. మొదటిది, ఇది ఉత్తరాంధ్ర సాహిత్య వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న రచన, రెండవది సామాజికన్యాయ సాధనకోసం నేడు దేశమంతటా చెలరేగుతున్న ఉద్యమాల్లో ఇంతదాకా ఎవరూ స్పృశించని జీవితాన్ని, ఇతిహాసపు చీకటికోణం మరుగున పడిపోయిన ఒక కథనాన్ని మనముందుకు తెస్తున్న రచన. మూడవది, నాటకరచనలో, నిర్మాణంలో సిద్ధహస్తుడైన ఒక రచయిత ఇప్పటి అవసరాలకు తగ్గట్టుగా చేసిన కొత్త ప్రయోగం.
ఈ నాటకం మీముందు తెరాతీయబోతున్న ప్రపంచంలోకి మీరు ప్రవేశించే ముందు రెండు మాటలు. సుప్రసిద్ధ నాటక రచయిత, కవి, కేంద్ర సంగీత, నాటక అకాడెమీ పురస్కార స్వీకర్త డా దీర్ఘాసి విజయభాస్కర్ తెలుగు సాహిత్యానికి సమర్పిస్తున్న మరొక విలువైన కానుక ఈ నాటకం 'రాజిగాడు రాజయ్యాడు.' ఇందులో మూడు విశిష్టతలున్నాయి. మొదటిది, ఇది ఉత్తరాంధ్ర సాహిత్య వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న రచన, రెండవది సామాజికన్యాయ సాధనకోసం నేడు దేశమంతటా చెలరేగుతున్న ఉద్యమాల్లో ఇంతదాకా ఎవరూ స్పృశించని జీవితాన్ని, ఇతిహాసపు చీకటికోణం మరుగున పడిపోయిన ఒక కథనాన్ని మనముందుకు తెస్తున్న రచన. మూడవది, నాటకరచనలో, నిర్మాణంలో సిద్ధహస్తుడైన ఒక రచయిత ఇప్పటి అవసరాలకు తగ్గట్టుగా చేసిన కొత్త ప్రయోగం.© 2017,www.logili.com All Rights Reserved.