రామాయణ భారత భాగవత మహేతిహాసాలు భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు పుట్టుగొమ్మలు. అవిగాక అష్టాదశ పురాణాలూ, అనేకానేక ఉపపురాణాలున్నాయి. ఇక పుక్కిటి పురాణాలకు, అవాల్మీకాలకు కొదవెలదు. వీటన్నింటిని కధలు, లో కథలు, కథల్లోని కథలుగా చదువుతుంటే చెరకుగడను పంటితో నమిలి తియ్యటి ఆ రసాన్ని ఆస్వాదించినంత హాయిగా, అనందంగా ఉంటుంది.
పురాణాలలోని నీతినే పురానితి అనే శీర్షికతో ఫన్దే పాఠకులకు కధలుగా చేబితే ఎలా ఉంటుంది అన్న మా ఫీచర్స్ అండ్ ఫండే ఎడిటర్ రామ్గారి ఆలోచనకు ప్రతిరూపమే పురానితి. ఈ శీర్షికను మొదట కొన్ని వారాలపాటు మా మిత్రుడు జగన్నాధ దాసు ఏంతో చక్కగా నడిపించాడు. అయితే, పనిభారం, బాధ్యతల బరువు ఆయన్ని ఆ ఫీచర్ను కొనసాగించనివ్వలేదు. ఇందులో కొన్ని కథలు పురాణాలలోనివి కాకపోవచ్చు. నీతిగా రాసుకున్న పురాణగాధలే అని మాత్రం గుండెల మీద చెయ్యేసుకుని మరి చెబుతున్నాను.
-డి.వి.ఆర్.భాస్కర్.