నా కవితా వనంలో మొలచిన నాలుగో ముక్క ఇది! భారత దేశం అంత గొప్పది ఇంత గొప్పది అని చెప్పుకోవటమేకాని నిజంగా క్రియలో శూన్యం! ఆడదానికి విలువ ఇవ్వలేని ఈ జనం, ఆడదాన్ని అంత గౌరవిస్తాం, ఇంత గౌరవిస్తాం అంటూ భాషణ లెందుకు! శుద్ధ దండగ! మంచి మనుషులు తక్కువ అవుతున్న ఈ తరుణంలో చెడు పూర్తిగా అవుతున్న ఈ తరుణంలో చెడు పూర్తిగా తగ్గిపోవలసిన అవసరం ఉంది! భర్త భార్యకి విలువిస్తున్నాడా! మగవాడు ఆడదాన్ని గౌరవిస్తున్నాడా! కాలుష్యంతో నింపబడిన ఈ సమాజం మారేదెప్పుడు! ఆడదాని ఎదలోని బాధగ్ని చల్లారేదేప్పుడు! సమాజంలో ఎన్ని రకాల చెడు ఉందో ఎత్తి చూపుతూ మారమని సందేశం ఇచ్చాను. మేఘాలతో చేలిమిచేసి ఆకాశంలో వారధి కట్టి ఊహల పల్లకిలో అలా అలా తిరగటంలో ఎంత ఆనందం ఉందో ఎత్తి చూపాను. నా నాలుగో ముక్కకు పూసిన పువ్వులు భిన్న రకాలు! ఆ పువ్వుల్లో రకాల భావాలు నిక్షిప్తమైయున్నవి. ఎవరికి తగలవలసిన బాణాలు వాళ్ళకి తగిలి తీరతాయి! గుచ్చుకున్న బాణాలు గురించి ఒక్క క్షణం ఆలోచించి మిమ్ముల్ని మీరు సరిచేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.
చెన్నుపాటి లక్ష్మివర్మ
నా కవితా వనంలో మొలచిన నాలుగో ముక్క ఇది! భారత దేశం అంత గొప్పది ఇంత గొప్పది అని చెప్పుకోవటమేకాని నిజంగా క్రియలో శూన్యం! ఆడదానికి విలువ ఇవ్వలేని ఈ జనం, ఆడదాన్ని అంత గౌరవిస్తాం, ఇంత గౌరవిస్తాం అంటూ భాషణ లెందుకు! శుద్ధ దండగ! మంచి మనుషులు తక్కువ అవుతున్న ఈ తరుణంలో చెడు పూర్తిగా అవుతున్న ఈ తరుణంలో చెడు పూర్తిగా తగ్గిపోవలసిన అవసరం ఉంది! భర్త భార్యకి విలువిస్తున్నాడా! మగవాడు ఆడదాన్ని గౌరవిస్తున్నాడా! కాలుష్యంతో నింపబడిన ఈ సమాజం మారేదెప్పుడు! ఆడదాని ఎదలోని బాధగ్ని చల్లారేదేప్పుడు! సమాజంలో ఎన్ని రకాల చెడు ఉందో ఎత్తి చూపుతూ మారమని సందేశం ఇచ్చాను. మేఘాలతో చేలిమిచేసి ఆకాశంలో వారధి కట్టి ఊహల పల్లకిలో అలా అలా తిరగటంలో ఎంత ఆనందం ఉందో ఎత్తి చూపాను. నా నాలుగో ముక్కకు పూసిన పువ్వులు భిన్న రకాలు! ఆ పువ్వుల్లో రకాల భావాలు నిక్షిప్తమైయున్నవి. ఎవరికి తగలవలసిన బాణాలు వాళ్ళకి తగిలి తీరతాయి! గుచ్చుకున్న బాణాలు గురించి ఒక్క క్షణం ఆలోచించి మిమ్ముల్ని మీరు సరిచేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. చెన్నుపాటి లక్ష్మివర్మ© 2017,www.logili.com All Rights Reserved.