Devils Mind
అతని కళ్ళు బోరుబావుల్లా లోతుకు పోయున్నాయి. అవి శూన్యంలోకి చూస్తూ మనసులో ఏదో అంత:పరిశోధన చేస్తున్నట్టు ఉన్నాయి. అతని ముఖం దుమ్ముతో కొట్టుకుపోయి, పెదవులు తడారిపోయాయి. తైల సంస్కారం లేక జుట్టు అట్టలు కట్టి ఉంది. అతని కాళ్ళకి తగిలిన దెబ్బల కారణంగా రక్తం గడ్డ కట్టి చీము పట్టింది. పొట్ట లోపలికి పోయి చూడటానికి భైరాగిలా భయంకరంగా ఉన్నాడు. మౌనం మాటై, చూపే భాషై చాలా విచిత్రంగా ఉన్నాడు. దారినపోయే వాళ్ళు పిచ్చోడన్నారు. పిచ్చోళ్ళు దేవుడన్నారు. గుళ్ళో దేవుడు మాత్రం చిన్నగా నవ్వుకున్నాడు.
అప్పుడే చిన్నగా వర్షం మొదలైంది. దిగ్గున లేచి నుంచున్నాడు. గోడకి ఆంచి ఉంచిన గడ్డ పార, గునపం తీసుకున్నాడు. నిలువునా తడిసినా లెక్కచేయకుండా చెప్పుల్లేకుండా వేగంగా నడక మొదలు పెట్టాడు. కళ్ళు మండుతున్నా రెప్పవాల్చకుండా సూటిగా చూస్తూ నడక సాగించాడు. ఎడం భుజం మీద గడ్డపార, కుడి చేతిలో గునపం పట్టుకుని వెళ్తున్న అతన్ని చూస్తే ఎవరికైనా భయం కలగకమానదు. ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన ఒక పట్టణంలా అస్తవ్యస్తంగా ఉన్నాడు. వర్షంలో అలా నడుచుకుంటూ చాలా దూరం వెళ్ళి ఓ నిర్మానుష్యమైన ప్రాంతానికి చేరుకున్నాడు. తలెత్తి ఆకాశంకేసి వింతగా చూసాడు. ఆకాశం అతనెవరో పోల్చుకోవడానికా అన్నట్టు మెరుపు వెలుగులో అతన్ని చూసింది. అందుకు దానికి కలిగిన భయానికి ఎక్కడో పిడుగు శబ్దం.
దూరంగా ఉన్న హైవే మీద వెళ్తున్న వాహనాల హారన్స్ లీలగా వినిపిస్తున్నాయ్. భుజం మీదున్న గడ్డపారను కింద పెట్టాడు. తలొంచి కాళ్ళ కిందున్న భూమిని చూసాడు. గునపాన్ని ఎత్తి భూమిలో దించాడు. భూమాత అయోమయంతో.................
Devils Mind అతని కళ్ళు బోరుబావుల్లా లోతుకు పోయున్నాయి. అవి శూన్యంలోకి చూస్తూ మనసులో ఏదో అంత:పరిశోధన చేస్తున్నట్టు ఉన్నాయి. అతని ముఖం దుమ్ముతో కొట్టుకుపోయి, పెదవులు తడారిపోయాయి. తైల సంస్కారం లేక జుట్టు అట్టలు కట్టి ఉంది. అతని కాళ్ళకి తగిలిన దెబ్బల కారణంగా రక్తం గడ్డ కట్టి చీము పట్టింది. పొట్ట లోపలికి పోయి చూడటానికి భైరాగిలా భయంకరంగా ఉన్నాడు. మౌనం మాటై, చూపే భాషై చాలా విచిత్రంగా ఉన్నాడు. దారినపోయే వాళ్ళు పిచ్చోడన్నారు. పిచ్చోళ్ళు దేవుడన్నారు. గుళ్ళో దేవుడు మాత్రం చిన్నగా నవ్వుకున్నాడు. అప్పుడే చిన్నగా వర్షం మొదలైంది. దిగ్గున లేచి నుంచున్నాడు. గోడకి ఆంచి ఉంచిన గడ్డ పార, గునపం తీసుకున్నాడు. నిలువునా తడిసినా లెక్కచేయకుండా చెప్పుల్లేకుండా వేగంగా నడక మొదలు పెట్టాడు. కళ్ళు మండుతున్నా రెప్పవాల్చకుండా సూటిగా చూస్తూ నడక సాగించాడు. ఎడం భుజం మీద గడ్డపార, కుడి చేతిలో గునపం పట్టుకుని వెళ్తున్న అతన్ని చూస్తే ఎవరికైనా భయం కలగకమానదు. ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన ఒక పట్టణంలా అస్తవ్యస్తంగా ఉన్నాడు. వర్షంలో అలా నడుచుకుంటూ చాలా దూరం వెళ్ళి ఓ నిర్మానుష్యమైన ప్రాంతానికి చేరుకున్నాడు. తలెత్తి ఆకాశంకేసి వింతగా చూసాడు. ఆకాశం అతనెవరో పోల్చుకోవడానికా అన్నట్టు మెరుపు వెలుగులో అతన్ని చూసింది. అందుకు దానికి కలిగిన భయానికి ఎక్కడో పిడుగు శబ్దం. దూరంగా ఉన్న హైవే మీద వెళ్తున్న వాహనాల హారన్స్ లీలగా వినిపిస్తున్నాయ్. భుజం మీదున్న గడ్డపారను కింద పెట్టాడు. తలొంచి కాళ్ళ కిందున్న భూమిని చూసాడు. గునపాన్ని ఎత్తి భూమిలో దించాడు. భూమాత అయోమయంతో.................© 2017,www.logili.com All Rights Reserved.