ఈ చిన్న పుస్తకం చారిత్రికంగా ఎంతో విలువైంది.
మహారాష్ట్రలో బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమానికి కేంద్రం కొల్హాపూర్ పట్టణం. ఆ కొల్హాపూర్ పట్టణంలో మే 11, 1988లో గోవింద్ పన్సార్ తాను చేసిన ప్రసంగం ఆధారంగా ఈ పుస్తకం రాశారు. ఆ ప్రసంగంలో ఆయన సమకాలీన అభ్యుదయ, లౌకిక దృక్పథాన్ని దృష్టిలో ఉంచుకొని శివాజీ చుట్టూ ఆవరించి ఉన్న నిజానిజాలను హేతుబద్ధ ఆలోచనతో ముందుకు తెచ్చారు. ఉపన్యాసం చేసిన పదకొండు నెలల తర్వాత పన్సారే ఈ పుస్తకం తెచ్చారు. మరాఠీలో పుస్తకం పేరు "శివాజీ కోన్ హోతా?". ఆ పదకొండు నెలల వ్యవధిలో సిపిఐ అనుబంధ అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) కార్యకర్తలు, రికార్డు చేసిన ఆయన ఉపన్యాసాన్ని మహారాష్ట్రలో అనేక చోట్ల ప్రచారంలోకి తెచ్చారు.
పుస్తకం మొదటి ప్రచురణ 1988 ఏప్రిల్లో మూడు వేల కాపీలతో వెలువడింది.
నెలరోజుల్లోనే అన్నీ అమ్ముడు పోయాయి. పుస్తకం సిద్ధమవుతుండగా పన్సారె అనేకచోట్ల ఇదే అంశంపై ప్రసంగించారు. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం ఉండే నాగ్పూర్లోనూ, శివసేనకు బలం గల యావత్మల్లోనూ ఆయన ఉపన్యసించారు. యావత్మల్లో ఉపన్యాసాన్ని అడ్డుకోవడానికి శివసేన విఫల ప్రయత్నం చేసింది...............
పరిచయం చారిత్రిక పురుషుడు శివాజీ ఈ చిన్న పుస్తకం చారిత్రికంగా ఎంతో విలువైంది. మహారాష్ట్రలో బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమానికి కేంద్రం కొల్హాపూర్ పట్టణం. ఆ కొల్హాపూర్ పట్టణంలో మే 11, 1988లో గోవింద్ పన్సార్ తాను చేసిన ప్రసంగం ఆధారంగా ఈ పుస్తకం రాశారు. ఆ ప్రసంగంలో ఆయన సమకాలీన అభ్యుదయ, లౌకిక దృక్పథాన్ని దృష్టిలో ఉంచుకొని శివాజీ చుట్టూ ఆవరించి ఉన్న నిజానిజాలను హేతుబద్ధ ఆలోచనతో ముందుకు తెచ్చారు. ఉపన్యాసం చేసిన పదకొండు నెలల తర్వాత పన్సారే ఈ పుస్తకం తెచ్చారు. మరాఠీలో పుస్తకం పేరు "శివాజీ కోన్ హోతా?". ఆ పదకొండు నెలల వ్యవధిలో సిపిఐ అనుబంధ అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) కార్యకర్తలు, రికార్డు చేసిన ఆయన ఉపన్యాసాన్ని మహారాష్ట్రలో అనేక చోట్ల ప్రచారంలోకి తెచ్చారు. పుస్తకం మొదటి ప్రచురణ 1988 ఏప్రిల్లో మూడు వేల కాపీలతో వెలువడింది. నెలరోజుల్లోనే అన్నీ అమ్ముడు పోయాయి. పుస్తకం సిద్ధమవుతుండగా పన్సారె అనేకచోట్ల ఇదే అంశంపై ప్రసంగించారు. ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం ఉండే నాగ్పూర్లోనూ, శివసేనకు బలం గల యావత్మల్లోనూ ఆయన ఉపన్యసించారు. యావత్మల్లో ఉపన్యాసాన్ని అడ్డుకోవడానికి శివసేన విఫల ప్రయత్నం చేసింది...............© 2017,www.logili.com All Rights Reserved.