నాడోడి బతుకులు
నేను సేని కాణ్ణించి అప్పుడే ఇంటికొచ్చినాను. నా మనువుడు రూపేసు బాబు పదో తరగతి చదవతాడు. వాడు పేపర్లు సేతబట్టుకొని “తాతా! తాతా!” అంటా పరిగెత్తుకొచ్చినాడు.
నేను “యావిరా! అట్టా పరిగెత్తి వొస్తా వుండావు" అని అడిగినాను.
వాడు “తాతా! నువ్వు ఉత్తమ సర్పంచిగా రాష్ట్రపతి అవార్డుకు ఎన్నికైనావని అన్ని పేపర్లల్లో ఏసుండారు సూడు” అని సూపించినాడు. అది సూసి నాకు శానా సంతోసమై పొయింది.
ఈ సంగతి ఇంట్లో వోళ్ళకే గాక సుట్టుపక్కల అందరికీ తెల్సి వొచ్చేసి “యంగటేసయా! నువు అదురుష్ట వంతుడ" ని ఒకరంటే, “యంగటేసా! నువు నక్క తోక తొక్కినావురా!” అని ఒకరంటే, ఇట్ట అందురూ జేరి పొగిడేసి పొయినారు. ఆ పేపరు తీసుకొని కూడి కూడి నేను సదవతా ఉంటే, నా సిన్నప్పట్నించీ జరిగిన సంగతులన్నీ ఒక్కొక్కటే గుర్తుకొచ్చినాయి.
ఆ పొద్దు తొలి కోడి కూస్తానే నాకు మెలుకువొచ్చేసింది. లేసి ఈదిలేకొచ్చి ఆకాశం కల్ల సూసినాను. యన్నెల పట్టపగులు మాదిరిగా కాస్తావుంది. మా కాల్నీ సుట్టూ ఉండే కొండలూ గుట్టలూ ఆ యన్నెల్లో తడిసి ముద్దవతా వుండాయి.
మల్లా పొయి పడుకున్నాను గానీ, నిద్దర పట్ట లేదు. యందుకంటే మొన్ననే మా పెంచులయ్య మావ మర్రిమాకల కండిగలో సింతకాయలు రాల్సను పొయి మాను మింద నుంచి పడి సచ్చిపొయినాడు. ఆయన పెండ్లాం పసిది. ఇద్దురు సిన్న పిలకాయలు గూడా ఉండారు.
నిన్న మా వోబులు అనుమంతు రాయుడి బోటుకాడ తేనె తీయ్యను బొయి బోటు మిందకు మాల గట్టి తేనె గూడా తీసినాడంట. దిగబడి వచ్చేటప్పుడు మూరిశెట్టి గోవింద్..................
నాడోడి బతుకులు నేను సేని కాణ్ణించి అప్పుడే ఇంటికొచ్చినాను. నా మనువుడు రూపేసు బాబు పదో తరగతి చదవతాడు. వాడు పేపర్లు సేతబట్టుకొని “తాతా! తాతా!” అంటా పరిగెత్తుకొచ్చినాడు. నేను “యావిరా! అట్టా పరిగెత్తి వొస్తా వుండావు" అని అడిగినాను. వాడు “తాతా! నువ్వు ఉత్తమ సర్పంచిగా రాష్ట్రపతి అవార్డుకు ఎన్నికైనావని అన్ని పేపర్లల్లో ఏసుండారు సూడు” అని సూపించినాడు. అది సూసి నాకు శానా సంతోసమై పొయింది. ఈ సంగతి ఇంట్లో వోళ్ళకే గాక సుట్టుపక్కల అందరికీ తెల్సి వొచ్చేసి “యంగటేసయా! నువు అదురుష్ట వంతుడ" ని ఒకరంటే, “యంగటేసా! నువు నక్క తోక తొక్కినావురా!” అని ఒకరంటే, ఇట్ట అందురూ జేరి పొగిడేసి పొయినారు. ఆ పేపరు తీసుకొని కూడి కూడి నేను సదవతా ఉంటే, నా సిన్నప్పట్నించీ జరిగిన సంగతులన్నీ ఒక్కొక్కటే గుర్తుకొచ్చినాయి. ఆ పొద్దు తొలి కోడి కూస్తానే నాకు మెలుకువొచ్చేసింది. లేసి ఈదిలేకొచ్చి ఆకాశం కల్ల సూసినాను. యన్నెల పట్టపగులు మాదిరిగా కాస్తావుంది. మా కాల్నీ సుట్టూ ఉండే కొండలూ గుట్టలూ ఆ యన్నెల్లో తడిసి ముద్దవతా వుండాయి. మల్లా పొయి పడుకున్నాను గానీ, నిద్దర పట్ట లేదు. యందుకంటే మొన్ననే మా పెంచులయ్య మావ మర్రిమాకల కండిగలో సింతకాయలు రాల్సను పొయి మాను మింద నుంచి పడి సచ్చిపొయినాడు. ఆయన పెండ్లాం పసిది. ఇద్దురు సిన్న పిలకాయలు గూడా ఉండారు. నిన్న మా వోబులు అనుమంతు రాయుడి బోటుకాడ తేనె తీయ్యను బొయి బోటు మిందకు మాల గట్టి తేనె గూడా తీసినాడంట. దిగబడి వచ్చేటప్పుడు మూరిశెట్టి గోవింద్..................© 2017,www.logili.com All Rights Reserved.