అదిగో పులి
కాకినాడ నుంచి అడ్డతీగల వెళ్ళే బస్సు, కీచుమని శబ్దం చేస్తూ సడన్ గా, ఆగేసరికి, కబుర్లలో పడిన ప్యాసింజర్లు అందరూ ఉలిక్కిపడి రోడ్డు వైపు చూశారు. అందరి గుండెలు ఒక్కసారిగా గుభేలుమన్నాయి. రోడ్డుకు అడ్డంగా పడుకుని ఉందొక పెద్ద పులి. బస్ లైట్ల వెలుగులో అందంగా మెరిసిపోతున్న ఆ పెద్దపులి ధీమాగా బస్సు వంకే చూస్తూ, కదలకుండా మెదలకుండా కూర్చుంది. కొంతమంది హడావిడిగా కిటికీలకున్న షట్టర్లను మూసేస్తున్నారు. మరి కొంతమంది వాళ్ళకు సాయం చేస్తున్నారు. కండక్టర్ తన దగ్గరున్న తలుపును మూసేసి, బోల్ట్ బిగించి, ఆ పులి వైపే భయంగా చూస్తున్నాడు. బస్సులో ఉన్న పెద్దా - చిన్నా, ఆడ - మగా తేడా లేకుండా అందరూ భయంతో వణికిపోతున్నారు. చల్లగాలి వీస్తున్నా, డ్రైవర్కి చెమట్లు పడుతున్నాయి. ఆ డ్రైవరు, కండక్టరు చాలా ఏళ్లుగా మన్యం ప్రాంతంలో రోజూ అదే రూట్లో బస్ నడుపుతున్న బస్ నడుపుతున్నప్పటికీ, ఏవో చిన్నా చితక వన్యప్రాణులను చూశారు గానీ, ఇలా పెద్దపులే సాక్షాత్కరించడం వాళ్ళకు ఇదే మెదటిసారి.
బస్సులో ఉన్న జనంలో సగానికి పైగా అడ్డతీగలలో నివాసం ఉంటున్నవారే. వాళ్ళలో బాగా వయసు మళ్ళినవారు, గతంలో పెద్ద పులిని చూసినవారే. అయితే గత పదేళ్లుగా ఆ ప్రాంతంలో ఎవరూ పెద్దపులిని చూసింది లేదు. అదే విషయం కామేశం తన పక్కన కూర్చున్న అప్పారావుతో చెపుతున్నాడు.
"మా చిన్నప్పుడు అడ్డతీగలలోనూ, చుట్టుపక్కల ప్రాంతాలలోనూ పులుల్ని, చిరుతలను, ఎలుగుబంట్లను చూశాం. ఎడా పెడా చెట్లు కొట్టేయడం వలన అవి అంతరించిపోవడం, దూరంగా వలస వెళ్లిపోవడం జరిగింది. అందుకే ఈ మధ్య కాలంలో క్రూర జంతువులు మన ప్రాంతంలో కనబడడం లేదు. మరి ఈ పెద్దపులి ఎక్కడిదో? ఎక్కడినుంచి వచ్చిందో? అర్ధం కావడం లేదు. బస్సుకు ఎదురుగా ఇలా పులి అడ్డంగా పడుకోవడం గతంలో నేనెన్నడూ వినలేదు, కనలేదు. దాన్ని చూస్తేనే..............
అదిగో పులి కాకినాడ నుంచి అడ్డతీగల వెళ్ళే బస్సు, కీచుమని శబ్దం చేస్తూ సడన్ గా, ఆగేసరికి, కబుర్లలో పడిన ప్యాసింజర్లు అందరూ ఉలిక్కిపడి రోడ్డు వైపు చూశారు. అందరి గుండెలు ఒక్కసారిగా గుభేలుమన్నాయి. రోడ్డుకు అడ్డంగా పడుకుని ఉందొక పెద్ద పులి. బస్ లైట్ల వెలుగులో అందంగా మెరిసిపోతున్న ఆ పెద్దపులి ధీమాగా బస్సు వంకే చూస్తూ, కదలకుండా మెదలకుండా కూర్చుంది. కొంతమంది హడావిడిగా కిటికీలకున్న షట్టర్లను మూసేస్తున్నారు. మరి కొంతమంది వాళ్ళకు సాయం చేస్తున్నారు. కండక్టర్ తన దగ్గరున్న తలుపును మూసేసి, బోల్ట్ బిగించి, ఆ పులి వైపే భయంగా చూస్తున్నాడు. బస్సులో ఉన్న పెద్దా - చిన్నా, ఆడ - మగా తేడా లేకుండా అందరూ భయంతో వణికిపోతున్నారు. చల్లగాలి వీస్తున్నా, డ్రైవర్కి చెమట్లు పడుతున్నాయి. ఆ డ్రైవరు, కండక్టరు చాలా ఏళ్లుగా మన్యం ప్రాంతంలో రోజూ అదే రూట్లో బస్ నడుపుతున్న బస్ నడుపుతున్నప్పటికీ, ఏవో చిన్నా చితక వన్యప్రాణులను చూశారు గానీ, ఇలా పెద్దపులే సాక్షాత్కరించడం వాళ్ళకు ఇదే మెదటిసారి. బస్సులో ఉన్న జనంలో సగానికి పైగా అడ్డతీగలలో నివాసం ఉంటున్నవారే. వాళ్ళలో బాగా వయసు మళ్ళినవారు, గతంలో పెద్ద పులిని చూసినవారే. అయితే గత పదేళ్లుగా ఆ ప్రాంతంలో ఎవరూ పెద్దపులిని చూసింది లేదు. అదే విషయం కామేశం తన పక్కన కూర్చున్న అప్పారావుతో చెపుతున్నాడు. "మా చిన్నప్పుడు అడ్డతీగలలోనూ, చుట్టుపక్కల ప్రాంతాలలోనూ పులుల్ని, చిరుతలను, ఎలుగుబంట్లను చూశాం. ఎడా పెడా చెట్లు కొట్టేయడం వలన అవి అంతరించిపోవడం, దూరంగా వలస వెళ్లిపోవడం జరిగింది. అందుకే ఈ మధ్య కాలంలో క్రూర జంతువులు మన ప్రాంతంలో కనబడడం లేదు. మరి ఈ పెద్దపులి ఎక్కడిదో? ఎక్కడినుంచి వచ్చిందో? అర్ధం కావడం లేదు. బస్సుకు ఎదురుగా ఇలా పులి అడ్డంగా పడుకోవడం గతంలో నేనెన్నడూ వినలేదు, కనలేదు. దాన్ని చూస్తేనే..............© 2017,www.logili.com All Rights Reserved.