'బాస' కు బాసటగా నిలవండి!
కింది కులాల పేదరికానికి, దీన స్థితికి కారణం కుల వివక్ష, ఈ వివక్షకు కారణం బ్రాహ్మణవాదం. ఈ బ్రాహ్మణవాదాన్ని యెదిరించిన వారు మహాత్మ జ్యోతిబాపూలే. అణగారిన కులాల సమస్యలకు మూల కారణం వారికి రాజ్యాధికారం లేకపోవటం. రాజ్యాధికారమే అన్ని మౌలిక సమస్యలకు పరిష్కారం అని చెప్పిన వారు డా॥ బాబాసాహేబ్ అంబేడ్కర్.
ఈ మహానీయుల ఆశయాలను ప్రచారం చెయ్యడానికే "బాస” పత్రికను మీ ముందుకు తెస్తున్నాం. అగ్రకుల రాజకీయ కుట్రను దళిత బహుజనులందరూ అ చేసుకొని రాజ్యాధికారాన్ని చేపట్టడానికి సమాయత్తం అయ్యే విధంగా యీ పత్రికను రూపొందిస్తున్నాం. ఇది కేవలం చర్చావేదిక కాదు. ఉద్యమకారులతో చేయి చేయి కలిపి క్రియాశీలకంగా పనిచేస్తుంది. ఫూలే, అంబేడ్కర్ ఆశయం కోసం పనిచేసే ప్రతి వుద్యమ సంస్థను బాస ప్రోత్సహిస్తుంది, బలపరుస్తుంది.
పత్రికలన్నీ అగ్రకుల పెట్టుబడి దారుల చేతుల్లో వున్నాయి. దళిత బహుజనుల సమస్యల్ని వాళ్ళ వుద్యమాల్ని వెలుగులోకి తీసుకువచ్చే ఆసక్తి, వోర్పు వాటికి లేవు. మన సిద్ధాంతాన్ని మనమే ప్రచారం చేసుకోవాలి. మన వార్తల్ని మనమే రాసుకోవాలి. అయితే ఫూలే అంబేడ్కర్ సిద్ధాంత భూమికతో అనేక పత్రికలు వచ్చాయి, వస్తున్నాయి. పోగా పోగా పై పంచె బరువు అంటారు. కారణాలేమైనా కొన్ని మధ్యలోనే ఆగిపోతున్నాయి. కొన్ని రెగ్యులర్ గా రాలేక పోతున్నాయి. దళితబహుజన మేధావులు, విద్యావంతులు, వుద్యోగులు మనసు పెడితే పత్రిక నిర్వహణ సులభమవుతుంది. “బాస పత్రిక క్రమంతప్పకుండా తీసుకురావడానికి మీ సహకారాన్ని అర్ధిస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా వున్న మిత్రులు శ్రేయోభిలాషులు సహాయాన్ని, సలహాలను అందించారు. అందరి సలహాలను కార్యరూపంలోకి తీసుకురావడానికి నిరంతరం కూలి చీమల్లా శ్రమించే సంపాదకవర్గం వుంది. “బాస" కు బాసటగా నిలవండి! బహుజన రాజ్యాధికార సాధనలో భాగస్వాములు కండి !! (బాస ప్రారంభ సంచిక సంపాదకీయం), జూన్ 2010.................
'బాస' కు బాసటగా నిలవండి! కింది కులాల పేదరికానికి, దీన స్థితికి కారణం కుల వివక్ష, ఈ వివక్షకు కారణం బ్రాహ్మణవాదం. ఈ బ్రాహ్మణవాదాన్ని యెదిరించిన వారు మహాత్మ జ్యోతిబాపూలే. అణగారిన కులాల సమస్యలకు మూల కారణం వారికి రాజ్యాధికారం లేకపోవటం. రాజ్యాధికారమే అన్ని మౌలిక సమస్యలకు పరిష్కారం అని చెప్పిన వారు డా॥ బాబాసాహేబ్ అంబేడ్కర్. ఈ మహానీయుల ఆశయాలను ప్రచారం చెయ్యడానికే "బాస” పత్రికను మీ ముందుకు తెస్తున్నాం. అగ్రకుల రాజకీయ కుట్రను దళిత బహుజనులందరూ అ చేసుకొని రాజ్యాధికారాన్ని చేపట్టడానికి సమాయత్తం అయ్యే విధంగా యీ పత్రికను రూపొందిస్తున్నాం. ఇది కేవలం చర్చావేదిక కాదు. ఉద్యమకారులతో చేయి చేయి కలిపి క్రియాశీలకంగా పనిచేస్తుంది. ఫూలే, అంబేడ్కర్ ఆశయం కోసం పనిచేసే ప్రతి వుద్యమ సంస్థను బాస ప్రోత్సహిస్తుంది, బలపరుస్తుంది. పత్రికలన్నీ అగ్రకుల పెట్టుబడి దారుల చేతుల్లో వున్నాయి. దళిత బహుజనుల సమస్యల్ని వాళ్ళ వుద్యమాల్ని వెలుగులోకి తీసుకువచ్చే ఆసక్తి, వోర్పు వాటికి లేవు. మన సిద్ధాంతాన్ని మనమే ప్రచారం చేసుకోవాలి. మన వార్తల్ని మనమే రాసుకోవాలి. అయితే ఫూలే అంబేడ్కర్ సిద్ధాంత భూమికతో అనేక పత్రికలు వచ్చాయి, వస్తున్నాయి. పోగా పోగా పై పంచె బరువు అంటారు. కారణాలేమైనా కొన్ని మధ్యలోనే ఆగిపోతున్నాయి. కొన్ని రెగ్యులర్ గా రాలేక పోతున్నాయి. దళితబహుజన మేధావులు, విద్యావంతులు, వుద్యోగులు మనసు పెడితే పత్రిక నిర్వహణ సులభమవుతుంది. “బాస పత్రిక క్రమంతప్పకుండా తీసుకురావడానికి మీ సహకారాన్ని అర్ధిస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా వున్న మిత్రులు శ్రేయోభిలాషులు సహాయాన్ని, సలహాలను అందించారు. అందరి సలహాలను కార్యరూపంలోకి తీసుకురావడానికి నిరంతరం కూలి చీమల్లా శ్రమించే సంపాదకవర్గం వుంది. “బాస" కు బాసటగా నిలవండి! బహుజన రాజ్యాధికార సాధనలో భాగస్వాములు కండి !! (బాస ప్రారంభ సంచిక సంపాదకీయం), జూన్ 2010.................© 2017,www.logili.com All Rights Reserved.