డెబ్భైల్లో ఆయన.. ఇరవైల్లో నేను!
కథను అత్యంత సహజంగా, ఎలాంటివారికైనా సులువుగా అర్థమయ్యేలా రాయగలిగే రచయితలు కొందరే ఉంటారు. వేమూరి సత్యంగారు అలాంటి రచయిత అనిపిస్తుంది. రాయడంతో పాటు ఒక కథను అంతే అందంగా పక్కన కూర్చోబెట్టుకొని చెప్పగలరు కూడా! నేను ఈ శీర్షికలోనే చెప్పినట్టు ఆయన డెబ్భైల్లో ఉండి, నేను ఇరవైల్లో ఉన్నప్పట్నుంచి మా ఇద్దరికీ పరిచయం. పదేళ్ళ స్నేహం మాది. సత్యంగారు తన కథల పుస్తకం వస్తుందని చెప్పి, పెద్దవాళ్ళతో పాటు ఎవరైనా చిన్నవాళ్ళు కూడా ఈ కథల గురించి మాట్లాడితే బాగుంటుందని నన్ను అడిగారు.
మీరు ఈ పుస్తకంలో ఉన్న ఇరవై కథల్ని చూస్తే ఇందులో ఏడు కథలు 1970ల్లో అచ్చయితే, మిగతా పదమూడూ ఈ పదేళ్ళ కాలంలో అచ్చయినవే. అంటే నలభై ఏళ్ళ పాటు ఆయన సినిమాల్లోకి వెళ్ళిపోయి కథలేవీ రాయలేదు. లేదంటే ఇన్నేళ్ళూ దాచిపెట్టుకున్న కథలన్నీ ఇప్పటికి రాయడం మొదలు పెట్టారనుకోవచ్చు. ఆయనకిది సెకండ్ ఇన్నింగ్స్ అనుకుంటే, ఆయన సెకండ్ ఇన్నింగ్స్ మొదలయ్యే సమయానికే నేనూ కథలు రాయడం మొదలుపెట్టాను. సరిగ్గా అప్పుడే ఇద్దరికీ పరిచయం. నేను మధురానగర్ లో ఉన్న రోజుల్లో ఆయన ఇంటికి, మా హాస్టల్కు ఓ నాలుగు వీధుల దూరమే. పొద్దున్నే ఆ వీధుల వెంట పడి నేను నడుస్తుంటే, దాదాపు వారానికోసారి ఎదురుపడేవారు. ఒక్కోసారి నేనో ఆయనో వెతుక్కొని కలిసేవాళ్ళం. వేడి వేడి చాయ్ తాగుతూ, "ఏంటయ్యా విశేషాలు?” అని అడిగేవారు. నేను ఏ కథ గురించో పుస్తకం గురించో చెప్పేవాడ్ని. "ఇప్పుడు నాకొక కథ గుర్తొస్తుందయ్యా" అని ఒక కథ చెప్పేవారు. అలా మా మార్నింగ్ వాక్ లో నేను ఆయన చెప్పిన కథలు ఎన్నెన్ని వినేవాడినో. ఈ పుస్తకంలోని సగం కథలు నేను ఆయన అలా ఆశువుగా ఏ పార్కులోనో, ఇంకా తెరవని ఏదో షాపు మెట్ల మీదనో కూర్చొని చెప్తే విన్నవే. ఇవ్వాళ ఆ కథలన్నీ ఇలా పుస్తకంలో చదవడం, దానికి నేనూ ఓ రెండు మాటలు రాసే అవకాశం రావడం సంతోషంగా ఉంది.....................
డెబ్భైల్లో ఆయన.. ఇరవైల్లో నేను! కథను అత్యంత సహజంగా, ఎలాంటివారికైనా సులువుగా అర్థమయ్యేలా రాయగలిగే రచయితలు కొందరే ఉంటారు. వేమూరి సత్యంగారు అలాంటి రచయిత అనిపిస్తుంది. రాయడంతో పాటు ఒక కథను అంతే అందంగా పక్కన కూర్చోబెట్టుకొని చెప్పగలరు కూడా! నేను ఈ శీర్షికలోనే చెప్పినట్టు ఆయన డెబ్భైల్లో ఉండి, నేను ఇరవైల్లో ఉన్నప్పట్నుంచి మా ఇద్దరికీ పరిచయం. పదేళ్ళ స్నేహం మాది. సత్యంగారు తన కథల పుస్తకం వస్తుందని చెప్పి, పెద్దవాళ్ళతో పాటు ఎవరైనా చిన్నవాళ్ళు కూడా ఈ కథల గురించి మాట్లాడితే బాగుంటుందని నన్ను అడిగారు. మీరు ఈ పుస్తకంలో ఉన్న ఇరవై కథల్ని చూస్తే ఇందులో ఏడు కథలు 1970ల్లో అచ్చయితే, మిగతా పదమూడూ ఈ పదేళ్ళ కాలంలో అచ్చయినవే. అంటే నలభై ఏళ్ళ పాటు ఆయన సినిమాల్లోకి వెళ్ళిపోయి కథలేవీ రాయలేదు. లేదంటే ఇన్నేళ్ళూ దాచిపెట్టుకున్న కథలన్నీ ఇప్పటికి రాయడం మొదలు పెట్టారనుకోవచ్చు. ఆయనకిది సెకండ్ ఇన్నింగ్స్ అనుకుంటే, ఆయన సెకండ్ ఇన్నింగ్స్ మొదలయ్యే సమయానికే నేనూ కథలు రాయడం మొదలుపెట్టాను. సరిగ్గా అప్పుడే ఇద్దరికీ పరిచయం. నేను మధురానగర్ లో ఉన్న రోజుల్లో ఆయన ఇంటికి, మా హాస్టల్కు ఓ నాలుగు వీధుల దూరమే. పొద్దున్నే ఆ వీధుల వెంట పడి నేను నడుస్తుంటే, దాదాపు వారానికోసారి ఎదురుపడేవారు. ఒక్కోసారి నేనో ఆయనో వెతుక్కొని కలిసేవాళ్ళం. వేడి వేడి చాయ్ తాగుతూ, "ఏంటయ్యా విశేషాలు?” అని అడిగేవారు. నేను ఏ కథ గురించో పుస్తకం గురించో చెప్పేవాడ్ని. "ఇప్పుడు నాకొక కథ గుర్తొస్తుందయ్యా" అని ఒక కథ చెప్పేవారు. అలా మా మార్నింగ్ వాక్ లో నేను ఆయన చెప్పిన కథలు ఎన్నెన్ని వినేవాడినో. ఈ పుస్తకంలోని సగం కథలు నేను ఆయన అలా ఆశువుగా ఏ పార్కులోనో, ఇంకా తెరవని ఏదో షాపు మెట్ల మీదనో కూర్చొని చెప్తే విన్నవే. ఇవ్వాళ ఆ కథలన్నీ ఇలా పుస్తకంలో చదవడం, దానికి నేనూ ఓ రెండు మాటలు రాసే అవకాశం రావడం సంతోషంగా ఉంది.....................© 2017,www.logili.com All Rights Reserved.