గాంధీజీ దక్షిణాఫ్రికాలో న్యాయవాదిగా పనిచేస్తున్న రోజులలో ఒక రోజున దొంగతనం చేసిన నేరానికి నిందితుడైన ఒక వ్యక్తి వచ్చి తన పక్షాన వాదించవలసినదిగా గాంధీజీని అర్థించాడు. గాంధీజీ అతనితో కొంతసేపు మాట్లాడి అతడు నిజంగానే దొంగతనం చేశాడని గ్రహించాడు.
"చేస్తున్నది దొంగతనమని తెలిసి, అందుకే శిక్ష విధిస్తారో తెలిసి నీ వటువంటి తప్పుపని నెందుకు చేశా"వని గాంధీజీ అడిగాడు.
"ఏదో విధంగా నేను బ్రతకాలి గనుక" అని సమాధానమిచ్చాడా వ్యక్తి. "ఏదో విధంగా నీవు బ్రతకాలి గనుకనా? ఎందుకు?” అని గాంధీజీ తిరిగి ప్రశ్నించాడు.
దొంగతనం చేసి అయినా మనిషి జీవించాలా? మనం ఎందుకు బ్రతుకు తున్నాము? ఎందుకు బ్రతకాలి? ఎట్లా బ్రతకాలి? ఈ ప్రశ్నలను గురించి సాధారణంగా మనం ఆలోచించము.
పరీక్షించి చూడని జీవితం వ్యర్థం- An Unexamined life is worthless- అని గ్రీకు తత్వవేత్త సోక్రటీస్ అన్నాడు. జీవితాన్ని గురించి స్పష్టమైన దృక్పథాన్ని మనం ఏర్పరచుకొని, లక్ష్యాలను నిర్ణయించుకొని, ఆ లక్ష్య సాధన కొక ప్రణాళిక నేర్పరచుకొని మనం జీవించాలి. అప్పుడే మనం జీవితంలో ఏదైనా సాధించగలుగుతాము. లేకపోతే "పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా?” అన్న వేమనగారి మాట మనకు వర్తిస్తుంది. ఎందుకు బ్రతకాలో, ఎట్లా బ్రతకాలో గాంధీజీ తమ వ్రాతలతోనూ, చేతలతోనూ మనకు బోధించారు.
గాంధీజీ పుట్టి పెరిగింది 19వ శతాబ్దపు ద్వితీయార్థంలో అప్పటికే పాశ్చాత్య దేశాలలో పారిశ్రామిక విప్లవ ప్రభావం కనిపించి నారంభించింది. మనిషి తన వ్యక్తిత్వాన్ని కోల్పోయి యంత్రాలకు బానిసగా మారడం ప్రారంభమయినది. యంత్రాల సహాయంతో................
గాంధేయ జీవన దృక్పథం డా. అడపా రామకృష్ణారావు గాంధీజీ దక్షిణాఫ్రికాలో న్యాయవాదిగా పనిచేస్తున్న రోజులలో ఒక రోజున దొంగతనం చేసిన నేరానికి నిందితుడైన ఒక వ్యక్తి వచ్చి తన పక్షాన వాదించవలసినదిగా గాంధీజీని అర్థించాడు. గాంధీజీ అతనితో కొంతసేపు మాట్లాడి అతడు నిజంగానే దొంగతనం చేశాడని గ్రహించాడు. "చేస్తున్నది దొంగతనమని తెలిసి, అందుకే శిక్ష విధిస్తారో తెలిసి నీ వటువంటి తప్పుపని నెందుకు చేశా"వని గాంధీజీ అడిగాడు. "ఏదో విధంగా నేను బ్రతకాలి గనుక" అని సమాధానమిచ్చాడా వ్యక్తి. "ఏదో విధంగా నీవు బ్రతకాలి గనుకనా? ఎందుకు?” అని గాంధీజీ తిరిగి ప్రశ్నించాడు. దొంగతనం చేసి అయినా మనిషి జీవించాలా? మనం ఎందుకు బ్రతుకు తున్నాము? ఎందుకు బ్రతకాలి? ఎట్లా బ్రతకాలి? ఈ ప్రశ్నలను గురించి సాధారణంగా మనం ఆలోచించము. పరీక్షించి చూడని జీవితం వ్యర్థం- An Unexamined life is worthless- అని గ్రీకు తత్వవేత్త సోక్రటీస్ అన్నాడు. జీవితాన్ని గురించి స్పష్టమైన దృక్పథాన్ని మనం ఏర్పరచుకొని, లక్ష్యాలను నిర్ణయించుకొని, ఆ లక్ష్య సాధన కొక ప్రణాళిక నేర్పరచుకొని మనం జీవించాలి. అప్పుడే మనం జీవితంలో ఏదైనా సాధించగలుగుతాము. లేకపోతే "పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా?” అన్న వేమనగారి మాట మనకు వర్తిస్తుంది. ఎందుకు బ్రతకాలో, ఎట్లా బ్రతకాలో గాంధీజీ తమ వ్రాతలతోనూ, చేతలతోనూ మనకు బోధించారు. గాంధీజీ పుట్టి పెరిగింది 19వ శతాబ్దపు ద్వితీయార్థంలో అప్పటికే పాశ్చాత్య దేశాలలో పారిశ్రామిక విప్లవ ప్రభావం కనిపించి నారంభించింది. మనిషి తన వ్యక్తిత్వాన్ని కోల్పోయి యంత్రాలకు బానిసగా మారడం ప్రారంభమయినది. యంత్రాల సహాయంతో................© 2017,www.logili.com All Rights Reserved.