చిన్నతనం నుంచే కమ్యూనిస్టు ఉద్యమం పట్ల ఆకర్షితులై, తర్వాత పత్రికా రంగంపై ఆసక్తి పెంచుకున్న బొమ్మారెడ్డి గారు ఏడు దశాబ్దాలలోనూ కమ్యూనిస్టు ఉద్యమ ప్రారంభం, విస్తరణ, విజయాలు, అపజయాలు, పాలకుల నిర్బంధాలూ, అంతర్గత విచ్చిన్నాలూ, దాడులూ దౌర్జన్యాలూ కఠిన శిక్షలూ అగ్నిపరీక్షలూ అన్నిటినీ చూశారు. అత్యున్నత గౌరవాస్పదులైన అగ్రనేతల నుంచి అతి సామాన్య యువ కార్యకర్తల వరకూ అందరితో కలిసి పనిచేశారు. ఏడు దశాబ్దాల పైబడిన జీవితంలో ఎన్నడూ క్రమశిక్షణ తప్పలేదు. నిర్మాణం గీత దాటలేదు. రాజకీయ విధానంలో తడబడలేదు. స్వార్థం కోసం పాకులాడలేదు. నిర్బంధాలకు భయపడలేదు. బాధ్యతలూ భారాలకు జంకలేదు. వివాదాలకు అవకాశమివ్వలేదు.
చెక్కుచెదరని సంకల్పంతో మొక్కవోని దీక్షతో ఆహోరాత్రులు అక్షర సైనికుడుగా పత్రికా రంగంలో పనిచేశారు. నాయకులు అజ్ఞాతంలో ఉన్నా కారాగారంలో ఉన్నా కార్యాలయంలో ఉన్నా ఆయన మాత్రం తుచ తప్పకుండా నిర్దేశిత విధానం మేరకు పత్రికా నిర్వహణ నిరాఘాటంగా సాగించారు. తన వ్యక్తిగత జీవితాన్ని కూడా ఆశయాలకు అనుగుణంగా మలుచుకున్నారు. తనకు సన్నిహితులైన వారు ముఖ్యమంత్రులూ కేంద్రమంత్రులకు సన్నిహితులుగా ఉంటూ ఆకర్షణీయమైన అవకాశాలు చూపించినా, ప్రముఖ పత్రికలలోకి ఆహ్వానించినా ప్రజల పత్రికకే అంకితమవడం బొమ్మారెడ్డి త్యాగశీలతను చెప్పే ఉదాహరణ.
చిన్నతనం నుంచే కమ్యూనిస్టు ఉద్యమం పట్ల ఆకర్షితులై, తర్వాత పత్రికా రంగంపై ఆసక్తి పెంచుకున్న బొమ్మారెడ్డి గారు ఏడు దశాబ్దాలలోనూ కమ్యూనిస్టు ఉద్యమ ప్రారంభం, విస్తరణ, విజయాలు, అపజయాలు, పాలకుల నిర్బంధాలూ, అంతర్గత విచ్చిన్నాలూ, దాడులూ దౌర్జన్యాలూ కఠిన శిక్షలూ అగ్నిపరీక్షలూ అన్నిటినీ చూశారు. అత్యున్నత గౌరవాస్పదులైన అగ్రనేతల నుంచి అతి సామాన్య యువ కార్యకర్తల వరకూ అందరితో కలిసి పనిచేశారు. ఏడు దశాబ్దాల పైబడిన జీవితంలో ఎన్నడూ క్రమశిక్షణ తప్పలేదు. నిర్మాణం గీత దాటలేదు. రాజకీయ విధానంలో తడబడలేదు. స్వార్థం కోసం పాకులాడలేదు. నిర్బంధాలకు భయపడలేదు. బాధ్యతలూ భారాలకు జంకలేదు. వివాదాలకు అవకాశమివ్వలేదు. చెక్కుచెదరని సంకల్పంతో మొక్కవోని దీక్షతో ఆహోరాత్రులు అక్షర సైనికుడుగా పత్రికా రంగంలో పనిచేశారు. నాయకులు అజ్ఞాతంలో ఉన్నా కారాగారంలో ఉన్నా కార్యాలయంలో ఉన్నా ఆయన మాత్రం తుచ తప్పకుండా నిర్దేశిత విధానం మేరకు పత్రికా నిర్వహణ నిరాఘాటంగా సాగించారు. తన వ్యక్తిగత జీవితాన్ని కూడా ఆశయాలకు అనుగుణంగా మలుచుకున్నారు. తనకు సన్నిహితులైన వారు ముఖ్యమంత్రులూ కేంద్రమంత్రులకు సన్నిహితులుగా ఉంటూ ఆకర్షణీయమైన అవకాశాలు చూపించినా, ప్రముఖ పత్రికలలోకి ఆహ్వానించినా ప్రజల పత్రికకే అంకితమవడం బొమ్మారెడ్డి త్యాగశీలతను చెప్పే ఉదాహరణ.© 2017,www.logili.com All Rights Reserved.