ఆరోగ్యం, అనారోగ్యం - ఎలా తెలుస్తుంది?
1. ఆరోగ్యంగా వున్న గోవు ప్రవర్తన
ఆరోగ్యంగా వుండే పశుగణాలన్నీ హుషారుగా, రంకెలు వేస్తూ, అంబారావాలు చేస్తూ... పరిసరాల్ని, యజమానిని, తోటి పశువుల్ని నిశితంగా గమనిస్తూ, అటూయిటూ చలాకీగా కదులుతూ, చక్కగా స్పందిస్తూ, మేతపై ఎక్కువ దృష్టిపెట్టి వుంటాయి.
ఇష్టంగా మేత మేస్తాయి. నీళ్ళు త్రాగుతాయి, నెమరు వేస్తాయి.
ముక్కు గోళాలు తరుచూ నాకుతూ వుంటాయి. ముట్టె చెమాయింపుతో వుంటుంది.
తేట కళ్ళతో, ఠీవిగా ప్రవర్తిస్తూ, ముఖంలో ఆనందాన్ని వ్యక్తపరుస్తూ, చకచక అంగలు వేస్తూ, ఉరకలు వేస్తూ, చూసే మనకు కూడా ఆనందాన్ని కలిగిస్తాయి.
చెవులు నిక్కించి చూస్తూ, తోక ఆడిస్తూ, పని చేసేటప్పుడు తీరైన ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో, అటూ యిటూ తల ఊపుతూ, హుషారుగా వుంటాయి.
చర్మం మృదువుగా వుంటుంది. చర్మం మీద నాలికతో నాకినప్పుడు, ఏర్పడే రోమం గుర్తులు వుంటాయి. చర్మాన్ని ఎప్పుడూ కదిలించటం, జలదరించటం చేస్తాయి. వెంట్రుకలు మెత్తగా జారిపోతూ వుంటాయి.
సమయానుసారంగా, బాధ లేకుండా, పూర్తి పరిమాణంలో మల మూత్ర విసర్జన చేస్తాయి. పేడ మరీ గట్టిగా గాని, మరీ పలుచగా గానీ కాకుండా, మామూలు రంగులో వుంటుంది.
పాలిచ్చే ఆవులు, పాలు తగ్గకుండా ఇస్తాయి.
గోవులు తాము పూర్తి ఆరోగ్యంగా వున్నట్లుగా, తమ ప్రవర్తన ద్వారా సంకేతాలనిస్తాయి.
1.02 అనారోగ్యంగా వున్న గోవు ప్రవర్తన
ఏ మాత్రం హుషారు లేక, యజమానిని, తోటి గోవులను పట్టించుకోకుండా వుంటుంది. బాధతో వున్నప్పుడు తల వాల్చి, చెవులు వేళ్ళాడవేసి, కాంతి లేని కళ్ళతో, కన్నీరు కారుస్తూ, కనుగుంటలు వదిలి, ముట్టె తడి ఆరిపోయి వుంటుంది.
వెంట్రుకలు నిక్కపొడిచి, రోమాలు నల్ల కప్పు వేసి, ముణగదీసుకొని, డొక్కలో తల పెట్టుకొని పడుకుంటుంది దుఃఖంతో బాధపడుతున్నట్లుగా అసాధారణ చర్యలు, నడక, నిలబడే పడుకునే విధానాలు, ముఖకవళికలు చలాకీతనంలేక స్తబ్ధుగా వున్నట్లుగా, ప్రశాంతత లేక అస్థిరంగా కదులుతున్నట్లుగా, హుషారుగా లేక ప్రవర్తనను బట్టి గోవును చూడగానే, అనారోగ్యంతో వున్నట్లు తేలికగా........................
ఆరోగ్యం, అనారోగ్యం - ఎలా తెలుస్తుంది? 1. ఆరోగ్యంగా వున్న గోవు ప్రవర్తన ఆరోగ్యంగా వుండే పశుగణాలన్నీ హుషారుగా, రంకెలు వేస్తూ, అంబారావాలు చేస్తూ... పరిసరాల్ని, యజమానిని, తోటి పశువుల్ని నిశితంగా గమనిస్తూ, అటూయిటూ చలాకీగా కదులుతూ, చక్కగా స్పందిస్తూ, మేతపై ఎక్కువ దృష్టిపెట్టి వుంటాయి.ఇష్టంగా మేత మేస్తాయి. నీళ్ళు త్రాగుతాయి, నెమరు వేస్తాయి. ముక్కు గోళాలు తరుచూ నాకుతూ వుంటాయి. ముట్టె చెమాయింపుతో వుంటుంది. తేట కళ్ళతో, ఠీవిగా ప్రవర్తిస్తూ, ముఖంలో ఆనందాన్ని వ్యక్తపరుస్తూ, చకచక అంగలు వేస్తూ, ఉరకలు వేస్తూ, చూసే మనకు కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. చెవులు నిక్కించి చూస్తూ, తోక ఆడిస్తూ, పని చేసేటప్పుడు తీరైన ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో, అటూ యిటూ తల ఊపుతూ, హుషారుగా వుంటాయి. చర్మం మృదువుగా వుంటుంది. చర్మం మీద నాలికతో నాకినప్పుడు, ఏర్పడే రోమం గుర్తులు వుంటాయి. చర్మాన్ని ఎప్పుడూ కదిలించటం, జలదరించటం చేస్తాయి. వెంట్రుకలు మెత్తగా జారిపోతూ వుంటాయి. సమయానుసారంగా, బాధ లేకుండా, పూర్తి పరిమాణంలో మల మూత్ర విసర్జన చేస్తాయి. పేడ మరీ గట్టిగా గాని, మరీ పలుచగా గానీ కాకుండా, మామూలు రంగులో వుంటుంది. పాలిచ్చే ఆవులు, పాలు తగ్గకుండా ఇస్తాయి. గోవులు తాము పూర్తి ఆరోగ్యంగా వున్నట్లుగా, తమ ప్రవర్తన ద్వారా సంకేతాలనిస్తాయి. 1.02 అనారోగ్యంగా వున్న గోవు ప్రవర్తన ఏ మాత్రం హుషారు లేక, యజమానిని, తోటి గోవులను పట్టించుకోకుండా వుంటుంది. బాధతో వున్నప్పుడు తల వాల్చి, చెవులు వేళ్ళాడవేసి, కాంతి లేని కళ్ళతో, కన్నీరు కారుస్తూ, కనుగుంటలు వదిలి, ముట్టె తడి ఆరిపోయి వుంటుంది. వెంట్రుకలు నిక్కపొడిచి, రోమాలు నల్ల కప్పు వేసి, ముణగదీసుకొని, డొక్కలో తల పెట్టుకొని పడుకుంటుంది దుఃఖంతో బాధపడుతున్నట్లుగా అసాధారణ చర్యలు, నడక, నిలబడే పడుకునే విధానాలు, ముఖకవళికలు చలాకీతనంలేక స్తబ్ధుగా వున్నట్లుగా, ప్రశాంతత లేక అస్థిరంగా కదులుతున్నట్లుగా, హుషారుగా లేక ప్రవర్తనను బట్టి గోవును చూడగానే, అనారోగ్యంతో వున్నట్లు తేలికగా........................
© 2017,www.logili.com All Rights Reserved.