రమణీయం - గ్రామాయణం నామ విజ్ఞానంలో ముఖ్య విభాగమైన స్థలనామ విజ్ఞానాన్ని (టోపోనమి) అవుపోశన పట్టిన నామవిజ్ఞానవేత్త, పత్రికారచయిత వాండ్రంగి కొండలరావు కృషి అభినందనీయం.
రాష్ట్రాన్ని ప్రాతిపదికగా తీసుకొని "గ్రామనామాలు" పేరుతో ఓ పుస్తకాన్ని తీసుకొని రావడం విశేషం. గతంలో “ఊరు - పేరు" గ్రంథాన్ని రాసి ఆంధ్రప్రవాసాంధ్ర ప్రాంతాల్లో
ఆయన గుర్తింపు పొందారు. రచయిత ఊహాలోకాల్లో విహరించకుండా జనవాహిని మనోగతానికి అక్షర రూపం ఇచ్చారు. తదనుగుణంగా
గ్రామాలకు ఆ పేర్లు ఎలా వచ్చాయో రాశారు. మరో పక్క కైఫియత్తులు, పరిష్కరించిన శాసనాలను, ప్రాచీన గ్రంథాలను అధ్యయనం చేసినట్టు - స్పష్టమవుతోంది. వందలాది గ్రామాల పేర్ల వెనుక గల పూర్వ రంగాన్ని - వెలుగులోకి తేవడం గొప్ప విశేషం. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడంలో ఆ రచయిత చేసిన కృషి మెచ్చదగినది. ఆకాశంలో నక్షత్రాలు లెక్కపెట్టే • సాహసం చేశారేమో అనిపిస్తుంది. అయితే పుష్పక విమానంలో ఎంత
మంది కూర్చున్న ఇంకా ఖాళీ ఉంటుందనేది వేరే విషయం. ఈ రచయిత సాహసాన్ని త్రికరణ శుద్ధిగా అభినందిస్తున్నాను....
రమణీయం - గ్రామాయణం నామ విజ్ఞానంలో ముఖ్య విభాగమైన స్థలనామ విజ్ఞానాన్ని (టోపోనమి) అవుపోశన పట్టిన నామవిజ్ఞానవేత్త, పత్రికారచయిత వాండ్రంగి కొండలరావు కృషి అభినందనీయం. రాష్ట్రాన్ని ప్రాతిపదికగా తీసుకొని "గ్రామనామాలు" పేరుతో ఓ పుస్తకాన్ని తీసుకొని రావడం విశేషం. గతంలో “ఊరు - పేరు" గ్రంథాన్ని రాసి ఆంధ్రప్రవాసాంధ్ర ప్రాంతాల్లో ఆయన గుర్తింపు పొందారు. రచయిత ఊహాలోకాల్లో విహరించకుండా జనవాహిని మనోగతానికి అక్షర రూపం ఇచ్చారు. తదనుగుణంగా గ్రామాలకు ఆ పేర్లు ఎలా వచ్చాయో రాశారు. మరో పక్క కైఫియత్తులు, పరిష్కరించిన శాసనాలను, ప్రాచీన గ్రంథాలను అధ్యయనం చేసినట్టు - స్పష్టమవుతోంది. వందలాది గ్రామాల పేర్ల వెనుక గల పూర్వ రంగాన్ని - వెలుగులోకి తేవడం గొప్ప విశేషం. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడంలో ఆ రచయిత చేసిన కృషి మెచ్చదగినది. ఆకాశంలో నక్షత్రాలు లెక్కపెట్టే • సాహసం చేశారేమో అనిపిస్తుంది. అయితే పుష్పక విమానంలో ఎంత మంది కూర్చున్న ఇంకా ఖాళీ ఉంటుందనేది వేరే విషయం. ఈ రచయిత సాహసాన్ని త్రికరణ శుద్ధిగా అభినందిస్తున్నాను....© 2017,www.logili.com All Rights Reserved.