కప్పు
అబ్బాస్ ఖాన్ కొడుకు, కరీమ్ చివరికి ఇంటికి తిరిగి వచ్చాడు. అతను నాలుగేళ్ళుగా చదువు పూర్తి చేసుకునేందుకై బైట ఊళ్ళలో ఉన్నాడు. అతను ఇల్లు చేరగానే తలుపు దగ్గరే ఆగి ముడిపడిన కనుబొమలతో కప్పు వంక చూసి వాళ్ళ నాన్నతో అన్నాడు.
"ఇల్లింత చీకటిగా ఉందేమిటి? ఇక్కడ ఎవరైనా తిన్నగా నడవటం కూడా కుదిరేలా లేదు."
ఈ మాట విని అబ్బాస్ ఖాన్ కొడుకుని నఖశిఖ పర్యంతం పరికించి చూశాడు. ఈ ఇంట్లో 20 ఏళ్లుగా ఈ ఇంటి లోపలంతా హాయిగా నడిచి తిరిగినవాడికి హఠాత్తుగా నడవలేనంత కష్టమేమొచ్చింది? ఐనప్పటికి అతను సరదాగానే సమాధానం ఇచ్చాడు.
"ఔన్రా, బొంబాయిలో కళ్ళు మిరుమిట్లు గొలిపే దీపాలను చూసి ఇంటికొస్తే మరి ఇలాగే ఉంటుంది... నేను బొంబాయి నుంచి తిరిగొచ్చినప్పటి సంగతి. గుర్తొస్తున్నది... నేను...”
అలవాటు ప్రకారం అబ్బాస్ వెంటనే తన పనికిరాని మాటలు ఆపకుండా. మాట్లాడటం మొదలు పెట్టాడు. కరీమ్ వాటిని వినే పని పెట్టుకోలేదు.. పురుడు కోసం వచ్చిన అక్క జబ్బు పడి ఉంది. వెనక నుంచి తండ్రి సణుగుడుతో, కరీమ్ చీకట్లో తడబడుతూ చివరికి అక్క గదిలోకి వచ్చాడు...............
కప్పు అబ్బాస్ ఖాన్ కొడుకు, కరీమ్ చివరికి ఇంటికి తిరిగి వచ్చాడు. అతను నాలుగేళ్ళుగా చదువు పూర్తి చేసుకునేందుకై బైట ఊళ్ళలో ఉన్నాడు. అతను ఇల్లు చేరగానే తలుపు దగ్గరే ఆగి ముడిపడిన కనుబొమలతో కప్పు వంక చూసి వాళ్ళ నాన్నతో అన్నాడు. "ఇల్లింత చీకటిగా ఉందేమిటి? ఇక్కడ ఎవరైనా తిన్నగా నడవటం కూడా కుదిరేలా లేదు." ఈ మాట విని అబ్బాస్ ఖాన్ కొడుకుని నఖశిఖ పర్యంతం పరికించి చూశాడు. ఈ ఇంట్లో 20 ఏళ్లుగా ఈ ఇంటి లోపలంతా హాయిగా నడిచి తిరిగినవాడికి హఠాత్తుగా నడవలేనంత కష్టమేమొచ్చింది? ఐనప్పటికి అతను సరదాగానే సమాధానం ఇచ్చాడు. "ఔన్రా, బొంబాయిలో కళ్ళు మిరుమిట్లు గొలిపే దీపాలను చూసి ఇంటికొస్తే మరి ఇలాగే ఉంటుంది... నేను బొంబాయి నుంచి తిరిగొచ్చినప్పటి సంగతి. గుర్తొస్తున్నది... నేను...” అలవాటు ప్రకారం అబ్బాస్ వెంటనే తన పనికిరాని మాటలు ఆపకుండా. మాట్లాడటం మొదలు పెట్టాడు. కరీమ్ వాటిని వినే పని పెట్టుకోలేదు.. పురుడు కోసం వచ్చిన అక్క జబ్బు పడి ఉంది. వెనక నుంచి తండ్రి సణుగుడుతో, కరీమ్ చీకట్లో తడబడుతూ చివరికి అక్క గదిలోకి వచ్చాడు...............© 2017,www.logili.com All Rights Reserved.