లోకంలో మంచి రచయితలూ ఉంటారు. గొప్ప వ్యక్తిత్వం కలిగిన మనుషులూ ఉంటారు. కానీ మంచి రచయితా, గొప్ప వ్యక్తీ ఒకడే అవటం చాలా అరుదుగా జరిగే విషయం. అటువంటి అరుదైన మనిషి లక్ష్మణరావుగారు. అరుదైన రచన 'అతడు -ఆమె'. లక్ష్మణరావుగారి వ్యక్తిత్వాన్నీ ఆయన రచనలనీ విడదీసి చూడలేం. ఆయన రచనలు ఆయన వ్యక్తిత్వంలో ఒక భాగం. ఆయన రచనల సారాంశమే ఆయన వ్యక్తిత్వం.
జాతీయోద్యమ నవలగా, స్త్రీ పురుష సంబంధాలను చర్చించే నవలగా 'అతడు - ఆమె'కు తెలుగు సాహిత్యంలో విశిష్టమైన స్థానం ఉన్నది. 'అతడు - ఆమె' నవలలో లక్ష్మణరావుగారు ఎన్ని విషయాలనో చర్చించారు. ఎన్ని విషయాల గురించో మన కళ్ళు తెరిపించారు. ఐతే ఈ నవల మొత్తంగా సాధించిన ప్రయోజనం ఏమిటి? ఆ నవల ప్రభావం పాఠకుడిపై ఎలా ఉంటుంది? ఈ నవల చదవకముందూ, చదివిన తర్వాత పాఠకుడి మనసులో వచ్చే మార్పులేమిటి అని ఆలోచిస్తే, 'అతడు - ఆమె' నవల పాఠకుల సంస్కారాన్ని పెంచటంలో ఎంతో ఉపయోగపడుతుంది. ఆ నవల చదివే వ్యక్తులు కొంచెం నిజాయితీ ఉన్నవారైతే చాలు - ఆ నవల చదివాక ఎంతగానో సంస్కరించబడతారు.
లోకంలో మంచి రచయితలూ ఉంటారు. గొప్ప వ్యక్తిత్వం కలిగిన మనుషులూ ఉంటారు. కానీ మంచి రచయితా, గొప్ప వ్యక్తీ ఒకడే అవటం చాలా అరుదుగా జరిగే విషయం. అటువంటి అరుదైన మనిషి లక్ష్మణరావుగారు. అరుదైన రచన 'అతడు -ఆమె'. లక్ష్మణరావుగారి వ్యక్తిత్వాన్నీ ఆయన రచనలనీ విడదీసి చూడలేం. ఆయన రచనలు ఆయన వ్యక్తిత్వంలో ఒక భాగం. ఆయన రచనల సారాంశమే ఆయన వ్యక్తిత్వం. జాతీయోద్యమ నవలగా, స్త్రీ పురుష సంబంధాలను చర్చించే నవలగా 'అతడు - ఆమె'కు తెలుగు సాహిత్యంలో విశిష్టమైన స్థానం ఉన్నది. 'అతడు - ఆమె' నవలలో లక్ష్మణరావుగారు ఎన్ని విషయాలనో చర్చించారు. ఎన్ని విషయాల గురించో మన కళ్ళు తెరిపించారు. ఐతే ఈ నవల మొత్తంగా సాధించిన ప్రయోజనం ఏమిటి? ఆ నవల ప్రభావం పాఠకుడిపై ఎలా ఉంటుంది? ఈ నవల చదవకముందూ, చదివిన తర్వాత పాఠకుడి మనసులో వచ్చే మార్పులేమిటి అని ఆలోచిస్తే, 'అతడు - ఆమె' నవల పాఠకుల సంస్కారాన్ని పెంచటంలో ఎంతో ఉపయోగపడుతుంది. ఆ నవల చదివే వ్యక్తులు కొంచెం నిజాయితీ ఉన్నవారైతే చాలు - ఆ నవల చదివాక ఎంతగానో సంస్కరించబడతారు.© 2017,www.logili.com All Rights Reserved.