"నేనేమిటో నాకు తెలుసు - నేను ఆధునిక స్త్రీని. అనుక్షణం సమాజంతో తలపడుతూ, దానిని మార్చాలని తపనపడే ఆధునిక స్త్రీని. సమాజంలోని సకల సంబంధాలనూ మార్చే గొప్ప పూనికతో పెరిగిన ఆధునిక స్త్రీని. నాకు సంకెళ్ళు లేవని కాదు - నిరంతరం ఆ సంకెళ్ళు తెంచే పనే నాది - ఒక సంకెల తెగితే మరొకటి వచ్చి పడుతుంది. నేను పోరాడుతున్నాను. జీవిస్తున్నాను. స్త్రీగా, కమ్యూనిస్టుగా, డాక్టర్ గా, కూతురిగా, తల్లిగా, ఒక పౌరురాలిగా జీవిస్తున్నాను. ఎంత ఘర్షణ, ఎన్ని పరీక్షలు, ఎన్ని విజయాలు, ఎన్ని అపజయాలు అయినా ఆనందంగా ఉంది. గర్వంగా ఉంది. జీవితం అంటే ఇట్లా ఉండాలనిపిస్తోంది. సవాళ్ళతో, సందిగ్ధాలతో, ప్రశ్నలతో, సమాధానాలతో, ఎలాంటి సమయంలో జీవిస్తున్నాం కదా మనందరం".
స్త్రీల రాజకీయ భాగస్వామ్యం గురించి, రాజకీయాలలోకి వచ్చి నాయకత్వ లక్షణాలన్నిటితో ముందుకు పోవాలనుకునే స్త్రీలకూ ఎదురయ్యే ఆటంకాల గురించీ, స్త్రీలను మేధావులుగా, నాయకులుగా గుర్తించని, ఎదగనివ్వని సమాజం గురించి, ఆధునిక స్త్రీ గురించి, స్త్రీ పురుష సంబంధాల గురించి ఈ నవల ఆధారంగా చర్చ జరుగుతుందనీ, ఆ చర్చ వల్ల సమాజానికి మేలు జరుగుతుందనీ ఆశిస్తున్నాను.
- ఓల్గా
"నేనేమిటో నాకు తెలుసు - నేను ఆధునిక స్త్రీని. అనుక్షణం సమాజంతో తలపడుతూ, దానిని మార్చాలని తపనపడే ఆధునిక స్త్రీని. సమాజంలోని సకల సంబంధాలనూ మార్చే గొప్ప పూనికతో పెరిగిన ఆధునిక స్త్రీని. నాకు సంకెళ్ళు లేవని కాదు - నిరంతరం ఆ సంకెళ్ళు తెంచే పనే నాది - ఒక సంకెల తెగితే మరొకటి వచ్చి పడుతుంది. నేను పోరాడుతున్నాను. జీవిస్తున్నాను. స్త్రీగా, కమ్యూనిస్టుగా, డాక్టర్ గా, కూతురిగా, తల్లిగా, ఒక పౌరురాలిగా జీవిస్తున్నాను. ఎంత ఘర్షణ, ఎన్ని పరీక్షలు, ఎన్ని విజయాలు, ఎన్ని అపజయాలు అయినా ఆనందంగా ఉంది. గర్వంగా ఉంది. జీవితం అంటే ఇట్లా ఉండాలనిపిస్తోంది. సవాళ్ళతో, సందిగ్ధాలతో, ప్రశ్నలతో, సమాధానాలతో, ఎలాంటి సమయంలో జీవిస్తున్నాం కదా మనందరం". స్త్రీల రాజకీయ భాగస్వామ్యం గురించి, రాజకీయాలలోకి వచ్చి నాయకత్వ లక్షణాలన్నిటితో ముందుకు పోవాలనుకునే స్త్రీలకూ ఎదురయ్యే ఆటంకాల గురించీ, స్త్రీలను మేధావులుగా, నాయకులుగా గుర్తించని, ఎదగనివ్వని సమాజం గురించి, ఆధునిక స్త్రీ గురించి, స్త్రీ పురుష సంబంధాల గురించి ఈ నవల ఆధారంగా చర్చ జరుగుతుందనీ, ఆ చర్చ వల్ల సమాజానికి మేలు జరుగుతుందనీ ఆశిస్తున్నాను. - ఓల్గా© 2017,www.logili.com All Rights Reserved.