హనుమాన్ చాలీసా
పుట్టెన్ వానరుడౌచు; విక్రమకళాస్ఫూర్తిన్ నృసింహుందుగా
నట్టే దానవహంత; వేగగతిలోనా వైనతేయుండె; తా
జుట్టెన్ వేదములెల్ల నశ్వముఖుడై; శోకాబ్దిలోనుండి పై
బెట్టెన్ భూసుతనిట్టె క్రోడముగ నాభిలోగ్రపంచాస్యుడై
మెట్టెన్ నామది నీదు దూతయిదె స్వామీ! రామచన్ద్ర ప్రభూ!
హనుమాన్ చాలీసాను ఆధారంగా తీసుకొని ఆంజనేయవైభవాన్ని ఆవిష్కరించుకో బోతున్నాం. హనుమాన్ చాలీసా రచించినవాడు గోస్వామి తులసీదాసు. ఆయన పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందినవాడు. కాశీలో నివసించి, కాశీవిశ్వేశ్వరుని ఆజ్ఞ మేరకు రామచరిత్రను రచించి, గానం చేసి, కాశ్యాంతు మరణాన్ముక్తిః అన్నట్టుగా కాశీలోనే ముక్తిని పొందాడు. కాశీలో కేదారస్వామి ఆలయానికి సమీపంలో అసీఘాట్ ప్రాంతంలో తులసీదాసు దివ్యసమాధి ఉంది.
తులసీ జంగమస్తరుః - 'నడుస్తున్న తులసి చెట్టు తులసీదాసు' అన్నారు. మధుసూదనసరస్వతిస్వామివారు. తులసిచెట్టు ఎలా అత్యంత పవిత్రమైనదో.... తులసీదాసు అంత పవిత్రమూర్తి. కాశీలో ఆయన అలా నడయాడి తరించాడు.
తులసీదాసు హనుమంతుని అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందిన హనుమత్ భక్తుడు. విశ్వనాథుని అనుగ్రహమే ఆయనకు హనుమత్ స్వరూపంగా లభించింది. హనుమంతుని ద్వారానే తులసీదాసుకు రామసాక్షాత్కారం కలిగింది.
భాగవతోత్తముడైన తులసీదాసు చరిత్ర మనలను పవిత్రం చేస్తుంది. ఆయన అవతారపురుషుడు అని కొన్ని గ్రంథాలు చెప్తున్నాయి. భరద్వాజసంహిత అనే మంత్రశాస్త్రగ్రంథంలో తులసీదాసు వాల్మీకి మరొక అవతారము అని చెప్తూ దానికి సంబంధించిన కథను చెప్పారు............
హనుమాన్ చాలీసా పుట్టెన్ వానరుడౌచు; విక్రమకళాస్ఫూర్తిన్ నృసింహుందుగా నట్టే దానవహంత; వేగగతిలోనా వైనతేయుండె; తా జుట్టెన్ వేదములెల్ల నశ్వముఖుడై; శోకాబ్దిలోనుండి పై బెట్టెన్ భూసుతనిట్టె క్రోడముగ నాభిలోగ్రపంచాస్యుడై మెట్టెన్ నామది నీదు దూతయిదె స్వామీ! రామచన్ద్ర ప్రభూ! హనుమాన్ చాలీసాను ఆధారంగా తీసుకొని ఆంజనేయవైభవాన్ని ఆవిష్కరించుకో బోతున్నాం. హనుమాన్ చాలీసా రచించినవాడు గోస్వామి తులసీదాసు. ఆయన పరమేశ్వరుని అనుగ్రహాన్ని పొందినవాడు. కాశీలో నివసించి, కాశీవిశ్వేశ్వరుని ఆజ్ఞ మేరకు రామచరిత్రను రచించి, గానం చేసి, కాశ్యాంతు మరణాన్ముక్తిః అన్నట్టుగా కాశీలోనే ముక్తిని పొందాడు. కాశీలో కేదారస్వామి ఆలయానికి సమీపంలో అసీఘాట్ ప్రాంతంలో తులసీదాసు దివ్యసమాధి ఉంది. తులసీ జంగమస్తరుః - 'నడుస్తున్న తులసి చెట్టు తులసీదాసు' అన్నారు. మధుసూదనసరస్వతిస్వామివారు. తులసిచెట్టు ఎలా అత్యంత పవిత్రమైనదో.... తులసీదాసు అంత పవిత్రమూర్తి. కాశీలో ఆయన అలా నడయాడి తరించాడు. తులసీదాసు హనుమంతుని అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందిన హనుమత్ భక్తుడు. విశ్వనాథుని అనుగ్రహమే ఆయనకు హనుమత్ స్వరూపంగా లభించింది. హనుమంతుని ద్వారానే తులసీదాసుకు రామసాక్షాత్కారం కలిగింది. భాగవతోత్తముడైన తులసీదాసు చరిత్ర మనలను పవిత్రం చేస్తుంది. ఆయన అవతారపురుషుడు అని కొన్ని గ్రంథాలు చెప్తున్నాయి. భరద్వాజసంహిత అనే మంత్రశాస్త్రగ్రంథంలో తులసీదాసు వాల్మీకి మరొక అవతారము అని చెప్తూ దానికి సంబంధించిన కథను చెప్పారు............© 2017,www.logili.com All Rights Reserved.