అన్ని వైపుల నుండి మంచి ఆలోచనలు మాకు వచ్చుగాక (ఋగ్వేదం)
వేదవాక్యములే మనకు ఆప్తవాక్యాలు. ఇవే మనకు ప్రమాణాలు. స్ఫూర్తి కలిగించడానికి, జీవన గమనాన్ని నిర్దేశించడానికి ఇవే కరదీపికలు. మన శ్రేయోభిలాషులైన ఋషులు దర్శించి చెప్పినవి కనుక వీటిని 'ఆప్తవాక్యాలు' అన్నారు. ఒకొక్క వాక్యం చాలు - చింతన చేస్తే ఎన్నో అర్థాలతో వెలిగిపోతూ మార్గదర్శకమవుతాయి.
అనంతవిశ్వంలో ఎటువైపు నుండి ఏ మంచి ఆలోచన వచ్చినా స్వీకరించాలని చెప్తోందీ మాట. ఇంత విశాలమైన దృక్పథం వేదానిది.
జ్ఞానసముపార్జనే ఈ దేశానికి పరమార్థం. అందుకే 'అన్నివిధాల' అనేది మన లక్షణం కావాలి. ఏ ఆలోచనలైనా, ప్రపంచ పరిశీలనతో మనకు స్ఫూర్తినిస్తాయి.
మనకు బాహ్యంగానే కాక, అంతరంగంలో కూడా ఉత్తమత్వాన్ని వదలకూడదు. ఆలోచన అంతరంగం విషయం. 'తప-ఆలోచనే' అన్నారు. ఆలోచనే తపస్సు. తపించే ఆలోచన వల్ల ఆవిష్కరింపబడ్డ విషయం - శ్రేయస్కర ఆలోచనలే మన బుద్ధిలో చేరాలి. పతనం చేసే ఆలోచనకు తావీయకూడదు.
వేదం కోరిన శుభాకాంక్ష ఇది. మన బుద్ధి మంచి ఆలోచనకి స్పందించాలి. అది విశ్వంలో ఏ మూలనుండైనా రావచ్చు. కాబట్టి అన్ని ద్వారాలూ తెరిచిన హృదయంతో భద్రమైన భావాలు స్వీకరిద్దాం............
ఆ నో భద్రాః క్రతవో యాంతు విశ్వతః॥ అన్ని వైపుల నుండి మంచి ఆలోచనలు మాకు వచ్చుగాక (ఋగ్వేదం) వేదవాక్యములే మనకు ఆప్తవాక్యాలు. ఇవే మనకు ప్రమాణాలు. స్ఫూర్తి కలిగించడానికి, జీవన గమనాన్ని నిర్దేశించడానికి ఇవే కరదీపికలు. మన శ్రేయోభిలాషులైన ఋషులు దర్శించి చెప్పినవి కనుక వీటిని 'ఆప్తవాక్యాలు' అన్నారు. ఒకొక్క వాక్యం చాలు - చింతన చేస్తే ఎన్నో అర్థాలతో వెలిగిపోతూ మార్గదర్శకమవుతాయి. అనంతవిశ్వంలో ఎటువైపు నుండి ఏ మంచి ఆలోచన వచ్చినా స్వీకరించాలని చెప్తోందీ మాట. ఇంత విశాలమైన దృక్పథం వేదానిది. జ్ఞానసముపార్జనే ఈ దేశానికి పరమార్థం. అందుకే 'అన్నివిధాల' అనేది మన లక్షణం కావాలి. ఏ ఆలోచనలైనా, ప్రపంచ పరిశీలనతో మనకు స్ఫూర్తినిస్తాయి. మనకు బాహ్యంగానే కాక, అంతరంగంలో కూడా ఉత్తమత్వాన్ని వదలకూడదు. ఆలోచన అంతరంగం విషయం. 'తప-ఆలోచనే' అన్నారు. ఆలోచనే తపస్సు. తపించే ఆలోచన వల్ల ఆవిష్కరింపబడ్డ విషయం - శ్రేయస్కర ఆలోచనలే మన బుద్ధిలో చేరాలి. పతనం చేసే ఆలోచనకు తావీయకూడదు. వేదం కోరిన శుభాకాంక్ష ఇది. మన బుద్ధి మంచి ఆలోచనకి స్పందించాలి. అది విశ్వంలో ఏ మూలనుండైనా రావచ్చు. కాబట్టి అన్ని ద్వారాలూ తెరిచిన హృదయంతో భద్రమైన భావాలు స్వీకరిద్దాం............© 2017,www.logili.com All Rights Reserved.