చిరంజీవి సామవేదం షణ్ముఖ శర్మగారు వ్రాసిన అనేక రచనలు ఒకచోట చేర్చి “ఏష ధర్మః సనాతనః” అనే ఒక గ్రంథముగా రూపొందించినారు. అప్పుడప్పుడు పత్రికలలో ప్రకటించబడిన వ్యాసములను చదువనివారికి ఈ సమగ్రమైన సంపుటి మిక్కిలి ఉపయోగకరము. ఈ సంపుటి ఇంటనుండే కుటుంబ సభ్యులందరూ చదువుకొనుటకు వీలగు సంపదవంటిది.
ఇందలి విషయము మన ఆర్షధర్మానికి గల బహుముఖములు, సులభ శైలిలో ప్రజలకి అందించబడినవి. పురాణేతిహాసములందు, శాస్త్ర వాజ్మయమునందుగల అనేక అపురూప విషయములు ఇందున్నవి. తన విశిష్టశైలియందు దేవాసుర సంగ్రామ వ్యాఖ్య ప్రత్యేకమైనది. అట్లే పంచయజ్ఞ సిద్ధాంతము. మూడు వ్యాసములందు తాత్వికముగ వివరించబడినది. ఈ విధముగ అనేక విషయములు ప్రజలకు విజ్ఞానదాయకముగ చెప్పబడిన ఈ వ్యాస సంపుటి సర్వజనాదరణ పొందుట నిశ్చయము. -
శ్రీ షణ్ముఖశర్మగారి వాణి దేశమందు నిత్యము ప్రజలను చేరి విలువైన విజ్ఞానమును వ్యాప్తి చేయుచున్నది. సాధక సమాజము కూడ ఆయనకు ఋణపడుచున్నది. ఆయన వాణి నిరంతరముగ వ్యాప్తి చెందును గాక.
శుభమస్తు
(శివానందమూర్తి)
చిరంజీవి సామవేదం షణ్ముఖ శర్మగారు వ్రాసిన అనేక రచనలు ఒకచోట చేర్చి “ఏష ధర్మః సనాతనః” అనే ఒక గ్రంథముగా రూపొందించినారు. అప్పుడప్పుడు పత్రికలలో ప్రకటించబడిన వ్యాసములను చదువనివారికి ఈ సమగ్రమైన సంపుటి మిక్కిలి ఉపయోగకరము. ఈ సంపుటి ఇంటనుండే కుటుంబ సభ్యులందరూ చదువుకొనుటకు వీలగు సంపదవంటిది. ఇందలి విషయము మన ఆర్షధర్మానికి గల బహుముఖములు, సులభ శైలిలో ప్రజలకి అందించబడినవి. పురాణేతిహాసములందు, శాస్త్ర వాజ్మయమునందుగల అనేక అపురూప విషయములు ఇందున్నవి. తన విశిష్టశైలియందు దేవాసుర సంగ్రామ వ్యాఖ్య ప్రత్యేకమైనది. అట్లే పంచయజ్ఞ సిద్ధాంతము. మూడు వ్యాసములందు తాత్వికముగ వివరించబడినది. ఈ విధముగ అనేక విషయములు ప్రజలకు విజ్ఞానదాయకముగ చెప్పబడిన ఈ వ్యాస సంపుటి సర్వజనాదరణ పొందుట నిశ్చయము. - శ్రీ షణ్ముఖశర్మగారి వాణి దేశమందు నిత్యము ప్రజలను చేరి విలువైన విజ్ఞానమును వ్యాప్తి చేయుచున్నది. సాధక సమాజము కూడ ఆయనకు ఋణపడుచున్నది. ఆయన వాణి నిరంతరముగ వ్యాప్తి చెందును గాక. శుభమస్తు (శివానందమూర్తి)© 2017,www.logili.com All Rights Reserved.