సూర్యోదయమై రెండుగంటలు కావస్తున్నా రాఘవ రావు ఇంకా నిద్రలేవలేదు. కూతురు సరోజ రెండుసార్లు వచ్చి లేపి, వంటింట్లో టిఫిన్ చెయ్యడంలో నిమగ్నమైపోయింది. రాఘవరావు గారిది మధ్య తరగతి కుటుంబం. కొద్ది సంవత్సరాల క్రిందట భార్య మరణిస్తూ సరోజ బాధ్యత రాఘవరావు పై వదలి వెళ్ళిపోయింది. భార్య మరణంతో కృంగిపోయిన రాఘవరావు పేకాట వ్యసనానికి అలవాటు పడ్డాడు. స్వంత ఇల్లు, రెండెకరాల పొలం మాత్రమే ఉంది. వ్యవసాయం మీద వచ్చే రాబడితోనే ఇల్లు గడుస్తోంది.
సరోజ పెళ్లీడుకు వచ్చిన అందమైన పిల్ల. రాఘవరావు చేల్లెలు కాంతమ్మ కూడా ఈ ఊర్లోనే ఉంది. కాంతమ్మ తన కొడుకు మాధవ్ కు సరోజను చేసుకుందామని ఉన్నా, ఆ రెండెకరాల పొలం కట్నం రూపేణా ఇమ్మని పట్టు పడుతోంది. పొలం కట్నం రూపేణా ఇచ్చేస్తే ఇక తనకు తరువాత జరుగుబాటెలా ఉంటుందని రాఘవరావుకి ఇష్టంలేదు. కట్నం లేకుండా చేసుకోమని చెల్లెలికి రెండు మూడు సార్లు కబురు పంపాడు. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.
సూర్యోదయమై రెండుగంటలు కావస్తున్నా రాఘవ రావు ఇంకా నిద్రలేవలేదు. కూతురు సరోజ రెండుసార్లు వచ్చి లేపి, వంటింట్లో టిఫిన్ చెయ్యడంలో నిమగ్నమైపోయింది. రాఘవరావు గారిది మధ్య తరగతి కుటుంబం. కొద్ది సంవత్సరాల క్రిందట భార్య మరణిస్తూ సరోజ బాధ్యత రాఘవరావు పై వదలి వెళ్ళిపోయింది. భార్య మరణంతో కృంగిపోయిన రాఘవరావు పేకాట వ్యసనానికి అలవాటు పడ్డాడు. స్వంత ఇల్లు, రెండెకరాల పొలం మాత్రమే ఉంది. వ్యవసాయం మీద వచ్చే రాబడితోనే ఇల్లు గడుస్తోంది. సరోజ పెళ్లీడుకు వచ్చిన అందమైన పిల్ల. రాఘవరావు చేల్లెలు కాంతమ్మ కూడా ఈ ఊర్లోనే ఉంది. కాంతమ్మ తన కొడుకు మాధవ్ కు సరోజను చేసుకుందామని ఉన్నా, ఆ రెండెకరాల పొలం కట్నం రూపేణా ఇమ్మని పట్టు పడుతోంది. పొలం కట్నం రూపేణా ఇచ్చేస్తే ఇక తనకు తరువాత జరుగుబాటెలా ఉంటుందని రాఘవరావుకి ఇష్టంలేదు. కట్నం లేకుండా చేసుకోమని చెల్లెలికి రెండు మూడు సార్లు కబురు పంపాడు. తరువాత ఏం జరిగిందో ఈ నవల చదివి తెలుసుకొనగలరు.© 2017,www.logili.com All Rights Reserved.