మానవుడు ద్రష్టయైనదెట్లు?
ఇటలీ దేశం సర్వనాశనమైపోయింది. ఎన్నో నగరాలు శిధిలములైపోయినాయి. కొన్ని పూర్తిగా నామమాత్రావశేషములైనాయి. ఈ భూమినుంచి శుభ్రంగా తుడిచి వేయబడినాయా? అన్నట్లున్నాయి, ఆ నగరాలు. మానవునిమీదికి పంచభూతాలూ ప్రళయోద్దండంగా తిరగబడినవా? అనిపిస్తుంది. ఏ భూకంపమో, జలప్రళయమో మాత్రమే యిట్లాంటి వినాశాన్ని గావించగలదు. నిన్న మొన్నటివరకు సర్వసంపదలతోనూ భోగ భాగ్యాలతోనూ తులతూగుతూన్న ప్రాంతాలు యీనాడు సర్వనాశనమైపోయాయి.
సాగులేక పొలాలన్నీ కలుపు వేసిపోయాయి. ఉపేక్షించడం వల్ల ద్రాక్షతోటలు మహారణ్యాలుగా గజిబిజిగా అల్లుకుపోయినాయి. భూదేవి తల్లిలాంటిది. వంద్యగా, నగ్నంగా వుండనిచ్చగించ దామె. తన గాయాలను భూమాత తన కనూచానమైన రీతిగా మానుపుకో ప్రయత్నిస్తూంది.
రోమక సినేటర్ల (ప్రజాప్రతినిధులు) రాజభవనాలు శిధిలాలుగా వున్నాయి. రోములోని సుందర ప్రాసాదాలు భగ్నస్తంభాలనుంచీ వాటి తాలూకు చలువరాతి తునకలనుంచీ బర్బరులైన నూతనాగంతుకులు తమ కోసం కొత్తగా గ్రామాలనూ, గృహాలనూ నిర్మించుకుంటున్నారు. భగ్నములైన దుర్గకుడ్యముల శిలాఫలకములతో వారు మళ్లీ కోటలు లేవదీస్తున్నారు. తమాల వృక్షములతో నల్లగా నున్న తోపుల్లోంచి నిర్దాక్షిణ్యంగా వారు తమ గొడ్డండ్లతో చెట్లను నరికి తెచ్చి, తమ గుడిసెలలో నెగళ్ళు వేసుకుంటున్నారు. ఆ పచ్చిదుంగల పొగతో ఆ బర్బరులు గుడిసెలు పొగచూరి నల్లనై వున్నాయి.
రోమును జయించిన యీ బర్బరులు గోథ్ జాతివారు. గ్రామ వీధుల్లో గోథుల పిల్లలు రోమను శిల్పాల తునుకలతో ఆడుకుంటున్నారు. రోమను అంగీలు, ఉత్తరీయాలు, వాటి తునుకలు, గోధుమాతలు తమ పురిటిండ్లలో శిశువుల పొత్తిళ్లుగా వుపయోగిస్తున్నారు. గోథులరాజు తన పరివారానికి యీ దేశాన్నంతనీ బహు ఉదారంగా పంచి యిచ్చేడు. రోము నగరానికి దగ్గరలో నున్న ఒక భూఖండంమీద గోథురాజ పరివారంలోని వాడొకడు జమీందారుగా నూతన యజమానిగా స్థిరనివాసం యేర్పరచు కున్నాడు. ఇటలీలోని సుక్షేత్రాలన్నీ గోథురాజు తన జాతీయులకు పంచిపెట్టి యెంతో ఔదార్యాన్ని....................
మానవుడు ద్రష్టయైనదెట్లు? ఒకటో ప్రకరణం కడపటి రోమనులు ఇటలీ దేశం సర్వనాశనమైపోయింది. ఎన్నో నగరాలు శిధిలములైపోయినాయి. కొన్ని పూర్తిగా నామమాత్రావశేషములైనాయి. ఈ భూమినుంచి శుభ్రంగా తుడిచి వేయబడినాయా? అన్నట్లున్నాయి, ఆ నగరాలు. మానవునిమీదికి పంచభూతాలూ ప్రళయోద్దండంగా తిరగబడినవా? అనిపిస్తుంది. ఏ భూకంపమో, జలప్రళయమో మాత్రమే యిట్లాంటి వినాశాన్ని గావించగలదు. నిన్న మొన్నటివరకు సర్వసంపదలతోనూ భోగ భాగ్యాలతోనూ తులతూగుతూన్న ప్రాంతాలు యీనాడు సర్వనాశనమైపోయాయి. సాగులేక పొలాలన్నీ కలుపు వేసిపోయాయి. ఉపేక్షించడం వల్ల ద్రాక్షతోటలు మహారణ్యాలుగా గజిబిజిగా అల్లుకుపోయినాయి. భూదేవి తల్లిలాంటిది. వంద్యగా, నగ్నంగా వుండనిచ్చగించ దామె. తన గాయాలను భూమాత తన కనూచానమైన రీతిగా మానుపుకో ప్రయత్నిస్తూంది. రోమక సినేటర్ల (ప్రజాప్రతినిధులు) రాజభవనాలు శిధిలాలుగా వున్నాయి. రోములోని సుందర ప్రాసాదాలు భగ్నస్తంభాలనుంచీ వాటి తాలూకు చలువరాతి తునకలనుంచీ బర్బరులైన నూతనాగంతుకులు తమ కోసం కొత్తగా గ్రామాలనూ, గృహాలనూ నిర్మించుకుంటున్నారు. భగ్నములైన దుర్గకుడ్యముల శిలాఫలకములతో వారు మళ్లీ కోటలు లేవదీస్తున్నారు. తమాల వృక్షములతో నల్లగా నున్న తోపుల్లోంచి నిర్దాక్షిణ్యంగా వారు తమ గొడ్డండ్లతో చెట్లను నరికి తెచ్చి, తమ గుడిసెలలో నెగళ్ళు వేసుకుంటున్నారు. ఆ పచ్చిదుంగల పొగతో ఆ బర్బరులు గుడిసెలు పొగచూరి నల్లనై వున్నాయి. రోమును జయించిన యీ బర్బరులు గోథ్ జాతివారు. గ్రామ వీధుల్లో గోథుల పిల్లలు రోమను శిల్పాల తునుకలతో ఆడుకుంటున్నారు. రోమను అంగీలు, ఉత్తరీయాలు, వాటి తునుకలు, గోధుమాతలు తమ పురిటిండ్లలో శిశువుల పొత్తిళ్లుగా వుపయోగిస్తున్నారు. గోథులరాజు తన పరివారానికి యీ దేశాన్నంతనీ బహు ఉదారంగా పంచి యిచ్చేడు. రోము నగరానికి దగ్గరలో నున్న ఒక భూఖండంమీద గోథురాజ పరివారంలోని వాడొకడు జమీందారుగా నూతన యజమానిగా స్థిరనివాసం యేర్పరచు కున్నాడు. ఇటలీలోని సుక్షేత్రాలన్నీ గోథురాజు తన జాతీయులకు పంచిపెట్టి యెంతో ఔదార్యాన్ని....................© 2017,www.logili.com All Rights Reserved.