భూతకాలపు అలవాట్లూ, అచారాలనుంచి, భావికాలపు ఆదర్శాల నందుకోనేటందుకు మానవుని ప్రయత్నం అనవరతం సాగుతూనే వుంటుంది. ఈ రెండు కాలాలనూ కలుపుతున్న వర్తమాన కాలాన్ని ఒక వంతెనతో పోల్చవచ్చు.
అయితే ఈ వంతెనపై మానవుని ప్రయాణంలో క్షణక్షణం ఎదురు దెబ్బలు తగులుతాయి. తల నొప్పి కడుతూంటుంది. అలవాటైన భూతకాలపు పరిధుల్లో నిలబడలేడు. కనిపించని భయాలతో అదురు పుట్టించే భవిష్యత్తు మీద ఆశ వదులుకోలేడు. అతని ప్రయాణం ఆగదు. కాని, బంధనాలేవో, ఇంధనాలేవో భేదం చూడలేని సందిగ్ధస్థితి అతని నడుగడుగునా వేధిస్తుంది. అతడు అడుగు పెట్టిన వంతెన మామూలు వంతెన కాదు, కత్తుల వంతెన!
కాని ఆ కత్తులవాడీ, వంతెన నిడివీ అతని ఆ వేగోద్వేగాల్ని నిలవరించలేవు. మందంగానో, దురితంగానో అతని అడుగు ముందుకే, మన్ముందుకే.
- మహీధర రామమోహనరావు
భూతకాలపు అలవాట్లూ, అచారాలనుంచి, భావికాలపు ఆదర్శాల నందుకోనేటందుకు మానవుని ప్రయత్నం అనవరతం సాగుతూనే వుంటుంది. ఈ రెండు కాలాలనూ కలుపుతున్న వర్తమాన కాలాన్ని ఒక వంతెనతో పోల్చవచ్చు. అయితే ఈ వంతెనపై మానవుని ప్రయాణంలో క్షణక్షణం ఎదురు దెబ్బలు తగులుతాయి. తల నొప్పి కడుతూంటుంది. అలవాటైన భూతకాలపు పరిధుల్లో నిలబడలేడు. కనిపించని భయాలతో అదురు పుట్టించే భవిష్యత్తు మీద ఆశ వదులుకోలేడు. అతని ప్రయాణం ఆగదు. కాని, బంధనాలేవో, ఇంధనాలేవో భేదం చూడలేని సందిగ్ధస్థితి అతని నడుగడుగునా వేధిస్తుంది. అతడు అడుగు పెట్టిన వంతెన మామూలు వంతెన కాదు, కత్తుల వంతెన! కాని ఆ కత్తులవాడీ, వంతెన నిడివీ అతని ఆ వేగోద్వేగాల్ని నిలవరించలేవు. మందంగానో, దురితంగానో అతని అడుగు ముందుకే, మన్ముందుకే. - మహీధర రామమోహనరావు© 2017,www.logili.com All Rights Reserved.