గ్రీకు సాహిత్య సనాతనం హోమర్
అవును, “జనపదాల కల్పిత కథనాలలోకి కవితాత్మక జీవశ్వాసలను ఊది, గ్రీసుదేశ సాంఘికచైతన్యాన్ని జాగృతం చేసిన విజ్ఞుడు హోమర్.”
హోమర్ ఒక జన్మరహస్యం, ఒక చారిత్రక సందేహం. హోమర్ జననం సుమారు క్రీ.పూ. 8వశతాబ్దంలో జరిగిందని, జన్మస్థలం పశ్చిమ టర్కీ తీరప్రాంతం ఇ (lona) కు చెందిన కియోస్ (Chios) ద్వీపం అని అంటారు. కాని, కచ్చితమైన ఆధారాలు లేవనే చెప్పాల్సి ఉంటుంది. కనీసం తొమ్మిది ప్రాంతాలవారు ఇప్పటికీ హోమర్ తమ వాడేనని వాదిస్తున్నారు. అతడు క్యాలెండర్ పుట్టని క్రీస్తుపూర్వపు సనాతనవాసి కావడమే అందుకు కారణం కావచ్చు. హోమర్ అంధుడు. లొల్లాయి పదాలు వల్లిస్తూ, ట్రాయ్ నగరం వినాశనం గురించి కవితలు అల్లుకుంటూ, తత్త్వాలు పాడుకుంటూ బైరాగిలా తిరిగేవాడు. అలా వీరగాథలను పాడుకుంటూ వినోదాన్ని కూర్చే కవులను అయివొడోస్ (Aiodos) అనేవాళ్ళు. కాని ఇదీ వివాదాస్పదమే అయింది. ఆనాటి గ్రీకు సంస్కృతీ సంప్రదాయ కథనాల నుండి, స్వీయకావ్యాలలోని పాత్రల వ్యక్తిత్వాల నుండి రూపుదిద్దుకున్న కల్పిత స్వరూపమే హోమర్ అస్తిత్వమని జనాంతికం. హోమర్ గాయక కవి. జన సామాన్యంలో విస్తరించివున్న జానపద కథా శకలాలను గుదిగుచ్చి సృజనరమ్యంగా, శ్రుతిపేయంగా పాడుకున్న శ్రావ్యకవి. ఆతని కవన గానం గ్రీకు తొలి కావ్యంగా, యూరోపియన్ ఆదిమ కవిత్వంగా ప్రసిద్ధికెక్కింది.............
గ్రీకు సాహిత్య సనాతనం హోమర్ అవును, “జనపదాల కల్పిత కథనాలలోకి కవితాత్మక జీవశ్వాసలను ఊది, గ్రీసుదేశ సాంఘికచైతన్యాన్ని జాగృతం చేసిన విజ్ఞుడు హోమర్.” హోమర్ ఒక జన్మరహస్యం, ఒక చారిత్రక సందేహం. హోమర్ జననం సుమారు క్రీ.పూ. 8వశతాబ్దంలో జరిగిందని, జన్మస్థలం పశ్చిమ టర్కీ తీరప్రాంతం ఇ (lona) కు చెందిన కియోస్ (Chios) ద్వీపం అని అంటారు. కాని, కచ్చితమైన ఆధారాలు లేవనే చెప్పాల్సి ఉంటుంది. కనీసం తొమ్మిది ప్రాంతాలవారు ఇప్పటికీ హోమర్ తమ వాడేనని వాదిస్తున్నారు. అతడు క్యాలెండర్ పుట్టని క్రీస్తుపూర్వపు సనాతనవాసి కావడమే అందుకు కారణం కావచ్చు. హోమర్ అంధుడు. లొల్లాయి పదాలు వల్లిస్తూ, ట్రాయ్ నగరం వినాశనం గురించి కవితలు అల్లుకుంటూ, తత్త్వాలు పాడుకుంటూ బైరాగిలా తిరిగేవాడు. అలా వీరగాథలను పాడుకుంటూ వినోదాన్ని కూర్చే కవులను అయివొడోస్ (Aiodos) అనేవాళ్ళు. కాని ఇదీ వివాదాస్పదమే అయింది. ఆనాటి గ్రీకు సంస్కృతీ సంప్రదాయ కథనాల నుండి, స్వీయకావ్యాలలోని పాత్రల వ్యక్తిత్వాల నుండి రూపుదిద్దుకున్న కల్పిత స్వరూపమే హోమర్ అస్తిత్వమని జనాంతికం. హోమర్ గాయక కవి. జన సామాన్యంలో విస్తరించివున్న జానపద కథా శకలాలను గుదిగుచ్చి సృజనరమ్యంగా, శ్రుతిపేయంగా పాడుకున్న శ్రావ్యకవి. ఆతని కవన గానం గ్రీకు తొలి కావ్యంగా, యూరోపియన్ ఆదిమ కవిత్వంగా ప్రసిద్ధికెక్కింది.............© 2017,www.logili.com All Rights Reserved.