కొండ్రెడ్డి కరువుసీమ రైతుబిడ్డ స్వయంగా రైతు మేడిపట్టిన అనుభవం వుంది. దేశంలో అన్ని రంగాలను గురించి కవితలు రాస్తూ తన రంగాన్ని గురించి కూడా ఆ అహంతో ఆ ప్రేరణతో అనేక కవితలు రాశారు. కరువు అప్పులు ఆత్మహత్యలు ప్రభుత్వ వ్యతిరేకత గిట్టుబాటు ధరలు లేమి వ్యాపారుల దళారులు మోసాలు వంటి రైతు వెన్నుచుట్టు చుట్టుకొన్న పిశాచి సమూహం కొండ్రెడ్డి కవిత్వంలో ప్రతిబింబిస్తుంది.
- డా రాచపాళెం చంద్రశేఖరరెడ్డి
కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి గారి వాకిలి తెరవని వాన నా లోపలి వాకిళ్ళను తెరిపించింది. ఇది వాకిలి తెరవని వనే కావచ్చు. నా వాకిలి తడిచింది. ముంగిలి మురిసింది. లోగిలి మెరిసింది. కొండ్రెడ్డి గారి కవిత్వంలో అడుగడుగునా అద్భుతమైన ఆశావహదృక్పధం కనిపిస్తుంది. ఈయన కవిత్వంలో కొంగ్రొత్త అభివ్యక్తులకు కొదవే లేదు. కొండ్రెడ్డి గారి కవిత్వంలో శిఖప్రాయంగా మకుట సాదృశ్యంగా మనముందు నిలిచే ఉదాత్త పంక్తులు చాలా వున్నాయి.
- డా నలిమెల భాస్కర్
కొండ్రెడ్డి కవిత్వం క్లుప్తత గుప్తతతోపాటు సాంద్రతను సంతరించుకొని సందేశాత్మకంగా వుంది. వీరి కవిత్వంలో లోతైన పరిశీలనతో కూడిన సామజిక అను భవం చక్కని అవగాహనను కవితాత్మకంగా చెప్పడం నాకు నచ్చిన అంశం. ఈ కవి రైతు నేపథ్యం నుండి వచ్చినవాడు కనుక రైతు బాధలు గాధలు బాగా తెలుసు. ఇందులో వున్నా కవితలన్నీ నేటి సామజిక రుగ్మతలను ఎత్తిచూపుతూ జనచైతన్యానికి దోహదపడేవిగా వున్నాయి. ఈ కవి సమాజంలో కరిగి ప్రవహించడం తెలిసినవాడు. తనలోకి తాను ఎగిరిపోవడం ఎరగనివాడు.
- డా ఎన్. ప్రభాకర్ రెడ్డి