"కవికొండలను కొండంత కవి" గా సాహితీలోకం సంభావించింది. కవికొండల గారు 1910 నుండీ ఆంగ్లంలో కవిత్వం రాయడం మొదలెట్టి 'కూల్ర్డ్ గారి' ప్రోత్సాహంతో తెలుగులో రాయడం ఆరంభించారు. కూల్డ్ర్ గారే వీరిని "ఆంధ్రా వర్డ్స్ వర్త్" అంటూ ఓ ఆంగ్ల వ్యాసంలో వర్ణించారు. తన కవితలను తానే పాడుతుంటే ఆనందించే వాళ్ళమని అడివి బాపిరాజుగారి సాక్ష్యం. నవ్య సాహిత్యోద్యమ ప్రభావం 1920 నుండి వీరి ఆలోచనలనూ రచనాదృష్టిని నేలబారు చేసింది. "జనానికి ఇంత సన్నిహితుడైన కవిలేడు" అని దేవులపల్లి కృష్ణశాస్త్రి గారన్నా, "మహప్రస్థానం ఆవేశానికి ప్రోద్బలాలు" అని కొందరిని స్మరిస్తూ "నజ్రుల్ ఇస్లాం" గీతాలు నామనస్సులో ఏదో మారు మ్రోగుతూ ఉండి వుండాలి. అలాగే కవికొండల కంఠము కూడా అని 'శ్రీశ్రీ' అనడం కవికొండల భావజాలానికీ రచనా శైలికి నీరాజనాలు పట్టడమే! కవికొండల వృత్తిరీత్యా న్యాయవాదిగా రాజమండ్రి, నరసాపురంలలో గడిపినా, సాహితీ సృజన ప్రవృత్తిలోనే ఎక్కువగా గణనకెక్కారనే అనాలి.
వీరు సాహిత్య ప్రక్రియలన్నిటినీ తన రచనలకు వాడుకున్నారు. ఆ జాబితా ఈ గ్రంథం అనుబంధంలో చూడచ్చు. వీరి కధలతో ఈతరం రచయితలకు పరిచయంలేదు. కవికొండలవారే 'దేశ సేవ' పత్రికలో 'నేను వ్రాసినవేమిటంటే... అంటూ తన రచనా ప్రక్రియలను వివరిస్తూ కొన్ని వ్యాసాలను రాశారు. కధల గురించి వారు రాసిన వ్యాసాన్ని ఈ సంకలనంలో ప్రచురించాం. వీటిని చివరకు "కధల"నే తీర్పు చెప్పారు. కవికొండలవారి కృతులమీద శ్రీమతి జడప్రోలు విజయలక్ష్మి గారు పరిశోధనచేసి 1985 లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్ డి పట్టా సంపాదించారు. వీరి గ్రంథం నుండి కొంత సమాచారం ఈ సంకలనంలో ఉపయోగించుకున్నాం.
నేటి కధా సౌధానికి రాళ్ళేత్తిన ఆనాటి గురజాడ, శ్రీపాద తదితరుల కోవలో కవికొండల కూడా... నిజాయితీతోనూ - నిబద్ధతతోనూ శ్రమించిన ఓ కూలీ. వారి కధల్లో కొన్నిటిని - రెండు సంపుటాలుగా తెస్తున్నాం, ఇది మొదటిది.
కధాపధం నడిచిన తోవలో ఉన్న మలుపులను అందుకు కారుకులైన కధకులనూ - వారి సృజననూ నేటి తరం కధానిక విమర్శకులు అవగాహన చేసుకోవడానికి ఈ సంకలనాలు తోడ్పడగలవని మా విశ్వాసం.
- కవికొండల వెంకటరావు
"కవికొండలను కొండంత కవి" గా సాహితీలోకం సంభావించింది. కవికొండల గారు 1910 నుండీ ఆంగ్లంలో కవిత్వం రాయడం మొదలెట్టి 'కూల్ర్డ్ గారి' ప్రోత్సాహంతో తెలుగులో రాయడం ఆరంభించారు. కూల్డ్ర్ గారే వీరిని "ఆంధ్రా వర్డ్స్ వర్త్" అంటూ ఓ ఆంగ్ల వ్యాసంలో వర్ణించారు. తన కవితలను తానే పాడుతుంటే ఆనందించే వాళ్ళమని అడివి బాపిరాజుగారి సాక్ష్యం. నవ్య సాహిత్యోద్యమ ప్రభావం 1920 నుండి వీరి ఆలోచనలనూ రచనాదృష్టిని నేలబారు చేసింది. "జనానికి ఇంత సన్నిహితుడైన కవిలేడు" అని దేవులపల్లి కృష్ణశాస్త్రి గారన్నా, "మహప్రస్థానం ఆవేశానికి ప్రోద్బలాలు" అని కొందరిని స్మరిస్తూ "నజ్రుల్ ఇస్లాం" గీతాలు నామనస్సులో ఏదో మారు మ్రోగుతూ ఉండి వుండాలి. అలాగే కవికొండల కంఠము కూడా అని 'శ్రీశ్రీ' అనడం కవికొండల భావజాలానికీ రచనా శైలికి నీరాజనాలు పట్టడమే! కవికొండల వృత్తిరీత్యా న్యాయవాదిగా రాజమండ్రి, నరసాపురంలలో గడిపినా, సాహితీ సృజన ప్రవృత్తిలోనే ఎక్కువగా గణనకెక్కారనే అనాలి. వీరు సాహిత్య ప్రక్రియలన్నిటినీ తన రచనలకు వాడుకున్నారు. ఆ జాబితా ఈ గ్రంథం అనుబంధంలో చూడచ్చు. వీరి కధలతో ఈతరం రచయితలకు పరిచయంలేదు. కవికొండలవారే 'దేశ సేవ' పత్రికలో 'నేను వ్రాసినవేమిటంటే... అంటూ తన రచనా ప్రక్రియలను వివరిస్తూ కొన్ని వ్యాసాలను రాశారు. కధల గురించి వారు రాసిన వ్యాసాన్ని ఈ సంకలనంలో ప్రచురించాం. వీటిని చివరకు "కధల"నే తీర్పు చెప్పారు. కవికొండలవారి కృతులమీద శ్రీమతి జడప్రోలు విజయలక్ష్మి గారు పరిశోధనచేసి 1985 లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్ డి పట్టా సంపాదించారు. వీరి గ్రంథం నుండి కొంత సమాచారం ఈ సంకలనంలో ఉపయోగించుకున్నాం. నేటి కధా సౌధానికి రాళ్ళేత్తిన ఆనాటి గురజాడ, శ్రీపాద తదితరుల కోవలో కవికొండల కూడా... నిజాయితీతోనూ - నిబద్ధతతోనూ శ్రమించిన ఓ కూలీ. వారి కధల్లో కొన్నిటిని - రెండు సంపుటాలుగా తెస్తున్నాం, ఇది మొదటిది. కధాపధం నడిచిన తోవలో ఉన్న మలుపులను అందుకు కారుకులైన కధకులనూ - వారి సృజననూ నేటి తరం కధానిక విమర్శకులు అవగాహన చేసుకోవడానికి ఈ సంకలనాలు తోడ్పడగలవని మా విశ్వాసం. - కవికొండల వెంకటరావు© 2017,www.logili.com All Rights Reserved.