పి.వి. సాహితీ సాంస్కృతిక నేపథ్యం
ఒక సాహితీ వేత్త, కవి, పండితుడు, భాషా కోవిదుడు, దేశ భక్తి గల ఉత్తమ రాజకీయ నాయకుడు, జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించకుండా ఉండలేని ధిక్కార మనస్కుడు రూపొందాలంటే ఒక బృహత్తర సామాజిక, చారిత్రక నేపథ్యం, ఎన్నో అనుభవాలను, ఒడిదుడుకులను ఎదుర్కొన్న జీవితం ఆయనకు ఉండాలి.
పి.వి. నరసింహారావు సామాజిక, ఆర్థిక నేపథ్యం కూడా అంత బలమైనది. అప్పటి బ్రిటిష్ పాలనలో వున్న భారత దేశం, నిజాం పాలిత హైదరాబాదు రాష్ట్రం రెండూ వేర్వేరు ప్రత్యేక పాలిత వ్యవస్థలైనప్పటికీ పి.వి. నరసింహారావు రెండు రాజ్యాలలో జరుగుతున్న పరిణామాలతో ప్రభావితమయ్యారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాగిన స్వాతంత్య్ర పోరాటం, నిజాం పాలిత హైదరాబాద్ రాష్ట్రంలో జరిగిన తెలంగాణ విముక్తి పోరాటం రెండింటి ప్రభావాలు ఆయనపై ఉన్నాయి. పి.వి. నరసింహారావు స్వాతంత్య్ర పోరాటాన్ని, నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన ప్రజా తిరుగుబాటును ప్రత్యక్షంగా చూడడమే కాక, వాటిలో పాల్గొన్నారు. అంతేకాక మరాఠా ప్రాంతంలో జరిగిన సాంస్కృతిక, దేశ భక్తి ఉద్యమాల ప్రభావం కూడా ఆయనపై పడింది. నాటి హైదరాబాద్, మధ్యపరగణాల రాష్ట్రాల్లో మాత్రమే కాదు, దేశంలో జరిగిన అనేక రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, సాహిత్యోద్యమాల ప్రవాహాల వెల్లువలో ఆయన తడిసిపోయారు. మరాఠీ, హిందీ, ఇంగ్లీషు, తెలుగు సాహిత్యాన్ని విరివిగా చదివారు. పలు విదేశీ భాషల్ని నేర్చుకుని ఆ భాషల్లో వచ్చిన సాహిత్యాన్నీ అధ్యయనం చేశారు. వీటన్నిటి ప్రభావం మూలంగా పి.వి. నరనరాల్లో జాతీయ వాదం, ప్రశ్నించే తత్వం, సామాజిక సమస్యలపై విశాలమైన అవగాహన, ప్రాపంచిక దృక్పథం ఏర్పడ్డాయి. స్వాతంత్ర్య కాలానికీ, స్వాతంత్య్రానంతర కాలానికీ వారధిగా నిలిచిన అతి కొద్ది మంది అసాధారణ నేతల్లో ఆయన ఒకరు......................
పి.వి. సాహితీ సాంస్కృతిక నేపథ్యం ఒక సాహితీ వేత్త, కవి, పండితుడు, భాషా కోవిదుడు, దేశ భక్తి గల ఉత్తమ రాజకీయ నాయకుడు, జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించకుండా ఉండలేని ధిక్కార మనస్కుడు రూపొందాలంటే ఒక బృహత్తర సామాజిక, చారిత్రక నేపథ్యం, ఎన్నో అనుభవాలను, ఒడిదుడుకులను ఎదుర్కొన్న జీవితం ఆయనకు ఉండాలి. పి.వి. నరసింహారావు సామాజిక, ఆర్థిక నేపథ్యం కూడా అంత బలమైనది. అప్పటి బ్రిటిష్ పాలనలో వున్న భారత దేశం, నిజాం పాలిత హైదరాబాదు రాష్ట్రం రెండూ వేర్వేరు ప్రత్యేక పాలిత వ్యవస్థలైనప్పటికీ పి.వి. నరసింహారావు రెండు రాజ్యాలలో జరుగుతున్న పరిణామాలతో ప్రభావితమయ్యారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాగిన స్వాతంత్య్ర పోరాటం, నిజాం పాలిత హైదరాబాద్ రాష్ట్రంలో జరిగిన తెలంగాణ విముక్తి పోరాటం రెండింటి ప్రభావాలు ఆయనపై ఉన్నాయి. పి.వి. నరసింహారావు స్వాతంత్య్ర పోరాటాన్ని, నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన ప్రజా తిరుగుబాటును ప్రత్యక్షంగా చూడడమే కాక, వాటిలో పాల్గొన్నారు. అంతేకాక మరాఠా ప్రాంతంలో జరిగిన సాంస్కృతిక, దేశ భక్తి ఉద్యమాల ప్రభావం కూడా ఆయనపై పడింది. నాటి హైదరాబాద్, మధ్యపరగణాల రాష్ట్రాల్లో మాత్రమే కాదు, దేశంలో జరిగిన అనేక రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, సాహిత్యోద్యమాల ప్రవాహాల వెల్లువలో ఆయన తడిసిపోయారు. మరాఠీ, హిందీ, ఇంగ్లీషు, తెలుగు సాహిత్యాన్ని విరివిగా చదివారు. పలు విదేశీ భాషల్ని నేర్చుకుని ఆ భాషల్లో వచ్చిన సాహిత్యాన్నీ అధ్యయనం చేశారు. వీటన్నిటి ప్రభావం మూలంగా పి.వి. నరనరాల్లో జాతీయ వాదం, ప్రశ్నించే తత్వం, సామాజిక సమస్యలపై విశాలమైన అవగాహన, ప్రాపంచిక దృక్పథం ఏర్పడ్డాయి. స్వాతంత్ర్య కాలానికీ, స్వాతంత్య్రానంతర కాలానికీ వారధిగా నిలిచిన అతి కొద్ది మంది అసాధారణ నేతల్లో ఆయన ఒకరు......................© 2017,www.logili.com All Rights Reserved.