ఆంధ్రదేశంలో , ముఖ్యంగా పూర్వ నిజం హైదరాబాదు సంస్థానంలో భాగమైన తెలంగాణాలో సంస్కృతిక పునరుజ్జివానికి నాయకత్వం వహించినవారిలో ఆంధ్ర పితామహా హనుమంతరావు ముఖ్యలు. ఆంగ్లేయుల పరిపాలనలో కొంత ప్రజాస్వామ్య సంప్రదాయాలు నెలకొన్న ఆనాటి మద్రాసు రాష్ట్రంలోని ఆంధ్ర ప్రాంతంలోవలె గాక పూర్తిగా నిరంకుశ పరిపాలన గల హైదరాబాదు సంస్థానంలో తెలుగు భాషోద్యమమే ఒక రాజకీయోద్యమంగా కొనసాగించవలసి వచ్చిన రోజులలో సాంస్కృతిక పునరుజ్జివనోద్యమాన్ని కత్తిమీద సమువలె నడిపించినవారు హనుమంతరావు గారు. ఆంధ్రప్రాంతంలో వచ్చిన పలు ఉద్యమాలను హనుమంతరావుగారి వంటివారు ఒక్క చేతిమీదుగా నడిపించవలసి వచ్చింది. తెలుగు, ఉర్దూ, పార్సీ, ఇంగ్లీషు బాషలలో ఆయన పండితులు. కవిత్వం వ్రాసినారు. అనువాదాలు చేసినారు.