అమృతం కురిసిన రాత్రిలో నిలిచిపోయిన తిలక్
"జీవనాడి స్పందించే
రుధిర మధువు లందించే
యువకవి లోక ప్రతినిధి
నవభావామృత రసధుని
కవితా సతి నొసట నిత్య
రస గంగాధర తిలకం”
మహాకవి శ్రీశ్రీ (శ్రీరంగం శ్రీనివాసరావు) పలికిన ఈ కవితా పంక్తులు దేవరకొండ బాలగంగాధర తిలక్ గురించే. ఈ తరం, నవతరం కవులు, సాహిత్యాభిమానులు తెలుసుకోవాల్సిన ఆధునిక తెలుగు కవి ప్రముఖుల్లో బాలగంగాధర తిలక్ ఒకరు. సంప్రదాయ పద్య కవిత్వంతోనే తిలక్ కవితా ప్రయాణం ప్రారంభమయినా అన్ని ప్రక్రియల్లోనూ రచనలు చేశారు. కానీ వచన కవితకి సమున్నత పతాకగా నిలిచారు. వచన కవితా పితామహుడుగా కుందుర్తి ఆంజనేయులు సుప్రసిద్ధులు. అయితే, "వచన కవితా ప్రక్రియను పరిపుష్టం చేసిన కొద్దిమందిలో తిలక్కు ప్రత్యేక స్థానం ఉంది.” అని కుందుర్తే అన్నారు. అది అందరూ అంగీకరించారు. తనకు ఏ ఇజాలూ లేవంటారు. తిలక్. ఇజాలు కవిత్వానికి పనికిరావంటారు. "ఇజంలో యింప్రిజన్ అయితే యింగిత జ్ఞానం నశిస్తుంది" (న్యూ సిలబస్) అంటారు. ఏ ఉద్యమాలతోనూ మమేకం కాలేదు. తన అనుభూతిని కవిత్వీకరిస్తున్నాను అన్నారు. తాను అనుభూతివాదినని స్వయంగా చెప్పుకున్నారు. తిలక్ కవిత్వానికి, కథకీ..............
అమృతం కురిసిన రాత్రిలో నిలిచిపోయిన తిలక్ "జీవనాడి స్పందించే రుధిర మధువు లందించే యువకవి లోక ప్రతినిధి నవభావామృత రసధుని కవితా సతి నొసట నిత్య రస గంగాధర తిలకం” మహాకవి శ్రీశ్రీ (శ్రీరంగం శ్రీనివాసరావు) పలికిన ఈ కవితా పంక్తులు దేవరకొండ బాలగంగాధర తిలక్ గురించే. ఈ తరం, నవతరం కవులు, సాహిత్యాభిమానులు తెలుసుకోవాల్సిన ఆధునిక తెలుగు కవి ప్రముఖుల్లో బాలగంగాధర తిలక్ ఒకరు. సంప్రదాయ పద్య కవిత్వంతోనే తిలక్ కవితా ప్రయాణం ప్రారంభమయినా అన్ని ప్రక్రియల్లోనూ రచనలు చేశారు. కానీ వచన కవితకి సమున్నత పతాకగా నిలిచారు. వచన కవితా పితామహుడుగా కుందుర్తి ఆంజనేయులు సుప్రసిద్ధులు. అయితే, "వచన కవితా ప్రక్రియను పరిపుష్టం చేసిన కొద్దిమందిలో తిలక్కు ప్రత్యేక స్థానం ఉంది.” అని కుందుర్తే అన్నారు. అది అందరూ అంగీకరించారు. తనకు ఏ ఇజాలూ లేవంటారు. తిలక్. ఇజాలు కవిత్వానికి పనికిరావంటారు. "ఇజంలో యింప్రిజన్ అయితే యింగిత జ్ఞానం నశిస్తుంది" (న్యూ సిలబస్) అంటారు. ఏ ఉద్యమాలతోనూ మమేకం కాలేదు. తన అనుభూతిని కవిత్వీకరిస్తున్నాను అన్నారు. తాను అనుభూతివాదినని స్వయంగా చెప్పుకున్నారు. తిలక్ కవిత్వానికి, కథకీ..............© 2017,www.logili.com All Rights Reserved.