విషవలయం
భారత్ కమర్షియల్ కార్పొరేషన్ ఎక్స్పోర్టర్స్ అండ్ ఇంపోర్టర్స్ ఆఫీసులో చాలా హడావిడిగా వుంది. కివరాజ్ బిల్డింగ్స్ నాలుగో అంతస్థులోవున్న ఒక పెద్ద హాలుని ఆ కంపెనీ అద్దెకు తీసుకుంది. హాల్లో స్త్రీలూ, పురుషులూ ఇరవై మందికి పైగా కుర్చీల్లో కూర్చుని వాళ్ళపనులను చేసుకుపోతున్నారు. అయిదు టైపు మిషన్లు ధనధన మ్రోగుతున్నాయి. అయిదుగురు యువతులు ఏవో ఉత్తరాలు టైప్ చేస్తున్నారు. హాలు మూలగా ఒక చిన్న ఎయిర్ కండిషన్డ్ కేబిన్ వుంది. డైరక్టర్ మిస్ కామాక్షి అని స్వింగ్ తలుపు మీద ఒక నేమ్ బోర్డు తగిలించబడివుంది. హా అప్పుడప్పుడు టేబుల్ మీదున్న బెల్లులు మ్రోగుతున్నాయి. నౌఖర్లు ఇటూ ఆటూ పరుగెడుతున్నారు. ఒక ఆంగ్లో ఇండియన్ యువతి స్వింగ్ తలుపు తోసుకొని ఎయిర్ కండిషన్డ్ కేబిన్ లోకి ప్రవేశించింది.
కేబిన్ లోపల చాలా అందంగా వుంది. ఏ స్వర్గంలోకో అడుగు పెట్టినట్టు అనిపిస్తోంది, ఎర్రటి లినోలియం నేలను కప్పింది. చక్కటి గాడ్రెజ్ స్టీల్ టేబుల్ ముందు మధ్య వయస్సులోవున్న స్త్రీ కూర్చుని వుంది. టేబుల్ మీద అయిదు రంగు రంగుల టెలిఫోన్లు, కేబిన్ మరో మూల చక్కటి ఫోమ్ సోఫాలు, గోడవారగా గాడ్రెజ్ బీరువాలు ఉన్నాయి. డైరక్టర్ కామాక్షి మొహం పూర్తిగా కనిపించడం లేదు. కళ్ళకు నల్లటి సులోచనాలు, అక్కడక్కడ జుట్టు తెల్లబడింది. ఆమె చాలా ఖరీదయిన దుస్తుల్ని ధరించింది. చేతులకు, మెళ్లో, చెవులకు ఆభరణాలున్నాయి. కాని నల్లటి ఆమె రూపంలో ఎంత వెదికినా సౌందర్య ఛాయలు అవుపించడం లేదు.
"మిస్ జోన్స్!" అంది కామాక్షి, గదిలోకొచ్చిన ఆంగ్లో యిండియన్ యువతి వైపు చూస్తూ.
ఆ ఆంగ్లో యిండియన్ యువతి కామాక్షి కుడి భుజం లాంటిది.
"మరో ఇరవై మంది ఉద్యోగాల కోసం వచ్చారు. పన్నెండుగురు ఆడాళ్ళు, ఎనమండుగురు మొగాళ్లు.‘
"వాళ్ళను మొదట్లో నువ్వు పరిశీలించి మన కర్తవ్యానికి ఉపయోగిస్తారని నమ్మితే లోపలకు పంపు."......................
విషవలయం భారత్ కమర్షియల్ కార్పొరేషన్ ఎక్స్పోర్టర్స్ అండ్ ఇంపోర్టర్స్ ఆఫీసులో చాలా హడావిడిగా వుంది. కివరాజ్ బిల్డింగ్స్ నాలుగో అంతస్థులోవున్న ఒక పెద్ద హాలుని ఆ కంపెనీ అద్దెకు తీసుకుంది. హాల్లో స్త్రీలూ, పురుషులూ ఇరవై మందికి పైగా కుర్చీల్లో కూర్చుని వాళ్ళపనులను చేసుకుపోతున్నారు. అయిదు టైపు మిషన్లు ధనధన మ్రోగుతున్నాయి. అయిదుగురు యువతులు ఏవో ఉత్తరాలు టైప్ చేస్తున్నారు. హాలు మూలగా ఒక చిన్న ఎయిర్ కండిషన్డ్ కేబిన్ వుంది. డైరక్టర్ మిస్ కామాక్షి అని స్వింగ్ తలుపు మీద ఒక నేమ్ బోర్డు తగిలించబడివుంది. హా అప్పుడప్పుడు టేబుల్ మీదున్న బెల్లులు మ్రోగుతున్నాయి. నౌఖర్లు ఇటూ ఆటూ పరుగెడుతున్నారు. ఒక ఆంగ్లో ఇండియన్ యువతి స్వింగ్ తలుపు తోసుకొని ఎయిర్ కండిషన్డ్ కేబిన్ లోకి ప్రవేశించింది. కేబిన్ లోపల చాలా అందంగా వుంది. ఏ స్వర్గంలోకో అడుగు పెట్టినట్టు అనిపిస్తోంది, ఎర్రటి లినోలియం నేలను కప్పింది. చక్కటి గాడ్రెజ్ స్టీల్ టేబుల్ ముందు మధ్య వయస్సులోవున్న స్త్రీ కూర్చుని వుంది. టేబుల్ మీద అయిదు రంగు రంగుల టెలిఫోన్లు, కేబిన్ మరో మూల చక్కటి ఫోమ్ సోఫాలు, గోడవారగా గాడ్రెజ్ బీరువాలు ఉన్నాయి. డైరక్టర్ కామాక్షి మొహం పూర్తిగా కనిపించడం లేదు. కళ్ళకు నల్లటి సులోచనాలు, అక్కడక్కడ జుట్టు తెల్లబడింది. ఆమె చాలా ఖరీదయిన దుస్తుల్ని ధరించింది. చేతులకు, మెళ్లో, చెవులకు ఆభరణాలున్నాయి. కాని నల్లటి ఆమె రూపంలో ఎంత వెదికినా సౌందర్య ఛాయలు అవుపించడం లేదు. "మిస్ జోన్స్!" అంది కామాక్షి, గదిలోకొచ్చిన ఆంగ్లో యిండియన్ యువతి వైపు చూస్తూ. ఆ ఆంగ్లో యిండియన్ యువతి కామాక్షి కుడి భుజం లాంటిది. "మరో ఇరవై మంది ఉద్యోగాల కోసం వచ్చారు. పన్నెండుగురు ఆడాళ్ళు, ఎనమండుగురు మొగాళ్లు.‘ "వాళ్ళను మొదట్లో నువ్వు పరిశీలించి మన కర్తవ్యానికి ఉపయోగిస్తారని నమ్మితే లోపలకు పంపు."......................© 2017,www.logili.com All Rights Reserved.