"కావాలని నేను కవిగా మారలేదు. మాటలు నేర్వగానే మాటలాట మొదలైంది" అన్నాడు నామదేవో ధసాల్. ఈ "దో నంబర్ కీ దునియాలో, ఈ అధో పాతాళపు ప్రపంచంలో, ఈ నరక కూపంలో, ఈ రెడ్ లైట్ ఏరియాలో, వళ్లూ, మనసూ అమ్ముకునే ఈ ప్రజల మధ్యనేను పుట్టాను. పెరిగాను. ఈ పీడిత తాడిత ప్రజల్లో నేనొకడిని. నా కవిత్వం ఇక్కడి జన జీవిత చిత్రణం."
"దళిత పులుల ఉద్యమం మార్క్సిస్టు ఉద్యమం కాదు. అణగదొక్కబడిన ప్రతివాడూ దళితుడే అన్నది నా అభిప్రాయం. నా పయనంలో విషాదమేమిటంటే నాపై కమ్యూనిస్టు ముద్రవేసి, నా స్వంత పార్టీ నుంచే నన్ను వెళ్ళగొట్టారు. నేను ఇందిరాగాంధీని బలపరచినప్పుడూ అంతే! కాని ఆమె ఇస్తానన్న కానుకలను నేను అంగీకరించలేదు. నేను కోరుకున్నది ప్రజలను విముక్తం చేసే నిజమైన విప్లవం"
"నాకు - మావో, ఫిడెల్ కాస్ట్రో, చేగువేరా, హొచిమిన్, మార్క్స్, లెనిన్ లంటే ఇష్టం. రామమనోహర్ లోహియా, ఆచార్య నరేంద్రదేవ్ అంటే అభిమానం. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే భక్తీ ప్రాణం"
ఇవి 'నామదేవో ధసాల్' భావాలు. అతని మాటలు చురకత్తులు. అతని పదాలు అన్యాయాన్నేదిరించే అగ్నిపాదాలు. అతని బాట అంబేద్కర్ మాట.
అట్టడుగు వర్గాల పక్షపాతి. అద్భుత కవి నామదేవో ధసాల్. 'ధసాల్' తన కవిత్వంలో స్వంతఘోష, స్వంత భాష, పేద ప్రజల భాషగా తన గొంతును భీభత్స, రౌద్ర రస ప్రధానంగా ప్రస్పుటంగా వినిపిస్తాడు.
నేను ముంబాయిలో ఉన్న కాలంలో (2010 - 2011) కామాటిపురా ప్రాంతాలను చూసినప్పుడు వాటిని కవిత్వంలో - Photographic realism - గా కవిత్వీకారించిన ధసాల్ సామర్ధ్యానికి అచ్చెరువొందాను. అందుకే ఆ మహానుభావుడి కవిత్వాన్ని తెలుగు పాఠకులకు అందించే సాహసం చేస్తున్నాను.
- డాక్టర్ లంకా శివరామప్రసాద్
"కావాలని నేను కవిగా మారలేదు. మాటలు నేర్వగానే మాటలాట మొదలైంది" అన్నాడు నామదేవో ధసాల్. ఈ "దో నంబర్ కీ దునియాలో, ఈ అధో పాతాళపు ప్రపంచంలో, ఈ నరక కూపంలో, ఈ రెడ్ లైట్ ఏరియాలో, వళ్లూ, మనసూ అమ్ముకునే ఈ ప్రజల మధ్యనేను పుట్టాను. పెరిగాను. ఈ పీడిత తాడిత ప్రజల్లో నేనొకడిని. నా కవిత్వం ఇక్కడి జన జీవిత చిత్రణం." "దళిత పులుల ఉద్యమం మార్క్సిస్టు ఉద్యమం కాదు. అణగదొక్కబడిన ప్రతివాడూ దళితుడే అన్నది నా అభిప్రాయం. నా పయనంలో విషాదమేమిటంటే నాపై కమ్యూనిస్టు ముద్రవేసి, నా స్వంత పార్టీ నుంచే నన్ను వెళ్ళగొట్టారు. నేను ఇందిరాగాంధీని బలపరచినప్పుడూ అంతే! కాని ఆమె ఇస్తానన్న కానుకలను నేను అంగీకరించలేదు. నేను కోరుకున్నది ప్రజలను విముక్తం చేసే నిజమైన విప్లవం" "నాకు - మావో, ఫిడెల్ కాస్ట్రో, చేగువేరా, హొచిమిన్, మార్క్స్, లెనిన్ లంటే ఇష్టం. రామమనోహర్ లోహియా, ఆచార్య నరేంద్రదేవ్ అంటే అభిమానం. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే భక్తీ ప్రాణం" ఇవి 'నామదేవో ధసాల్' భావాలు. అతని మాటలు చురకత్తులు. అతని పదాలు అన్యాయాన్నేదిరించే అగ్నిపాదాలు. అతని బాట అంబేద్కర్ మాట. అట్టడుగు వర్గాల పక్షపాతి. అద్భుత కవి నామదేవో ధసాల్. 'ధసాల్' తన కవిత్వంలో స్వంతఘోష, స్వంత భాష, పేద ప్రజల భాషగా తన గొంతును భీభత్స, రౌద్ర రస ప్రధానంగా ప్రస్పుటంగా వినిపిస్తాడు. నేను ముంబాయిలో ఉన్న కాలంలో (2010 - 2011) కామాటిపురా ప్రాంతాలను చూసినప్పుడు వాటిని కవిత్వంలో - Photographic realism - గా కవిత్వీకారించిన ధసాల్ సామర్ధ్యానికి అచ్చెరువొందాను. అందుకే ఆ మహానుభావుడి కవిత్వాన్ని తెలుగు పాఠకులకు అందించే సాహసం చేస్తున్నాను. - డాక్టర్ లంకా శివరామప్రసాద్© 2017,www.logili.com All Rights Reserved.