అక్షయ తృతీయ
ఆ రోజు అక్షయ తృతీయ. ఆ రోజు చిన్నమెత్తు బంగారం కొన్నా ఎన్నో శుభాలు చేకూరుతాయనీ, ఏడాదంతా అలా బంగారం కొంటూనే ఉంటామని నమ్మి జనాలు బంగారం దుకాణాల్ని కిక్కిరిసి పోయేలా చేసే రోజు అది.
కొంగు బంగార్రాజు కొత్తగా బంగారు నగల దుకాణం ప్రారంభించిన తరువాత మొదటిసారి వచ్చిన అక్షయ తృతీయ ఆ రోజు. షోగ్గా ఉంటుందని తన దుకాణానికి ఇంగ్లీషులో తన పేరుతో 'కె బి ఆర్ జ్యూయలర్స్' అని పెట్టుకున్నాడు.
అక్షయతృతీయ నాడు అమ్మకాలు జోరుగా సాగాలంటే ఆ రోజు న్యూస్ పేపర్లలో పూర్తి పేజీ ప్రకటన యివ్వమని ఎవరో సలహా యివ్వడంతో - ఆ రోజు వచ్చే దిన పత్రికలు అన్నింటిలో మొదటి పేజీలో వచ్చేలా పూర్తి పేజీ ప్రకటన యిచ్చాడు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బంగార్రాజు,
ఉదయాన్నే ఆ పేపర్లు అన్నీ ముందేసుకుని పెద్ద పెద్ద అక్షరాల్లో వచ్చిన తన కెబి ఆర్ జ్యూయలర్స్ ప్రకటన చూసుకుని మురిసిపోతున్నాడు బంగార్రాజు. అలా ఆ పేపర్లు తిరగేస్తుంటే లోపలి పేజీలో ఎక్కడో ఒక చోట పావు పేజీ విస్తీర్ణంలో పైడిరాజు జ్యూయలర్స్' దుకాణం ప్రకటన కనిపించింది చిన్న అక్షరాల్లో.
తను షాపు పెట్టిన రెండు నెలల తరువాత తన షాపుకి ఎదురుగా రోడ్డుకి అవతల పైడిరాజు బంగారు నగల దుకాణం పెట్టేడు..
ఆ 'పైడిరాజు జ్యూయలర్స్' వ్యాపార ప్రకటనే బంగార్రాజు చూసింది.
డబ్బులు తక్కువ అవుతాయని పైడిరాజు అలా లోపలి పేజీలో పావు పేజీ ప్రకటన యిచ్చాడని తెలిసి నవ్వుకున్నాడు. అంత లోపలి పేజీలో వేయించుకున్న ప్రకటన ఎవరు చూస్తారు, ఎవరు వస్తారు... దుకాణానికి అని అనుకున్నాడు కూడా మనసులోనే......................
అక్షయ తృతీయ ఆ రోజు అక్షయ తృతీయ. ఆ రోజు చిన్నమెత్తు బంగారం కొన్నా ఎన్నో శుభాలు చేకూరుతాయనీ, ఏడాదంతా అలా బంగారం కొంటూనే ఉంటామని నమ్మి జనాలు బంగారం దుకాణాల్ని కిక్కిరిసి పోయేలా చేసే రోజు అది. కొంగు బంగార్రాజు కొత్తగా బంగారు నగల దుకాణం ప్రారంభించిన తరువాత మొదటిసారి వచ్చిన అక్షయ తృతీయ ఆ రోజు. షోగ్గా ఉంటుందని తన దుకాణానికి ఇంగ్లీషులో తన పేరుతో 'కె బి ఆర్ జ్యూయలర్స్' అని పెట్టుకున్నాడు. అక్షయతృతీయ నాడు అమ్మకాలు జోరుగా సాగాలంటే ఆ రోజు న్యూస్ పేపర్లలో పూర్తి పేజీ ప్రకటన యివ్వమని ఎవరో సలహా యివ్వడంతో - ఆ రోజు వచ్చే దిన పత్రికలు అన్నింటిలో మొదటి పేజీలో వచ్చేలా పూర్తి పేజీ ప్రకటన యిచ్చాడు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బంగార్రాజు, ఉదయాన్నే ఆ పేపర్లు అన్నీ ముందేసుకుని పెద్ద పెద్ద అక్షరాల్లో వచ్చిన తన కెబి ఆర్ జ్యూయలర్స్ ప్రకటన చూసుకుని మురిసిపోతున్నాడు బంగార్రాజు. అలా ఆ పేపర్లు తిరగేస్తుంటే లోపలి పేజీలో ఎక్కడో ఒక చోట పావు పేజీ విస్తీర్ణంలో పైడిరాజు జ్యూయలర్స్' దుకాణం ప్రకటన కనిపించింది చిన్న అక్షరాల్లో. తను షాపు పెట్టిన రెండు నెలల తరువాత తన షాపుకి ఎదురుగా రోడ్డుకి అవతల పైడిరాజు బంగారు నగల దుకాణం పెట్టేడు.. ఆ 'పైడిరాజు జ్యూయలర్స్' వ్యాపార ప్రకటనే బంగార్రాజు చూసింది. డబ్బులు తక్కువ అవుతాయని పైడిరాజు అలా లోపలి పేజీలో పావు పేజీ ప్రకటన యిచ్చాడని తెలిసి నవ్వుకున్నాడు. అంత లోపలి పేజీలో వేయించుకున్న ప్రకటన ఎవరు చూస్తారు, ఎవరు వస్తారు... దుకాణానికి అని అనుకున్నాడు కూడా మనసులోనే......................© 2017,www.logili.com All Rights Reserved.