- నోబుల్ పురస్కార గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ గారి సూక్తి కవితకు పురాణం సీతగారి అనుకరణ ఇది.
నేను సైతం కిళ్ళీ కొట్లో
పాతబాకీ లేగురగొట్టాను
నేను సైతం జనాభాలో
సంఖ్య నొక్కటి వృద్ధి చేశాను.
- నేను సైతం - శ్రీ శ్రీ కవిత్వానికి ప్యారడీ జల సూత్రం వారిచే
- వియోగి, ఏవిఎమ్
అనుకరణలో హాస్యం
ఎక్కడ సినిమాలు ఫ్రీయో
ఏ వీధిలో కాఫీ హోటళ్ళు, కిల్లీ కొట్లూ
తెల్లార్లు తెరిచి ఉంటాయో
ఏ కొట్లో ప్రతి వస్తువు అరువు దొరుకుతుందో
రెండు చేతులా అప్పు చేసినా మనుష్యులు ఎక్కడ
నిర్భయంగా తలెత్తుకొని తిరగ గలుగుతారో
ఎక్కడ చదువుకోకుండా తెలివి తక్కువ వాళ్ళకు
పెద్ద పెద్ద ఉద్యోగాలు లభిస్తాయో
ఎక్కడ పంపు వుండి కరెంటు ఖర్చులేకుండా
అడ్వాన్స్ వినా అద్దె తక్కువకి దొరుకుతాయో ఇళ్ళు
ఆ ఊరికి - భగవాన్ - ఇప్పుడే ఈ క్షణమే
మా వార్ని ట్రాన్స్ ఫర్ చెయ్యి