అధ్యాయం - 1
గోపాదయతి తన కూతురికి తెలిపి నదివైపు బయలుదేరారు. ఆశ్రమంలో ఒకపూట పని ముగిసినందువల్ల గోణికా కూడ బిడువు చేసుకొని ఆశ్రమానికి కొద్ది దూరంలోనే వున్న ఒక చిన్న గుట్టవైపు బయలుదేరినది. ఇది ఆమెకు అత్యంత ప్రియమైన ప్రదేశమై వుండేది. ప్రతిరోజు సూర్యుడు అస్తమించే సమయం సమీపించినంతనే ఆమె అచటికి వచ్చి ఆ చిన్న గుట్టను ఎక్కి సూర్యాస్తమయాన్నేకాక తన చుట్టూ ప్రకృతి నిర్మించిన రకరకాల విశిష్టతలను చూచి ఆనందించి, గోపాదయతి ఆశ్రమానికి వెనుదిరిగ డానికి ముందే, తాను ఆశ్రమం చేరుకొనేది. ఆరోజు కూడ గోణికా తనను ఆకర్షించిన ఆ గుట్ట వద్దకు బయలుదేరినది.
గుట్టునెక్కి దిగడం వైపు చూస్తున్న గోణికా, 'ఎలాంటి సుందరమైన సాయంత్రం!' అని తలచి గొంతెత్తి పైకి చూచినది. నీలిరంగు చిత్రపటంవలెనున్న ఆకాశంలోని అనన్యమైన చిత్రాన్ని చూచి మూక విస్మితురాలైనది. ఇదేమీ ఆమెకు క్రొత్తకాదు. అయినా, ఆ రోజెందుకో ఆమె ఆ భవ్యమైన దృశ్యాలను తన కన్నులలో నింపుకొన్నంతా ఏదో ఒక దివ్యాకృతి భూమికి దిగివచ్చి తనను తబ్బుకొన్న భావం ఆమె హృదయంలో కలుగసాగినది. చెట్లలోని తమ నెలవులకు వెనుదిరుగుతున్న పక్షులు చేస్తున్న శబ్దాలను వింటూ, వింటూ, ఆ శబ్దాలకు తన ధ్వనిని చేర్చి తల అల్లాడించినది. ఆహా! ఎంత బాగున్నది! ఆమె నిరీక్షిస్తున్న నెమలి యింకా రాలేదు. అదుగో, ఆ నెమలి వచ్చేసినది! ఓ హెూ ఎక్కడుండేది ఈ మగ మయూరం? ప్రియురాలు కూసిన కేక విని వెంటనే వచ్చాడు! సుందరమైన ఆ జంట మనసును దోచుకొనే వాటి నృత్యం! గోణికా శరీరమంతా పులకరించినది. హరోన్మాదంతో రోమాంచనమైనది. మయూర లాస్యంతో ప్రచోదితురాలై లేచి నిలబడి నృత్యం చేయసాగినది. గోణికా. దీని మధ్యలో ఎదో ఒక రాగంలో పాడసాగినది.
సాయం సూర్యుని వర్ణరంజితమైన కిరణాలు ఆమెను తాకి, తాకి మెచ్చుకొని, మెచ్చి చుంబించడానికి వచ్చి ఆమెను ఆవరించినపుడు, మందమారుతం దూరంలోవున్న..................
అధ్యాయం - 1 గోపాదయతి తన కూతురికి తెలిపి నదివైపు బయలుదేరారు. ఆశ్రమంలో ఒకపూట పని ముగిసినందువల్ల గోణికా కూడ బిడువు చేసుకొని ఆశ్రమానికి కొద్ది దూరంలోనే వున్న ఒక చిన్న గుట్టవైపు బయలుదేరినది. ఇది ఆమెకు అత్యంత ప్రియమైన ప్రదేశమై వుండేది. ప్రతిరోజు సూర్యుడు అస్తమించే సమయం సమీపించినంతనే ఆమె అచటికి వచ్చి ఆ చిన్న గుట్టను ఎక్కి సూర్యాస్తమయాన్నేకాక తన చుట్టూ ప్రకృతి నిర్మించిన రకరకాల విశిష్టతలను చూచి ఆనందించి, గోపాదయతి ఆశ్రమానికి వెనుదిరిగ డానికి ముందే, తాను ఆశ్రమం చేరుకొనేది. ఆరోజు కూడ గోణికా తనను ఆకర్షించిన ఆ గుట్ట వద్దకు బయలుదేరినది. గుట్టునెక్కి దిగడం వైపు చూస్తున్న గోణికా, 'ఎలాంటి సుందరమైన సాయంత్రం!' అని తలచి గొంతెత్తి పైకి చూచినది. నీలిరంగు చిత్రపటంవలెనున్న ఆకాశంలోని అనన్యమైన చిత్రాన్ని చూచి మూక విస్మితురాలైనది. ఇదేమీ ఆమెకు క్రొత్తకాదు. అయినా, ఆ రోజెందుకో ఆమె ఆ భవ్యమైన దృశ్యాలను తన కన్నులలో నింపుకొన్నంతా ఏదో ఒక దివ్యాకృతి భూమికి దిగివచ్చి తనను తబ్బుకొన్న భావం ఆమె హృదయంలో కలుగసాగినది. చెట్లలోని తమ నెలవులకు వెనుదిరుగుతున్న పక్షులు చేస్తున్న శబ్దాలను వింటూ, వింటూ, ఆ శబ్దాలకు తన ధ్వనిని చేర్చి తల అల్లాడించినది. ఆహా! ఎంత బాగున్నది! ఆమె నిరీక్షిస్తున్న నెమలి యింకా రాలేదు. అదుగో, ఆ నెమలి వచ్చేసినది! ఓ హెూ ఎక్కడుండేది ఈ మగ మయూరం? ప్రియురాలు కూసిన కేక విని వెంటనే వచ్చాడు! సుందరమైన ఆ జంట మనసును దోచుకొనే వాటి నృత్యం! గోణికా శరీరమంతా పులకరించినది. హరోన్మాదంతో రోమాంచనమైనది. మయూర లాస్యంతో ప్రచోదితురాలై లేచి నిలబడి నృత్యం చేయసాగినది. గోణికా. దీని మధ్యలో ఎదో ఒక రాగంలో పాడసాగినది. సాయం సూర్యుని వర్ణరంజితమైన కిరణాలు ఆమెను తాకి, తాకి మెచ్చుకొని, మెచ్చి చుంబించడానికి వచ్చి ఆమెను ఆవరించినపుడు, మందమారుతం దూరంలోవున్న..................© 2017,www.logili.com All Rights Reserved.