మంచి కమ్యూనిస్టు ఎలా ఉండాలి ?
ఎందువలన కమ్యూనిస్టులు తప్పనిసరిగా స్వయం సాధనకు పూనుకోవలసి ఉంది? బ్రతుకుబండి సాగాలంటే మానవుడు తప్పనిసరిగా ప్రకృతిపై పోరాటాన్ని సాగించాలి. భౌతిక విలువల ఉత్పత్తి కోసం ప్రకృతిని ఉపయోగించుకోవాలి. ఏ సామాజికాభివృద్ధి దశలోనైనప్పటికీ ఉత్పత్తి ప్రక్రియలోకి మానవులు అడుగు పెట్టినప్పుడు విధిగా వారు తమ మధ్య నిర్దిష్టమైన సంబంధాలను కలిగివుంటారు. ప్రకృతిపై తాము సాగించే అవిశ్రాంత పోరాటంలో మానవులు ప్రకృతిని నిరంతరం మారుస్తూ ఉంటారు. అదే సమయంలో తాము కూడా మారుతూ తమ మధ్య ఉన్న పరస్పర సంబంధాలను సైతం మార్చివేస్తారు. సామాజికులుగా ప్రకృతిపై సాగించే సుదీర్ఘ పోరాటంలో మానవులు మారటమేగాక, వారి సామాజిక సంబంధాలు, వారి సామాజిక వ్యవస్థల రూపాలు, వారి చైతన్యమూ నిరంతర మార్పులకు, అభివృద్ధికి గురవుతుంటాయి. ఆదిమకాలంలోని మానవుని జీవిత విధానమూ, సామాజిక వ్యవస్థ, చైతన్యమూ ఇవన్నీ ఇప్పటి స్థితికి పూర్తిగా భిన్నమైనవి. భవిష్యత్లో మరో రకంగా ఉంటాయి.
మానవజాతి, మానవ సమాజము అనేవి చారిత్రక అభివృద్ధి క్రమంలో భాగం. మానవ సమాజం నిర్దిష్టమైన చారిత్రక దశకు చేరినప్పుడు వర్గాలు, వర్గపోరాటాలు పుట్టుకు వచ్చాయి. వర్గ సమాజంలోని ప్రతి వ్యక్తీ తన వర్గంలో సభ్యుడిగా ఉంటూ వర్గపోరాటం వల్ల నెలకొనే పరిస్థితులలో జీవిస్తూ ఉంటాడు. మానవుని సామాజిక స్థితి అతని చైతన్యాన్ని నిర్ణయిస్తుంది. వర్గ సమాజంలో ఆయా వర్గాలవారి ఆలోచనలు విభిన్నమైన వర్గ స్థానాన్ని, విభిన్నమైన వాటి స్థానాలు, ప్రయోజనాలు, సిద్ధాంతాల మధ్య ఎడతెగని వర్గపోరాటం సాగుతూ ఉంటుంది. ప్రకృతిపై జరిగే పోరాటంలోనేగాక మంచి కమ్యూనిస్టు ఎలా ఉండాలి..................
మంచి కమ్యూనిస్టు ఎలా ఉండాలి ? ఎందువలన కమ్యూనిస్టులు తప్పనిసరిగా స్వయం సాధనకు పూనుకోవలసి ఉంది? బ్రతుకుబండి సాగాలంటే మానవుడు తప్పనిసరిగా ప్రకృతిపై పోరాటాన్ని సాగించాలి. భౌతిక విలువల ఉత్పత్తి కోసం ప్రకృతిని ఉపయోగించుకోవాలి. ఏ సామాజికాభివృద్ధి దశలోనైనప్పటికీ ఉత్పత్తి ప్రక్రియలోకి మానవులు అడుగు పెట్టినప్పుడు విధిగా వారు తమ మధ్య నిర్దిష్టమైన సంబంధాలను కలిగివుంటారు. ప్రకృతిపై తాము సాగించే అవిశ్రాంత పోరాటంలో మానవులు ప్రకృతిని నిరంతరం మారుస్తూ ఉంటారు. అదే సమయంలో తాము కూడా మారుతూ తమ మధ్య ఉన్న పరస్పర సంబంధాలను సైతం మార్చివేస్తారు. సామాజికులుగా ప్రకృతిపై సాగించే సుదీర్ఘ పోరాటంలో మానవులు మారటమేగాక, వారి సామాజిక సంబంధాలు, వారి సామాజిక వ్యవస్థల రూపాలు, వారి చైతన్యమూ నిరంతర మార్పులకు, అభివృద్ధికి గురవుతుంటాయి. ఆదిమకాలంలోని మానవుని జీవిత విధానమూ, సామాజిక వ్యవస్థ, చైతన్యమూ ఇవన్నీ ఇప్పటి స్థితికి పూర్తిగా భిన్నమైనవి. భవిష్యత్లో మరో రకంగా ఉంటాయి. మానవజాతి, మానవ సమాజము అనేవి చారిత్రక అభివృద్ధి క్రమంలో భాగం. మానవ సమాజం నిర్దిష్టమైన చారిత్రక దశకు చేరినప్పుడు వర్గాలు, వర్గపోరాటాలు పుట్టుకు వచ్చాయి. వర్గ సమాజంలోని ప్రతి వ్యక్తీ తన వర్గంలో సభ్యుడిగా ఉంటూ వర్గపోరాటం వల్ల నెలకొనే పరిస్థితులలో జీవిస్తూ ఉంటాడు. మానవుని సామాజిక స్థితి అతని చైతన్యాన్ని నిర్ణయిస్తుంది. వర్గ సమాజంలో ఆయా వర్గాలవారి ఆలోచనలు విభిన్నమైన వర్గ స్థానాన్ని, విభిన్నమైన వాటి స్థానాలు, ప్రయోజనాలు, సిద్ధాంతాల మధ్య ఎడతెగని వర్గపోరాటం సాగుతూ ఉంటుంది. ప్రకృతిపై జరిగే పోరాటంలోనేగాక మంచి కమ్యూనిస్టు ఎలా ఉండాలి..................© 2017,www.logili.com All Rights Reserved.