జీసస్ నుంచి బుద్ధుని వరకూ...
మహా మానవతావాది, సంస్కర్త గౌతమ బుద్ధుడు మరణించిన తరువాత ఆయన బోధించిన 'ధర్మం' ఎన్నో శాఖలుగా, ఉపశాఖలుగా చీలిపోయి ప్రపంచ దేశాలను ప్రభావితం చేసింది. బౌద్ధం తొలిరోజుల్లో నాటి సమాజానికి అవసరమైన ధర్మం, బుద్ధుని మరణం తరువాత ఆయన శిష్యులు, క్రమంగా ఒక 'మతం'గా మార్చివేశారు. బౌద్ధంలోని మానవతా విలువలను మన దేశంలోని హిందూమతం కూడా స్వీకరించక తప్పలేదు. చివరకు దశావతారాల్లో బుద్ధుడిని కూడా చేర్చింది. అది వేరే విషయం. ప్రత్యేకంగా విదేశాకు చెందిన క్రైస్తవమతం, కమ్యూనిజంలను కూడా బౌద్ధం ప్రభావితం చేయడం విశేషం.
ఆధునిక ప్రపంచంలో బౌద్ధం తిరిగి జీవించడానికి విదేశీ మేధావుల పరిశోధనలు, అధ్యయనాలే కారణం. ఆర్నాల్డ్ సర్ ఎడ్విన్ (1832-1904) అనే బ్రిటిష్ జాతీయుడు 1879లో రచించిన 'LIGHT OF ASIA' (ఆసియాజ్యోతి) అనే గ్రంథం ప్రపంచ సాహిత్యాన్నే కుదిపివేసింది. దాదాపు భారతీయ భాషలన్నీ ఈ గ్రంథం వల్ల ప్రభావితమయ్యాయి. ఇంగ్లండ్లో పుట్టిన ఆర్నాల్డ్, ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీలో చదివి సంస్కృతం, టర్కీ భాషల్లో పాండిత్యం సంపాదించారు. తన 25వ ఏట పూనాలోని దక్కన్ కళాశాలకు ప్రధాన అధ్యాపకునిగా వచ్చి, ఇండియాలోని బౌద్ధ క్షేత్రాలను సందర్శించి, వాటి చరిత్రను అధ్యయనం చేశారు. 1885లో 'బోధిగయ'కు విరాళాలు సేకరించి, పునరుద్ధరించారు. ఆర్నాల్డ్ రచించిన గ్రంథం చదివి, శ్రీలంక, బర్మా వెళ్లి 1902లో బౌద్ధ భిక్షువుగా మారిన మరో విదేశీయుడు చార్లెస్ హెన్రీ ఆలెనెట్. భిక్షువైన తరువాత ఇతడు తన పేరును 'ఆనంద మైత్రేయ'గా (1872-1922) మార్చుకున్నాడు. 1903లో రంగూన్లో 'బుద్ధశాసనసమాగమ' పేరుతో ఒక సంస్థను స్థాపించి, ఇంగ్లండ్లో ఒక శాఖను ప్రారంభించాడు. శ్రీలంకలోని క్రైస్తవ కుటుంబంలో జన్మించిన దావిద్ హేపవితరణ కూడా ఆసియా దేశాల్లో బౌద్ధ ప్రచారానికి ఎంతో కృషిచేశాడు. 1891లో మహాబోధి సొసైటీని స్థాపించి, 1925లో లండన్లోనూ బ్రిటిస్ మహాబోధి సొసైటీని స్థాపించాడు. తన పేరును 1931లో దేవమిత్ర ధర్మపాలగా మార్చుకుని భిక్షువుగా మారిపోయాడు. ఇంగ్లండ్లో బౌద్ధవ్యాప్తికి ఎంతో కృషిచేసిన ఒక హైకోర్టు న్యాయమూర్తి ట్రావెల్స్ క్రిస్టమస్ (1901-83). ఇతడు 18-19 ఏళ్లకే బౌద్ధ దీక్ష స్వీకరించి హైకోర్టు న్యాయమూర్తి అయ్యారు. బుద్ధిస్ట్ బాజ్ అనే సంస్థ స్థాపించి, 'బుద్ధిజమ్' అనే గొప్ప గ్రంథాన్ని రచించారు.
క్రైస్తవ కుటుంబాలకు చెందిన ఎందరో మేధావులు, బౌద్ధులుగా మారినట్టుగానే ఆస్ట్రేలియాకు చెందిన 'వెనరబుల్ శ్రావస్తి దమ్మిక' కూడా మారి ఆసియా, ఆస్ట్రేలియా ఖండాల్లో ధర్మబోధ చేస్తున్నారు. 1951లో మెల్బోర్న్ జన్మించిన ఆయన, 18 ఏటనే బౌద్ధునిగా మారిపోయారు. ఒక గ్రంథం అతని జీవితాన్ని మార్చివేసింది................
జీసస్ నుంచి బుద్ధుని వరకూ... మహా మానవతావాది, సంస్కర్త గౌతమ బుద్ధుడు మరణించిన తరువాత ఆయన బోధించిన 'ధర్మం' ఎన్నో శాఖలుగా, ఉపశాఖలుగా చీలిపోయి ప్రపంచ దేశాలను ప్రభావితం చేసింది. బౌద్ధం తొలిరోజుల్లో నాటి సమాజానికి అవసరమైన ధర్మం, బుద్ధుని మరణం తరువాత ఆయన శిష్యులు, క్రమంగా ఒక 'మతం'గా మార్చివేశారు. బౌద్ధంలోని మానవతా విలువలను మన దేశంలోని హిందూమతం కూడా స్వీకరించక తప్పలేదు. చివరకు దశావతారాల్లో బుద్ధుడిని కూడా చేర్చింది. అది వేరే విషయం. ప్రత్యేకంగా విదేశాకు చెందిన క్రైస్తవమతం, కమ్యూనిజంలను కూడా బౌద్ధం ప్రభావితం చేయడం విశేషం. ఆధునిక ప్రపంచంలో బౌద్ధం తిరిగి జీవించడానికి విదేశీ మేధావుల పరిశోధనలు, అధ్యయనాలే కారణం. ఆర్నాల్డ్ సర్ ఎడ్విన్ (1832-1904) అనే బ్రిటిష్ జాతీయుడు 1879లో రచించిన 'LIGHT OF ASIA' (ఆసియాజ్యోతి) అనే గ్రంథం ప్రపంచ సాహిత్యాన్నే కుదిపివేసింది. దాదాపు భారతీయ భాషలన్నీ ఈ గ్రంథం వల్ల ప్రభావితమయ్యాయి. ఇంగ్లండ్లో పుట్టిన ఆర్నాల్డ్, ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీలో చదివి సంస్కృతం, టర్కీ భాషల్లో పాండిత్యం సంపాదించారు. తన 25వ ఏట పూనాలోని దక్కన్ కళాశాలకు ప్రధాన అధ్యాపకునిగా వచ్చి, ఇండియాలోని బౌద్ధ క్షేత్రాలను సందర్శించి, వాటి చరిత్రను అధ్యయనం చేశారు. 1885లో 'బోధిగయ'కు విరాళాలు సేకరించి, పునరుద్ధరించారు. ఆర్నాల్డ్ రచించిన గ్రంథం చదివి, శ్రీలంక, బర్మా వెళ్లి 1902లో బౌద్ధ భిక్షువుగా మారిన మరో విదేశీయుడు చార్లెస్ హెన్రీ ఆలెనెట్. భిక్షువైన తరువాత ఇతడు తన పేరును 'ఆనంద మైత్రేయ'గా (1872-1922) మార్చుకున్నాడు. 1903లో రంగూన్లో 'బుద్ధశాసనసమాగమ' పేరుతో ఒక సంస్థను స్థాపించి, ఇంగ్లండ్లో ఒక శాఖను ప్రారంభించాడు. శ్రీలంకలోని క్రైస్తవ కుటుంబంలో జన్మించిన దావిద్ హేపవితరణ కూడా ఆసియా దేశాల్లో బౌద్ధ ప్రచారానికి ఎంతో కృషిచేశాడు. 1891లో మహాబోధి సొసైటీని స్థాపించి, 1925లో లండన్లోనూ బ్రిటిస్ మహాబోధి సొసైటీని స్థాపించాడు. తన పేరును 1931లో దేవమిత్ర ధర్మపాలగా మార్చుకుని భిక్షువుగా మారిపోయాడు. ఇంగ్లండ్లో బౌద్ధవ్యాప్తికి ఎంతో కృషిచేసిన ఒక హైకోర్టు న్యాయమూర్తి ట్రావెల్స్ క్రిస్టమస్ (1901-83). ఇతడు 18-19 ఏళ్లకే బౌద్ధ దీక్ష స్వీకరించి హైకోర్టు న్యాయమూర్తి అయ్యారు. బుద్ధిస్ట్ బాజ్ అనే సంస్థ స్థాపించి, 'బుద్ధిజమ్' అనే గొప్ప గ్రంథాన్ని రచించారు. క్రైస్తవ కుటుంబాలకు చెందిన ఎందరో మేధావులు, బౌద్ధులుగా మారినట్టుగానే ఆస్ట్రేలియాకు చెందిన 'వెనరబుల్ శ్రావస్తి దమ్మిక' కూడా మారి ఆసియా, ఆస్ట్రేలియా ఖండాల్లో ధర్మబోధ చేస్తున్నారు. 1951లో మెల్బోర్న్ జన్మించిన ఆయన, 18 ఏటనే బౌద్ధునిగా మారిపోయారు. ఒక గ్రంథం అతని జీవితాన్ని మార్చివేసింది................© 2017,www.logili.com All Rights Reserved.