"మాతృశ్రీ జీవిత మహోదధిలో తరంగాలు
అవతరణ
1923 మార్చి 28వ తేదీ..........
రుధిరోద్గారీ, చైత్రశుద్ధ ఏకాదశీ, బుధవారం, అరుణోదయ కాలం- చెన్నకేశవస్వామి ఆలయంలో జేగంటలు మ్రోగుతున్నాయి. పక్షులు ప్రపంచానికి మేలుకొలుపులు పాడుతున్నాయి. జగతి చీకటి ముసుగు కప్పుకొని కాంతులు ప్రసవించడానికి నొప్పులు పడుతున్నది. మందమలయానిలాలు ఉపచారం సల్పుతున్నాయి. దేవాలయం నుండి బయలుదేరిన మంగళవాద్యాలు లోకానికి శుభ సందేశమిస్తున్నాయి.
ఆ సమయంలో మన్నవలో ఒక సామాన్య గృహాన ఒక సాధారణమైన ఆడపిల్లయై అమ్మ ఆవిర్భవించింది.
అమ్మ పుట్టినపుడు కాళ్ళూ చేతులూ మెలిక వేసుకొని ఉన్నది. తెల్లగా, తెలుపులో గోధుమరంగుగా ఉన్నది. ఏ మాత్రమూ కదలిక లేదు. ప్రాణము వున్నదా, లేదా అని అనుమానం కలిగి పురుడు పోయటానికి వచ్చిన మంత్రసానులలో ఒకతె అయిన 'పిచ్చికోటి' అమ్మను కదిలించి చూచి - 'ఈ పిల్ల కూడా పోయిందేమో....... ఈ రంగమ్మతల్లి దురదృష్ట వంతురాలు. ఈ సంవత్సరంలో నలుగురు పిల్లలను పాతర పెట్టింది.'
- అని తనలో అనుకుంటూ ఉండగానే కళ్ళుమూసుకుని పడుకున్న అమ్మమ్మ చివాలున లేచి కూర్చుని కళ్ళు తెరచి అమ్మవంక చూచింది. తాను పడుతున్న..............
"మాతృశ్రీ జీవిత మహోదధిలో తరంగాలుఅవతరణ 1923 మార్చి 28వ తేదీ.......... రుధిరోద్గారీ, చైత్రశుద్ధ ఏకాదశీ, బుధవారం, అరుణోదయ కాలం- చెన్నకేశవస్వామి ఆలయంలో జేగంటలు మ్రోగుతున్నాయి. పక్షులు ప్రపంచానికి మేలుకొలుపులు పాడుతున్నాయి. జగతి చీకటి ముసుగు కప్పుకొని కాంతులు ప్రసవించడానికి నొప్పులు పడుతున్నది. మందమలయానిలాలు ఉపచారం సల్పుతున్నాయి. దేవాలయం నుండి బయలుదేరిన మంగళవాద్యాలు లోకానికి శుభ సందేశమిస్తున్నాయి. ఆ సమయంలో మన్నవలో ఒక సామాన్య గృహాన ఒక సాధారణమైన ఆడపిల్లయై అమ్మ ఆవిర్భవించింది. అమ్మ పుట్టినపుడు కాళ్ళూ చేతులూ మెలిక వేసుకొని ఉన్నది. తెల్లగా, తెలుపులో గోధుమరంగుగా ఉన్నది. ఏ మాత్రమూ కదలిక లేదు. ప్రాణము వున్నదా, లేదా అని అనుమానం కలిగి పురుడు పోయటానికి వచ్చిన మంత్రసానులలో ఒకతె అయిన 'పిచ్చికోటి' అమ్మను కదిలించి చూచి - 'ఈ పిల్ల కూడా పోయిందేమో....... ఈ రంగమ్మతల్లి దురదృష్ట వంతురాలు. ఈ సంవత్సరంలో నలుగురు పిల్లలను పాతర పెట్టింది.' - అని తనలో అనుకుంటూ ఉండగానే కళ్ళుమూసుకుని పడుకున్న అమ్మమ్మ చివాలున లేచి కూర్చుని కళ్ళు తెరచి అమ్మవంక చూచింది. తాను పడుతున్న..............© 2017,www.logili.com All Rights Reserved.