'చైతన్య తరంగాలు' గూర్చి విద్యావేత్తల సమీక్ష
సాంకేతికను ఆయుధంగా చేసుకుని స్వయంకృషి, నిరంతర సాధనతో, అత్యున్నత స్థాయికి ఎదిగిన యువ వ్యాపారవేత్తల జీవిత గాథలే ఈ “చైతన్యతరంగాలు”. ప్రోత్సాహం, ఉత్సాహం, నూతన శక్తితో పాటూ మనస్సుకు నిర్మల నిశ్చల ఆహ్లాదతను అందిస్తుంది పుస్తకం. పదే పదే అపజయాలను ఎదుర్కొని నైరాశ్యం, నిసృహ, నిస్సత్తువ ఆక్రమించిన వారికి ఈ పుస్తకం ఎంతో ఊరటనిస్తుంది. సాధారణ మనుషులైన వీరందరి జీవిత ప్రయాణాలు తెలుసుకున్నాకా "నేనెందుకు సాధించలేను”? వంటి ప్రశ్నలు, ఆలోచనలు, భావాలు, పాఠకుల మస్తిష్కాన్ని క్రమ్మేస్తాయి. అంకురసంస్థల ఆశావహులకు, యువతకు ఈ పుస్తకం మార్గదర్శిగా ఉండి మళ్ళీ మళ్ళీ చదివిస్తుంది.
అదే కోవలో, సునీల్ ధవళ గారు రచించిన, సూపర్ 30 విజనరీస్ పుస్తకం నా దృష్టిలో ప్రస్తుత తెలుగు కాల్పనికేతర సాహిత్యరంగంలో ఒక అనర్హరత్నం లాంటిది. ముందటి తరంలోని భారతీయ వ్యాపార వాణిజ్య రంగాల్లో అత్యున్నత స్థాయికి ఎదిగిన, ప్రభావశీలురైన 30 మంది దార్శనికుల జీవితాలను అతి సరళంగా, అత్యంత స్ఫూర్తి దాయకంగా వర్ణించారు సూపర్ 30 విజనరీస్ పుస్తకంలో. అతి గొప్ప విషయం ఏమిటంటే ఆయన చాలా తేలిక మాటలలో ఈ ముప్పై దార్శనికుల తపననీ, వారి పట్టుదలనీ, వారి దేశభక్తినీ, వారి నిబద్ధతను మనసుకు హత్తుకునేలా కేవలం 1500 పదాలు ఉపయోగించి రాయగలగడం అరుదైన నైపుణ్యం, అత్యంత గొప్ప విషయం. అంతేకాదు, ఆయన ఎన్నుకున్న వ్యక్తులందరూ అతి గొప్ప మానవతా మూర్తులు. నా దృష్టిలో సునీల్ ధవళ రచనలన్నీ జీవితాన్ని సమూలంగా మార్చగలగిన శక్తి కలిగినవి. విద్యార్థులు, యువత, వనితలు, వ్యాపారస్తులు, వర్ధమాన వ్యవస్థాపకులు, విశ్రాంత ఉద్యోగులు విధిగా చదవాల్సిన పుస్తకాలు ఇవి. దేశ యువతరానికి దిశానిర్దేశం చేయగలిగిన ఇలాంటి పుస్తకాలు రచించిన సునీల్ ధవళ గారిని మనసారా అభినందిస్తున్నాను. సునీల్ ధవళ నుండి ఇలాంటి మరిన్ని స్ఫూర్తిదాయకమైన రచనలు వెలువడాలని ఆశిస్తున్నాను.
- ప్రొ॥పి.ఆర్. భానుమూర్తి, డైరెక్టర్, ఫాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం సెల్, జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జెఎన్టియు), అనంతపురం.............
'చైతన్య తరంగాలు' గూర్చి విద్యావేత్తల సమీక్ష సాంకేతికను ఆయుధంగా చేసుకుని స్వయంకృషి, నిరంతర సాధనతో, అత్యున్నత స్థాయికి ఎదిగిన యువ వ్యాపారవేత్తల జీవిత గాథలే ఈ “చైతన్యతరంగాలు”. ప్రోత్సాహం, ఉత్సాహం, నూతన శక్తితో పాటూ మనస్సుకు నిర్మల నిశ్చల ఆహ్లాదతను అందిస్తుంది పుస్తకం. పదే పదే అపజయాలను ఎదుర్కొని నైరాశ్యం, నిసృహ, నిస్సత్తువ ఆక్రమించిన వారికి ఈ పుస్తకం ఎంతో ఊరటనిస్తుంది. సాధారణ మనుషులైన వీరందరి జీవిత ప్రయాణాలు తెలుసుకున్నాకా "నేనెందుకు సాధించలేను”? వంటి ప్రశ్నలు, ఆలోచనలు, భావాలు, పాఠకుల మస్తిష్కాన్ని క్రమ్మేస్తాయి. అంకురసంస్థల ఆశావహులకు, యువతకు ఈ పుస్తకం మార్గదర్శిగా ఉండి మళ్ళీ మళ్ళీ చదివిస్తుంది. అదే కోవలో, సునీల్ ధవళ గారు రచించిన, సూపర్ 30 విజనరీస్ పుస్తకం నా దృష్టిలో ప్రస్తుత తెలుగు కాల్పనికేతర సాహిత్యరంగంలో ఒక అనర్హరత్నం లాంటిది. ముందటి తరంలోని భారతీయ వ్యాపార వాణిజ్య రంగాల్లో అత్యున్నత స్థాయికి ఎదిగిన, ప్రభావశీలురైన 30 మంది దార్శనికుల జీవితాలను అతి సరళంగా, అత్యంత స్ఫూర్తి దాయకంగా వర్ణించారు సూపర్ 30 విజనరీస్ పుస్తకంలో. అతి గొప్ప విషయం ఏమిటంటే ఆయన చాలా తేలిక మాటలలో ఈ ముప్పై దార్శనికుల తపననీ, వారి పట్టుదలనీ, వారి దేశభక్తినీ, వారి నిబద్ధతను మనసుకు హత్తుకునేలా కేవలం 1500 పదాలు ఉపయోగించి రాయగలగడం అరుదైన నైపుణ్యం, అత్యంత గొప్ప విషయం. అంతేకాదు, ఆయన ఎన్నుకున్న వ్యక్తులందరూ అతి గొప్ప మానవతా మూర్తులు. నా దృష్టిలో సునీల్ ధవళ రచనలన్నీ జీవితాన్ని సమూలంగా మార్చగలగిన శక్తి కలిగినవి. విద్యార్థులు, యువత, వనితలు, వ్యాపారస్తులు, వర్ధమాన వ్యవస్థాపకులు, విశ్రాంత ఉద్యోగులు విధిగా చదవాల్సిన పుస్తకాలు ఇవి. దేశ యువతరానికి దిశానిర్దేశం చేయగలిగిన ఇలాంటి పుస్తకాలు రచించిన సునీల్ ధవళ గారిని మనసారా అభినందిస్తున్నాను. సునీల్ ధవళ నుండి ఇలాంటి మరిన్ని స్ఫూర్తిదాయకమైన రచనలు వెలువడాలని ఆశిస్తున్నాను. - ప్రొ॥పి.ఆర్. భానుమూర్తి, డైరెక్టర్, ఫాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం సెల్, జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జెఎన్టియు), అనంతపురం.............© 2017,www.logili.com All Rights Reserved.