దేశ విదేశ సాహిత్యాలని ఆపోసన పట్టిన వాళ్ళలో పార్థసారథిగారు ఒకరు నాకు తెలిసినంతవరకు. అయితే పార్థసారథిగారిలో విలక్షణత ఏమిటంటే తనకున్న విజ్ఞానం పట్ల అతిశయం లేకపోవడం. ఏమీ తెలియనట్లే ఉండటం. జ్ఞానం అహంకారంగా మారకపోవడం. బాధలు పడుతున్న వాళ్లపట్ల గొప్ప ప్రేమ. మధ్యతరగతి, ధనిక వర్గపు మిధ్యావిలువల పట్ల క్రోధాన్ని, అసహనాన్ని ప్రదర్శించటం. అయితే రచయితగా కథల్లో దూరి మాట్లాడకుండానే పాత్రలు వ్యవహరించే తీరు అత్యంత సహజంగా ఉంటూనే వెనకాల ఒక వ్యంగ్య నేపథ్యంలోంచి ఇవన్నీ వినిపిస్తూ ఉంటాయి. చాలా చోట్ల ఇంత చిన్న విషయాలను ఇంత చక్కగా ఎట్లా పట్టుకున్నారు అని ఆశ్చర్యమేస్తుంది.
ముఖ్యంగా స్త్రీ పురుష సంబంధాలు. మగవాడు చాలా బాధలు పడుతున్నట్టు సింపతిటిక్ గా మాట్లాడుతున్నా మనకు రచయిత చెప్పకుండానే వాడి నీచత్వమూ, స్త్రీ మౌనం లోంచే ఆవిడ తాలూకు గొప్పతనమూ ఇట్టే స్ఫురిస్తుంది. దీన్ని ఒక టెక్నిక్ గా సాధించడం చాలా అసాధ్యం అని నాకు అనిపిస్తుంది. బహుశా గుండెకు తాడుకట్టి కచ్చారోడ్లమీద బట్టబయల్లో గాలికీ, దూలికీ తిప్పే వాళ్ళకే ఇది సాధ్యమవుతుంది. తమ సొంత అభిప్రాయాల్లోకి, ఆలోచనల్లోకి మూసుకుపోయి సత్యం పట్ల, వాస్తవం పట్ల తెరచుకోకుండా ఉండడం గొప్ప సాహిత్యలక్షణం కాదేమో. ఆయుష్షు తరగకుండా ఉండటానికి గుండెను ఉరపంజరంలో మందపాటి చర్మం కింద జాగ్రత్తగా కాపాడుకునే వాళ్లకు ఇది సాధ్యం కాదు.
- రమణ జీవి
దేశ విదేశ సాహిత్యాలని ఆపోసన పట్టిన వాళ్ళలో పార్థసారథిగారు ఒకరు నాకు తెలిసినంతవరకు. అయితే పార్థసారథిగారిలో విలక్షణత ఏమిటంటే తనకున్న విజ్ఞానం పట్ల అతిశయం లేకపోవడం. ఏమీ తెలియనట్లే ఉండటం. జ్ఞానం అహంకారంగా మారకపోవడం. బాధలు పడుతున్న వాళ్లపట్ల గొప్ప ప్రేమ. మధ్యతరగతి, ధనిక వర్గపు మిధ్యావిలువల పట్ల క్రోధాన్ని, అసహనాన్ని ప్రదర్శించటం. అయితే రచయితగా కథల్లో దూరి మాట్లాడకుండానే పాత్రలు వ్యవహరించే తీరు అత్యంత సహజంగా ఉంటూనే వెనకాల ఒక వ్యంగ్య నేపథ్యంలోంచి ఇవన్నీ వినిపిస్తూ ఉంటాయి. చాలా చోట్ల ఇంత చిన్న విషయాలను ఇంత చక్కగా ఎట్లా పట్టుకున్నారు అని ఆశ్చర్యమేస్తుంది. ముఖ్యంగా స్త్రీ పురుష సంబంధాలు. మగవాడు చాలా బాధలు పడుతున్నట్టు సింపతిటిక్ గా మాట్లాడుతున్నా మనకు రచయిత చెప్పకుండానే వాడి నీచత్వమూ, స్త్రీ మౌనం లోంచే ఆవిడ తాలూకు గొప్పతనమూ ఇట్టే స్ఫురిస్తుంది. దీన్ని ఒక టెక్నిక్ గా సాధించడం చాలా అసాధ్యం అని నాకు అనిపిస్తుంది. బహుశా గుండెకు తాడుకట్టి కచ్చారోడ్లమీద బట్టబయల్లో గాలికీ, దూలికీ తిప్పే వాళ్ళకే ఇది సాధ్యమవుతుంది. తమ సొంత అభిప్రాయాల్లోకి, ఆలోచనల్లోకి మూసుకుపోయి సత్యం పట్ల, వాస్తవం పట్ల తెరచుకోకుండా ఉండడం గొప్ప సాహిత్యలక్షణం కాదేమో. ఆయుష్షు తరగకుండా ఉండటానికి గుండెను ఉరపంజరంలో మందపాటి చర్మం కింద జాగ్రత్తగా కాపాడుకునే వాళ్లకు ఇది సాధ్యం కాదు. - రమణ జీవి© 2017,www.logili.com All Rights Reserved.