మీకు మంచి సాహిత్యం చదివే అలవాటు ఉందా? లేకపోయినా చదవాలనే కోరిక ఉంటె మాత్రం ఓ హెన్రీ కథలు చదవండి. అయన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రచయిత. అమెరికాలోని నార్త్ కరోలినాలో గ్రీన్స్ బోరో అనే చిన్న పట్టణంలో జన్మించారు. ఓ హెన్రీ అనేది అయన కలం పేరు. అసలు పేరు విలియం సిడ్నీపోర్టర్. పాతికేళ్లప్పుడు 1887 లో పదిహేడేళ్ల ఎథోల్ రోచ్ ని వివాహం చేసుకున్నాడు. వాళ్ళకు ఒక పాప(మార్గరెట్) ఒక బాబు పుట్టారు.
1894 లో ది రోలింగ్ స్టోన్ అనే హాస్య పత్రికను నడిపాడు. కొంతకాలం హూస్టన్ పోస్ట్ లో రిపోర్టర్ గా కాలమిస్టుగా కార్టూనిస్టుగా పనిచేశాడు. ఎప్పుడు తన చుట్టూ ఉండే మనుషుల జీవితాలను పరిశీలిస్తు ఉండేవాడు. చిన్న పెద్దా తేడా లేకుండా అందరిని పలకరిస్తూ తన కథలోకి పాత్రల్ని వెతుక్కునేవాడు. ఒక పక్క కథలు రాస్తూనే బ్యాంకు లో ఉద్యోగం చేశాడు. మనుషుల్లోని నిజాయితీని ప్రేమిస్తూ ఎందరినో తన రచనలతో ప్రభావితం చేసిన ఓ హెన్రీ తన 48వ ఏటనే మరణించారు. కథని అద్భుతమైన కోస మెరుపుతో ముగించడంలో ఓ హెన్రీని మించిన రచయిత మరొకరు లేరు, లేరు లేరు.
- డి. రంగారావు