ప్రతి మనిషి పుట్టుక వెనుక కనీసం ఒక కథ ఉంటుంది. కథలు విని పెరుగుతాం. కథలు చదవడం మొదలుపెడతాం. కథలు చెప్పడం నేర్చుకుంటాం. కాని కథలు రాయడం కష్టం. ఎక్కువమందికి కథలు చెప్పడం ఇష్టం. తక్కువ మందికి వినడం ఇష్టం. ఇంకా తక్కువమందికి చదవడం ఇష్టం. అందుచేత కథల పుస్తకాలు తక్కువ అమ్ముడుపోతాయని నాకు తెలుసు. కుర్రా జితేంద్రబాబు గారు ఓల్గాగారి 'సంతులిత' పుస్తకావిష్కరణ సభలో చెప్పినట్టు చట్టాలు చెయ్యలేని పని సాహిత్యం చెయ్యగలదు. అందుకే ఈ కథలన్నీ ఒక సామాజిక బాధ్యతగానే వ్రాశాను. అన్ని కథలలోని పాత్రలు, సంఘటనలు సమాజం నుండి తీసుకోన్నవే. చిన్న మార్పులతో కొన్ని చేర్పులతో వాటిని కథలుగా మలిచాను.
జీవితం కల్పనకన్నా రసాత్మకమైనది, భయంకరమైనది కూడా. నాకు తెలిసిన జీవితం బొబ్బిలితో మొదలై, నేను నివసించిన నగరాలు, తిరిగిన దేశాలు, పరిచయమున్న ఎందరో దేశస్థుల వల్ల విస్తృతమైనదే అని అనుకుంటున్నాను. నన్ను 'గాంధీ అన్నవారి నుండి, చంపుతాం' అన్నవారి వరకు ఉన్న కొన్ని వేలమంది నా ఆలోచనల్ని సుసంపన్నం చేశారు. అందువల్లే నేను కథలు రాయగలిగాను. ఈ కథలన్నీ మనిషి, మనిషి భవిష్యత్తు ఇంకా బాగుండాలన్న ఆశతో వ్రాసినవే.
ప్రతి మనిషి పుట్టుక వెనుక కనీసం ఒక కథ ఉంటుంది. కథలు విని పెరుగుతాం. కథలు చదవడం మొదలుపెడతాం. కథలు చెప్పడం నేర్చుకుంటాం. కాని కథలు రాయడం కష్టం. ఎక్కువమందికి కథలు చెప్పడం ఇష్టం. తక్కువ మందికి వినడం ఇష్టం. ఇంకా తక్కువమందికి చదవడం ఇష్టం. అందుచేత కథల పుస్తకాలు తక్కువ అమ్ముడుపోతాయని నాకు తెలుసు. కుర్రా జితేంద్రబాబు గారు ఓల్గాగారి 'సంతులిత' పుస్తకావిష్కరణ సభలో చెప్పినట్టు చట్టాలు చెయ్యలేని పని సాహిత్యం చెయ్యగలదు. అందుకే ఈ కథలన్నీ ఒక సామాజిక బాధ్యతగానే వ్రాశాను. అన్ని కథలలోని పాత్రలు, సంఘటనలు సమాజం నుండి తీసుకోన్నవే. చిన్న మార్పులతో కొన్ని చేర్పులతో వాటిని కథలుగా మలిచాను. జీవితం కల్పనకన్నా రసాత్మకమైనది, భయంకరమైనది కూడా. నాకు తెలిసిన జీవితం బొబ్బిలితో మొదలై, నేను నివసించిన నగరాలు, తిరిగిన దేశాలు, పరిచయమున్న ఎందరో దేశస్థుల వల్ల విస్తృతమైనదే అని అనుకుంటున్నాను. నన్ను 'గాంధీ అన్నవారి నుండి, చంపుతాం' అన్నవారి వరకు ఉన్న కొన్ని వేలమంది నా ఆలోచనల్ని సుసంపన్నం చేశారు. అందువల్లే నేను కథలు రాయగలిగాను. ఈ కథలన్నీ మనిషి, మనిషి భవిష్యత్తు ఇంకా బాగుండాలన్న ఆశతో వ్రాసినవే.© 2017,www.logili.com All Rights Reserved.