ఒలికిపోయిన వెన్నెల
రాణి నవ్వింది.
ఆ నవ్వు వింటే మునీశ్వరుడైనాసరే తపస్సు, తట్టా, బుట్టా అవతల పారేసి వచ్చేయాలి. అంతటి శక్తి వుంది ఆ నవ్వులో.
అతను ఆగాడు! ఆగుతాడని తెల్సు రాణికి!
తను నవ్వేక మొగవాడయి వుండీ ఆగకపోతే ఆ క్షణం మరణంతో సమానం ...
రాణి అతని కళ్ళల్లోకి చూస్తూ కూర్చోమని సైగ చేసింది. ఆ చూపు కూర్చోబెట్టిందతన్ని.....
“నాతో మాట్లాడాలని వచ్చి మాట మాత్రమైనా చెప్పకుండా వెళ్ళిపోతున్నావు కనుక అడగాల్సి వొచ్చింది... చెప్పు... ఎందుకొచ్చావ్?”
- అతను తలెత్తి రాణి కళ్ళల్లోకి చూసాడు.
'ఆ కళ్ళ వెనుక వెనకటి చిలిపిదనం ఏ లిపిలో వుందో చదవాలన్నంత పరిశీలనగా... అర్థం కావడంలేదు.
“ఈ కళ్ళనా చూస్తున్నావు ఇవి నీకు అర్థంకావు....” అని అదోరకంగా నవ్వి “నీ కళ్ళు నిషా నిలయాలన్నాడో కవి... నీ కళ్లు సూదంటు రాళ్ళన్నాడు మరో రసికుడు... మా ఆవిడ చీకిరికళ్ళు ఆపరేషన్ చేయించేసి నీకళ్ళు దానికి పెట్టించేస్తాను. ఎంతకిస్తావ్ నీకళ్ళు? అన్నాడో ధనికుడు.... ఈ కళ్ళు... ఇవి కాదూ... ఊ... సర్లే... అన్నట్లు నీ దగ్గిరేవైనా డబ్బుందా?” అంది రాణి.
“ఉంది. ఎంత?”
“నన్ను నిద్రపుచ్చడానికి కావల్సినంత”
“అంటే”.............
© 2017,www.logili.com All Rights Reserved.