ఎందుకు అతను నా మనసులోకి అంతగా నిండిపోయారు అని అనుకుంటుంది. అవును ఒకసారి ఆలోచిద్దాం అనుకుంటుంది ఆ ఆలోచనల ముగింపుకు వచ్చేటప్పటికి మరి అల్లుకుపోదా ఏమిటి అనుకుంటుంది. నిజంగా అతడి మనసులో నేను కూడా ఇంతలా ఉన్నానా అనే సంశవచ్చిన క్షణంలోనే ఎందుకులేను.. అతని ఊపిరి కూడా నేనే కదా. నిజమే తాము ఇద్దరం ఇలా ఒకరి మనసులో ఒకరం గాలి దూరను కూడా సందులేకుండా దూరి పోయామేంటి. ఇదే కదా జీవితం అంటే. అతను తన మనసులో ఉన్న భావాన్ని వెన్నెల గువ్వ దగ్గర ఏ కొంత కూడా దాచుకోకుండా బట్టబయలు చేస్తాడు.
వెన్నెల గువ్వ గురించి గొప్ప గొప్ప కావ్యాలు రాస్తాడు. ఆమె అందాన్ని చాలా గొప్పగా పొగుడుతాడు. పోల్చడానికి ఏమీ లేనటువంటి అద్భుతమైన అందం అని అంటుంటాడు. నువ్వు నవ్వితే పారిజాతాలు రాలిపడ్డట్టు ఉంటాయి అంటాడు. నువ్వు మాట్లాడితే ఇత్తడి బిందెమీద తమల పాకుతో కొడితే వచ్చే అద్భుతమైన శబ్దం వస్తుంది అంటాడు. అతను అంటాడు అస్సలు నేను బతుకుతున్నదే నీకోసం నువ్వు లేని నాడు నాకు శ్వాస తీసుకునే అవసరమేరాదు అంటాడు.
నీ జ్ఞాపకాలను సజీవం చేస్తాను అంటాడు. ఏంటో అతని ధ్యాస ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు తాను ఎక్కువగా రాస్తున్నాడు అతడి రాతలు చదివినప్పుడల్లా ఈ అక్షరాలు నా కోసమేగా సృష్టింపబడ్డాయి అనిపిస్తుంది. ఇలా ఆలోచిస్తోంది వెన్నెల గువ్వ. వెన్నెల తనను చూసి నవ్వుతున్నట్టుగా అనిపించింది. చల్లని గాలి ఒకటి రివ్వున వచ్చి ఆమె పమిటతో సరసమాడినట్టు అనిపించింది. పందిరిమీద ఉన్న పూలు సందడి చేస్తున్నాయి. ఎక్కడో రెండు పక్షులు సృష్టి కార్యం జరుపుకుంటున్నట్టు అలికిడి అయింది. ఓ వైపున ఏపుగా పెరిగిన మొగలి పొదలో ఏదో చిన్న అలికిడి అయినట్టు భ్రమ కలిగింది. తరువాత ఏం జరిగిందో ఈ పుస్తకం చదివిఒ తెలుసుకొనగలరు.
ఎందుకు అతను నా మనసులోకి అంతగా నిండిపోయారు అని అనుకుంటుంది. అవును ఒకసారి ఆలోచిద్దాం అనుకుంటుంది ఆ ఆలోచనల ముగింపుకు వచ్చేటప్పటికి మరి అల్లుకుపోదా ఏమిటి అనుకుంటుంది. నిజంగా అతడి మనసులో నేను కూడా ఇంతలా ఉన్నానా అనే సంశవచ్చిన క్షణంలోనే ఎందుకులేను.. అతని ఊపిరి కూడా నేనే కదా. నిజమే తాము ఇద్దరం ఇలా ఒకరి మనసులో ఒకరం గాలి దూరను కూడా సందులేకుండా దూరి పోయామేంటి. ఇదే కదా జీవితం అంటే. అతను తన మనసులో ఉన్న భావాన్ని వెన్నెల గువ్వ దగ్గర ఏ కొంత కూడా దాచుకోకుండా బట్టబయలు చేస్తాడు. వెన్నెల గువ్వ గురించి గొప్ప గొప్ప కావ్యాలు రాస్తాడు. ఆమె అందాన్ని చాలా గొప్పగా పొగుడుతాడు. పోల్చడానికి ఏమీ లేనటువంటి అద్భుతమైన అందం అని అంటుంటాడు. నువ్వు నవ్వితే పారిజాతాలు రాలిపడ్డట్టు ఉంటాయి అంటాడు. నువ్వు మాట్లాడితే ఇత్తడి బిందెమీద తమల పాకుతో కొడితే వచ్చే అద్భుతమైన శబ్దం వస్తుంది అంటాడు. అతను అంటాడు అస్సలు నేను బతుకుతున్నదే నీకోసం నువ్వు లేని నాడు నాకు శ్వాస తీసుకునే అవసరమేరాదు అంటాడు. నీ జ్ఞాపకాలను సజీవం చేస్తాను అంటాడు. ఏంటో అతని ధ్యాస ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు తాను ఎక్కువగా రాస్తున్నాడు అతడి రాతలు చదివినప్పుడల్లా ఈ అక్షరాలు నా కోసమేగా సృష్టింపబడ్డాయి అనిపిస్తుంది. ఇలా ఆలోచిస్తోంది వెన్నెల గువ్వ. వెన్నెల తనను చూసి నవ్వుతున్నట్టుగా అనిపించింది. చల్లని గాలి ఒకటి రివ్వున వచ్చి ఆమె పమిటతో సరసమాడినట్టు అనిపించింది. పందిరిమీద ఉన్న పూలు సందడి చేస్తున్నాయి. ఎక్కడో రెండు పక్షులు సృష్టి కార్యం జరుపుకుంటున్నట్టు అలికిడి అయింది. ఓ వైపున ఏపుగా పెరిగిన మొగలి పొదలో ఏదో చిన్న అలికిడి అయినట్టు భ్రమ కలిగింది. తరువాత ఏం జరిగిందో ఈ పుస్తకం చదివిఒ తెలుసుకొనగలరు.© 2017,www.logili.com All Rights Reserved.